EPAPER

CM Revanth Reddy: కేంద్రానికి భారీ షాకిచ్చిన తెలంగాణ.. ఈ నెల 27న..

CM Revanth Reddy: కేంద్రానికి భారీ షాకిచ్చిన తెలంగాణ.. ఈ నెల 27న..

CM Revanth Reddy Comments on Union Budget: బడ్జెట్ పై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సంద్రర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ దేశ అభివృద్ధికి బాటలు వేశారు. వారి స్ఫూర్తితో ఇందిరాగాంధీ ఎన్నో సరళీకృత విధానాలను తీసుకొచ్చారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత సోనియాగాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేశారు. తెలంగాణ అభివృద్ధికి కావాల్సినవన్నీ విభజన చట్టంలో పొందుపరిచి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. విభజన హామీలు అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. రాష్ట్రంలో మేం అధికారంలోకి రాగానే కేంద్ర పెద్దలను కలిసి మా విజ్ఞప్తులు ఇచ్చాం. ఎవరి దయా దాక్షిన్యాలతో నాకు ముఖ్యమంత్రి పదవి రాలేదు. ఎవరినో పెద్దన్న అంటే నాకు ఈ పదవి రాలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు సార్లు ప్రధానిని కలిశా.. 18 సార్లు కేంద్ర మంత్రులను కలిశాం. తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే కలిశాం తప్ప.. ఎవరి దగ్గరో వంగిపోవడానికో.. లొంగిపోవడానికో కాదు..


CM Revanth Reddy
CM Revanth Reddy

తెలంగాణపై కేంద్రానిది వివిక్ష మాత్రమే కాదు.. కక్ష పూరిత వైఖరి. కొంతమంది త్యాగాలు చేశామని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే కాకుండానే కొందరికి మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ అని వాళ్లు గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చేది 43 పైసలే.. బీహార్ కు రూ.7.26 పైసలు. తెలంగాణ నుంచి రూ. 3 లక్షల కోట్లకుపైగా పన్నుల రూపంలో ఇస్తే.. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేది రూ. 1 లక్షా 68వేల కోట్లు మాత్రమే. మన హక్కులు మనకు ఇవ్వకపోవడం వల్లే ఈ అంశంపై సభలో చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది.

Also Read: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం.. ఆమోదం తెలిపిన సభ


ఐదు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్నది ఎంత? దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్నది రూ.22 లక్షల 26 వేల కోట్లు. కేంద్రం ఐదు రాష్ట్రాలకు తిరిగి ఇచ్చేది రూ.6 లక్షల 42వేల కోట్లు మాత్రమే. యూపీ పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చేది రూ. 3 లక్షల 41వేల కోట్లు మాత్రమే. కానీ, యూపీకి కేంద్రం తిరిగి ఇచ్చేది రూ. 6 లక్షల 91వేల కోట్లు. ఐదు రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే యూపీకి చెల్లించేది ఎక్కువ.. ఇదీ కేంద్రం వివక్ష. దేశం 5 ట్రిలియన్ ఎకానమీ సాధించాలంటే హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ప్రధానికి స్పష్టంగా చెప్పాం. మూసీ అభివృద్ధికి, మెట్రో విస్తరణకు, ఫార్మా అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరాం. ఐఐఎం, సైనిక్ స్కూల్ ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. సభలో పార్టీలు, వ్యక్తుల ప్రయోజనాల కోసమే కొంతమంది మాట్లాడటం శోచనీయం. అందరం ఏకతాటిపై ఉంటే కేంద్రం మెడలు వంచి నిధులు సాధించుకోవటం పెద్ద కష్టం కాదు. రాష్ట్రాలకు న్యాయంగా దకాల్సిన వాటా దక్కడంలేదు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆఖరు నిముషం వరకు ప్రయత్నం చేశాం. తెలంగాణ హక్కులకు భంగం కలిగించినందుకు, నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×