EPAPER

Donald Trump: ఆమెకు అమెరికాను పాలించే అర్హత లేదు: ట్రంప్

Donald Trump: ఆమెకు అమెరికాను పాలించే అర్హత లేదు: ట్రంప్

Donald Trump latest comments(Today international news headlines):

రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షురాలు కమలా హారిస్‌పై విమర్శలు గుప్పించారు. అమెరికాను పాలించే అర్హత ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్‌కు లేదని ట్రంప్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నార్త్ కరోలినాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ట్రంప్, కమలా హారిస్ తీవ్రమైన వామపక్ష ఉన్మాది అని అన్నారు. ట్రంప్ తన ప్రసంగంలో కమలా హారిస్ పేరు దాదాపు 45 సార్లు ప్రస్తావించడం గమనార్హం.


మూడున్నర ఏళ్లుగా అధ్యక్షుడు బైడెన్ యొక్క ప్రతీ వైఫల్యం వెనుక కమలా హారిస్ ఉన్నారని ఆరోపించారు. ఆమె ఒక తీవ్రమైన వామపక్ష ఉన్మాది అని అన్నారు. ఆమె అధికారంలోకి వస్తే దేశాన్ని సర్వనాశనం చేస్తుందని అన్నారు. కానీ తాము అది జరగనివ్వబోమని ట్రంప్ తెలిపారు. మూడున్నరేళ్లలో వారు దేశానికి ఏమీ చేయలేదన్నారు. తాను అధికారంలోకి వస్తే మొదటి దఫాలో చేసిన దానికంటే అద్భుతమైన పనులు చేసి చూపిస్తామని ట్రంప్ తెలిపారు.

ఇదిలా ఉంటే మరో వైపు డెమెక్రటీస్ పార్టీతో పాటు దేశాన్ని ఒక్కతాటిపైకి తీసుకురావడానికే తాను ఎన్నికల రేసు నుంచి వైదొలగినట్లు బైడెన్ తెలిపారు. తర్వాత తరానికి బాధ్యతలను అప్పగించడమే ఉత్తమమైన మార్గమని భావించానని అన్నారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వైదొలగినట్లు ప్రకటించిన తర్వాత మొదటగా ఓవల్ ఆఫీస్ నుంచి మాట్లాడిన బైడెన్ ఈ మేరకు వివరణ ఇచ్చారు.
పదవుల కంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే ముఖ్యమంటూ తాను తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు. అమెరికా రాజకీయాల్లో స్పష్టమైన విభజన కనిపిస్తోందని అన్నారు. దానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. నియంత, నిరంకుశుల కంటే దేశం గొప్పదన్నారు. పరోక్షంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ను విమర్శించారు.


Related News

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Big Stories

×