EPAPER

Janhvi Kapoor: పక్షవాతం వచ్చిందనుకున్నాను.. బాత్ రూమ్ కు కూడా వెళ్లలేకపోయా

Janhvi Kapoor: పక్షవాతం  వచ్చిందనుకున్నాను.. బాత్ రూమ్ కు కూడా వెళ్లలేకపోయా

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. తెలుగు, హిందీ భాషల్లో అసలు తీరిక లేకుండా ఆమె సినిమాలు చేస్తుంది. ఇవి కాకుండా యాడ్స్, ఫొటోషూట్స్.. వీటన్నింటితో బిజీగా ఉండడం వలన ఆమె ఆరోగ్యాన్ని పట్టించులేదు. దీంతో ఈ మధ్యన జాన్వీ అనారోగ్యం పాలైన విషయం తెల్సిందే.


ఫుడ్ పాయిజనింగ్ అవ్వడంతో జాన్వీ మూడురోజులు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంది. ఈ మధ్యనే ఆమె డిశ్చార్జ్ అయ్యిన విషయం కూడా విదితమే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జాన్వీ.. తన అనారోగ్యం గురించి నోరువిప్పింది.

” గత కొన్నిరోజులుగా వ‌రుస‌గా షూటింగ్ ల‌లో పాల్గొంటున్నాను. వాటితో పాటు ప్ర‌మోష‌న్స్ తోనూ బిజీగా గ‌డిపాను. అంతేకాకుండా విశ్రాంతి లేకుండా వ‌రుస ప్ర‌యాణాలు చేసాను. దీంతో బాగా వీక్ అయ్యాను. ఓపాట షూటింగ్ కోసం చెన్నై వెళ్లాను. అక్క‌డ చాలాసార్లు బ‌య‌ట తిన్నాను. దీంతో మొద‌ట క‌డుపులో నొప్పిగా అనిపించింది. ఆ త‌ర్వాత బాగా నీర‌సించాను.


కడుపులో భ‌రించ‌లేనంత నొప్పి, ఒంట్లో ఒణుకు మొద‌లైంది. దీంతో ఆందోళ‌న‌కు గుర‌య్యాను. ఆ సమయంలోనే హైద‌రాబాద్ వ‌చ్చేందుకు ప్లైట్ ఎక్కే ముందు ప‌క్ష‌వాతానికి గురైన భావ‌న క‌లిగింది. కాళ్లు, చేతులు కదపలేకపోయాను. చివ‌రికి స‌హాయం లేకుండా వాష్ రూమ్ కి కూడా వెళ్ల‌లేక‌పోయాను. న‌డ‌వ‌డానికి ఓపిక‌లేద‌నిపించింది.

ఇక ఆసుపత్రికి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నా. మూడు రోజుల పాటు అక్క‌డే చికిత్స తీసుకున్నాను. అప్పుడే అర్ద‌మైంది అన్నింటి కంటే ఆరోగ్యం చాలా ముఖ్య‌మ‌ని. అక్కడ ఉన్న‌ని రోజులు తిరిగి డాన్సు చేయ‌గ‌ల‌నా? లేదా? అని భ‌య‌ప‌డ్డా. ఇప్పుడు కొంచెం పర్లేదు. కోలుకున్నాను. షూటింగ్స్ కు వెళ్తున్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జాన్వీ.. తెలుగులో దేవర, RC16 సినిమాలు చేస్తోంది.

Related News

Pushpa 2 : అక్టోబరే డెడ్ లైన్… ఇక చరణ్ తో తాడో పేడో..

Game Changer: అల్లు అర్జున్ తో పోటీ.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Tollywood: జానీ మాస్టర్ కన్నా ముందు టాలీవుడ్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా.. ?

Niharika Konidela: తమిళ తంబీల మనసు దోచేస్తున్న నిహారిక.. డ్యాన్స్, రొమాన్స్ అదరగొట్టేసిందిగా!

Naga Chaithanya – Sobhitha Dulipala : సీక్రెట్ గా మ్యారేజ్ ప్లాన్ చేస్తున్న చై – శోభిత.. ఇదేం ట్విస్ట్ బాబు..

Comedian Ali: పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఆలీ..

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ వీక్‌నెస్ అదే, అక్షయ్ కుమార్‌కు అలా చెప్తేనే వింటాడు.. దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

Big Stories

×