Eye twitching: సాధారణంగా కొన్ని సార్లు కన్ను అదురుతుంది. ఈ క్రమంలో ఆడవారిలో కన్ను అదిరితే అది కూడా ఎడమ కన్ను అయి ఉంటే అదృష్టం కలిసి వస్తుంది. ఏదో మంచి జరగబోతుందని అంటుంటారు. అదే మగవారిలో అయితే కుడి కన్ను అదిరితే వారికి ఏదో మంచి జరగబోతుందని భావిస్తారు. ఈ తరుణంలో ఇరువురికి వ్యతిరేకంగా కన్ను అదిరితే ఏదో కీడు జరగబోతుందని అనుకుంటారు. ఇలాంటి సంకేతాలను నమ్ముతుంటారు చాలా మంది. అసలు కన్ను అదిరితే నిజంగా ఏం జరుగుతుంది అనే విషయం మాత్రం ఎవరికి తెలియదు. అసలు కన్ను ఎందుకు అదురుతుంది అనే విషయం గురించి అసలు వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్ను అదరడం వెనుక అసలు ఇలాంటివి అన్నీ కేవలం మూఢ నమ్మకాలు అని శాస్త్రవేత్తలు అంటున్నారు. కేవలం శారీర ఇబ్బందుల వల్లే కన్ను అదురుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే కన్ను అదరడానికి చాలా శాస్త్రీయ కారణాలు ఉన్నాయని అందులో ముఖ్యంగా కళ్లలో అలెర్జీ, నీరసం, కళ్లు పొడిబారడం, ఆల్కాహాల్ తీసుకోవడం వంటి అనేక రకాల కారణాలు ఉంటాయని అంటున్నారు. అంతేకాదు మెదడు నరాల లోపాల వల్ల కూడా కన్ను అదురుతుందని అంటున్నారు.
తరచూ టీవీ, ల్యాప్ టాప్, మొబైల్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను చూడడం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. అందువల్ల కళ్లపై ఏర్పడే ఒత్తిడి కారణంగా కూడా కన్ను అదురుతుందని నిపుణులు అంటున్నారు. ఇక కళ్లకు విశ్రాంతి లేకపోవడం కూడా మరొక కారణం కూడా అని అంటున్నారు. ఇక నిద్రలేమి వంటి సమస్యలు ఉండడం కూడా దీనికి కారణం అని కూడా చెబుతున్నారు. తరచూ ఉండే పనుల కారణంగా కనీసం 7 నుంచి 9 గంటల పాటు నిద్ర ఉండాలని, నిద్ర లేకపోవడం వల్ల కూడా కళ్లపై ఒత్తిడి పడి కన్ను అదురుతుందని అంటున్నారు. చాక్లెట్లు, కెఫిన్ కు సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా కన్ను అదురుతుందని చెబుతున్నారు.