EPAPER

7 Seater Cars At Half Price: హైదరాబాద్‌లో సగం ధరకే కార్లు.. ఫ్యామిలీకి పర్ఫెక్ట్.. సింపుల్‌గా కొనేయండి!

7 Seater Cars At Half Price: హైదరాబాద్‌లో సగం ధరకే కార్లు.. ఫ్యామిలీకి పర్ఫెక్ట్.. సింపుల్‌గా కొనేయండి!

7 Seater Cars At Half Price In Hyderabad: ఆటోమొబైల్ మార్కెట్ దేశంలో వేగంగా పరుగెడుతోంది. సరికొత్త టెక్నాలజీతో రోజుకో కొత్త కారు మార్కెట్‌లోకి వస్తుంది. వీటితో పాటు సెకండ్ హ్యండ్ కార్ల మార్కెట్ కూడా దూసుకుపోతుంది. ఈ సెకండ్ హ్యండ్ కార్ల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుత కాలంలో సెకండ్ హ్యాండ్ కార్లను సులభంగా కొనుగోలు చేస్తున్నారు. వీటి కొనుగోలులో మోసపోవడానికి ఆస్కారం లేదు. ఆన్‌లైన్ వెబ్‌సైట్లు ద్వారా దక్కించుకోవచ్చు. ఈ క్రమంలో మీరు సెకండ్ హ్యాండ్ 7 సీటర్ కార్ కొనాలని చూస్తుంటే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.


Maruti Suzuki Ertiga
స్పీన్నీ వెబ్‌సైట్‌లో ప్రస్తుతంమారుతి సుజుకి ఎర్టిగా VXI 2015 మోడల్ రూ.5 లక్షలతో అందుబాటులో ఉంది. మీరు ఈ కారును వైట్ కలర్‌లో పొందుతారు. ఇది మొత్తం 75,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. దీని బీమా జూలై 2025 వరకు వాలిడిటీతో ఉంది. ఈ వెహికల్  అన్ని వివరాలు Spinnyలో అందుబాటులో ఉన్నాయి. ఫోటోలలో కారు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. మీరు ఈ కారును సులభమైన EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు ఎర్టిగాను కొనుగోలు చేయాలనుకుంటే స్పిన్నీని సంప్రదించండి.

Also Read: Hyundai Upcoming Cars: గుడ్ న్యూస్ చెప్పిన హ్యుందాయ్.. త్వరలో 5 కొత్త కార్లు.. లిస్ట్‌లో ఉన్నవి ఇవే!


Toyota Innova
ప్రస్తుతం ఈ వెహికల్ కార్ దేఖో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. 2013 టయోటా ఇన్నోవా 2.5 VX డీజిల్, 7 సీట్ల మోడల్. దీని డిమాండ్ ధర రూ.5 లక్షలుగా చెబుతున్నారు. మీరు దీన్ని సులభమైన EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ వాహనం మొత్తం 1,59,483 కిలోమీటర్లు నడిచింది. ఇందులో 8 మంది సులభంగా ప్రయాణించవచ్చు. టయోటా ఒక SUV. దూర ప్రయాణాలకు ఇది ఉపయోగంగా ఉంటుంది. కుటుంబం మొత్తం ఇందులో కలిసి ప్రయాణించవచ్చు. ఈ కారును కొనుగోలు చేసే ముందు దాన్ని సరిగ్గా తనిఖీ చేయండి.  డ్రైవ్ చేయడానికి కూడా ప్రయత్నించండి.

Maruti Suzuki Ertiga VXi
2012 మారుతి ఎర్టిగా కార్ దేఖోలో కూడా అందుబాటులో ఉంది. ఈ కారు మొత్తం 56,000 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇది మాన్యువల్ మోడల్. దీని ధర రూ.3.40 లక్షలుగా ఉంచారు. కాగా ప్రస్తుతం కొత్త ఎర్టిగా ధర రూ.7.72 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.  ఇది డార్క్ గ్రే కలర్‌లో అందుబాటులో ఉంది.  ఉపయోగించిన కారును కొనుగోలు చేసేటప్పుడు కూడా దీన్ని తనిఖీ చేయండి.

Also Read: Maruti Suzuki Alto K10 CNG Finance: మారుతి ఆల్టో కె10.. రూ.లక్షకే ఇంటికి తీసుకెళ్లొచ్చు.. ఎలానో తెలుసా?

Note: మీరు ఏ కారును కొనుగోలు చేయబోతున్నారో దానిని చిన్న టెస్ట్ డ్రైవ్ చేయండి. ఇంజిన్ నుండి శబ్దం రాకుండా చూసుకోండి. శబ్దం లేకపోతే వాహనం సస్పెన్షన్, క్లచ్, బ్రేక్‌లు, గేర్ షిఫ్టింగ్‌ను చెక్ చేయండి. కార్ టెంపరేచర్ చూడండి, అది సాధారణంగా ఉండేలా చూసుకోండి. కారులో విపరీతమైన వైబ్రేషన్ ఉంటే కొనుగోలు చేయకండి. వాహనం అన్ని పేపర్లను సరిగ్గా తనిఖీ చేయండి. వాహనం  RC, రిజిస్ట్రేషన్, బీమా పత్రాలను సరిగ్గా తనిఖీ చేయండి. అలానే గత 2-3 సంవత్సరాలలో నో క్లెయిమ్ బోనస్‌ని ట్రాక్ చేయండి. అన్ని పేపర్‌లను ఒరిజినల్‌లో మాత్రమే చూడాలి.

Related News

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

iPhone Craze: ఐఫోన్ పిచ్చెక్కిస్తోందా? భారతీయుల స్వేచ్ఛ హరీ.. ఎలాగో తెలుసా?

Onion Export Restrictions: ఉల్లి రైతులకు శుభవార్త.. ఎన్నికల దృష్ట్యా ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన కేంద్రం..

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Vande Bharat Metro Train: వందే భారత్ ‘మెట్రో రైల్’ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ మరీ అంత తక్కువా?

Govt Schemes Interest rate up to 8.2%: అత్యధిక వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకాలివే.. పెట్టుబడి పూర్తిగా సురక్షితం..

Big Stories

×