EPAPER

Ponnam Counter to KCR: కేసీఆర్ చీల్చి చెండాడితే మేం చూస్తూ ఊరుకోం: మంత్రి పొన్నం

Ponnam Counter to KCR: కేసీఆర్ చీల్చి చెండాడితే మేం చూస్తూ ఊరుకోం: మంత్రి పొన్నం

Minister Ponnam Strong Counter to KCR: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీ సీఎం, బీఆర్ఎస్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ చీల్చి చెండాడితే మేం చూస్తూ ఊరుకోం. బడ్జెట్ కు ప్రతిపక్ష నాయకుడి ఆమోదం అవసరంలేదు. కేంద్ర బడ్జెట్ పై మాట్లాడని కేసీఆర్.. రాష్ట్ర బడ్జెట్ పై విమర్శలు చేస్తున్నారు. 7 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంపై చర్చకు సిద్ధమా? ధరణి పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రైతులను నరకయాతన పెట్టింది. కాళేశ్వరంతోనే నీళ్లు ఇచ్చామని కలరింగ్ ఇచ్చారు. కాళేశ్వరం ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరించలేదు. కాళేశ్వరం నుంచి కరీంనగర్ కు ఎన్ని టీఎంసీల నీళ్లు ఇచ్చారో చెప్పాలి. వర్షాకాలంలో నీళ్లు వస్తున్నాయి.. కానీ, తాము ప్రాజెక్టులు కడితేనే నీళ్లు వస్తున్నాయని బీఆర్ఎస్ చెప్పుకుంటోంది. బీజేపీతో కేసీఆర్ దోస్తీకి ఆయన వ్యాఖ్యలే నిదర్శనం’ అంటూ మంత్రి పొన్నం మండిపడ్డారు.


Also Read: కేసీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్..

అదేవిధంగా కేసీఆర్ పై జగ్గారెడ్డి కూడా ఫైరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రేవంత్.. భట్టిలు పెట్టింది మంచి బడ్జెట్ ఇది. కేసీఆర్ ఇస్ట్మాన్ కలర్ బడ్జెట్ అన్నారు. కేసీఆర్ ది హైప్ బడ్జెట్.. కాంగ్రెస్ బడ్జెట్ ప్రాక్టికల్. కేసీఆర్ బడ్జెట్..ఊహల బడ్జెట్. కాంగ్రెస్ ది వాస్తవ బడ్జెట్. ఊహలకు.. వాస్తవానికి తేడా ఉంది. భట్టి బడ్జెట్ బిందల్లో నీళ్లు ముంచుకుని తాగినట్టు ఉంది. కేసీఆర్ బడ్జెట్ చెరువులో నీళ్లు తెచ్చుకుని తాగినట్టుగా మాటకు కట్టుబడి.. వాస్తవానికి దగ్గరలో కాంగ్రెస్ బడ్జెట్ ఉంటుంది. ఎవరైనా దావతి ఇస్తే.. నాన్ వెజ్ కి ప్రియార్టీ ఇస్తాం. కేసీఆర్ బడ్జెట్ ఎట్లా ఉంటది అంటే దావతికి పోతే మటన్ బిర్యాని తిని రావచ్చు అన్నట్టు ఉంటది. ఊరందరికీ మటన్ బిర్యానీ వండుతున్నా అని ప్రచారం చేస్తారు.. పొయ్యి మీద గిన్నెలు పెడతారు కానీ, మటన్ ఉండదు. మటన్ ఎప్పుడు వస్తుందో అని మనం ఎదురు చూస్తాం.. అక్కడ మటన్ లేదు.. ఏం లేదు. ప్రజలను పదేళ్ల నుంచి బడ్జెట్ విషయంలో కేసీఆర్ కూడా ఈ విధంగానే మోసం చేశారు. పప్పు.. మజ్జిగ.. ఇదే ఉంది తృప్తిగా తినండి అని నిజం చెప్పినట్టు మా ప్రభుత్వం పని తీరు ఉంటది. మంచి బడ్జెట్ పెట్టిన సీఎం రేవంత్, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబుకు శుభాకాంక్షలు.


ఆరు గ్యారెంటీలకు సరిపడా నిధులు కేటాయించారు. వ్యవసాయానికి రూ. 72 వేల కోట్లు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రైతు ప్రభుత్వం అని నిరూపించుకున్నది. హైదరాబాద్ కి రూ. 10 వేల కోట్లు ఇచ్చి మంచి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు గుండెకాయ లాంటిది హైదరాబాద్. రియల్ ఎస్టేట్ పెరుగుతుంది.. కార్మికులు.. పరిశ్రమలు అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాద్‌కు ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంది. దేశంలో వ్యాపారస్తులు హైదరాబాద్ కు అధిక ప్రాధాన్యత ఇస్తారు. బీఆర్ఎస్ ఇలా చేయలేదు.. హైదరాబాద్ కు మీరు నిధులు ఖర్చు పెట్టలేదు.. మేము పెడుతున్నాం. మేము హైదరాబాద్ కు రూ. 10 వేల కోట్లు పెడితే కేసీఆర్ కుళ్లుకుంటున్నారు. కాంగ్రెస్ వేసిన ఫ్లైఓవర్లకు కేటీఆర్ రిబ్బన్ కట్ చేశారు’ అంటూ జగ్గారెడ్డి ఫైరయ్యారు.

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×