EPAPER

Health and Fitness : ఫిట్‌గా ఉండాలంటే చేయాల్సిన పనులు

Health and Fitness : ఫిట్‌గా ఉండాలంటే చేయాల్సిన పనులు

Health and Fitness :శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే కొద్దిపాటి వ్యాయామంతో పాటు పౌష్టికాహారం, వేళ‌కు భోజ‌నం చేయ‌డం, త‌గినంత నిద్రపోవడం చేస్తే చాలంటున్నారు నిపుణులు.


ఫిట్‌గా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకు క‌నీసం 3 లీట‌ర్ల నీటిని తాగాలి. రోజూ ఉద‌యం నిద్ర లేవ‌గానే క‌నీసం లీట‌ర్ నీటిని తాగడం అల‌వాటు చేసుకోవాలి. త‌క్కువ కొవ్వు ఉండే పాలు, పాల ఉత్పత్తుల‌ను తీసుకోవాలి. వెన్న తీసిన పాల‌ను తాగాలి. బాదంప‌ప్పు, జీడిప‌ప్పు, ప‌ల్లీలులాంటివాటిని రోజూ గుప్పెడు తినాలి. దీంతో ఆరోగ్యక‌ర‌మైన కొవ్వులు మన శరీరానికి లభిస్తాయి. ఇవి చెడు కొవ్వుల‌ను కూడా క‌రిగిస్తాయి. అంతేకాకుండా విట‌మిన్ ఇ పుష్కలంగా అందుతుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతో పాటు చ‌ర్మం, జుట్టు స‌మ‌స్యల‌ను ప‌రిష్కరిస్తుంది. పురుషుల్లో సంతాన లోపం సమస్యను కూడా లేకుండా చేస్తుంది. తాజా ప‌చ్చి కూర‌గాయ‌లు తింటూ ఉండాలి.

రోజూ ఉల్లిపాయ‌లు, టమాటాలు, కీర‌దోస‌, క్యాబేజీ, క్యారెట్‌, క్యాప్సికంలాంటి కూర‌గాయ‌ల‌ను ప‌చ్చిగా ఉండ‌గానే తినాలి. అయితే ప‌చ్చిగా తింటే సాల్మొనెల్లా బాక్టీరియా వ్యాప్తి చెందే అవ‌కాశాలు ఉంటాయి కాబట్టి బాగా కడిగిన తర్వాత తినాలి. లేదంటే కొద్దిగా ఉడికించి కూడా తీసుకోవచ్చు. దీంతో ఫైబ‌ర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ల‌భిస్తాయి. ఇవి పొట్ట ద‌గ్గరి కొవ్వును క‌రిగించ‌డమే కాకుండా రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. కార్బొ హైడ్రేట్లు అధికంగా ఉండే పిండి ప‌దార్థాలను తగ్గించాలి. 3 లేదా 4 చ‌పాతీల‌ను లేదా ఒక క‌ప్పు అన్నం మాత్రమే తినాలి. దీంతో శ‌రీరానికి త‌గిన‌న్ని కార్బొహైడ్రేట్లు ల‌భిస్తాయి. ఎక్కువగా తీసుకుంటే శ‌ర‌రంలో ఆ పిండి ప‌దార్థాలు కొవ్వులుగా మారుతాయి. దీంతో అధిక బ‌రువు పెరుగుతారు. నిత్యం క‌నీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే బరువు తగ్గుతారు. రోజూ క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు నిద్రపోవాలి.


Related News

Chiranjeevi : పక్కొడి పనిలో వేలు పెడుతారు… చాలా కాన్ఫిడెంట్‌గా చిరుకి కౌంటర్

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Big Stories

×