EPAPER

Team India Practice in Srilanka : గంభీర్ ఆధ్వర్యంలో శ్రీలంకలో ప్రాక్టీస్ షురూ

Team India Practice in Srilanka : గంభీర్ ఆధ్వర్యంలో శ్రీలంకలో ప్రాక్టీస్ షురూ

Team India Practice in Srilanka : టీమ్ ఇండియా జట్టు శ్రీలంక చేరుకుంది. ఆ దేశంలోనే మూడో అతిపెద్ద స్టేడియం అయిన పల్లెకెలె స్టేడియంలో ప్రాక్టీసు షురూ చేశారు. హెడ్ కోచ్ గౌతంగంభీర్ ఆధ్వర్యంలో తొలిరోజు ప్రాక్టీస్ సెషన్ ప్రారంభమైంది. బ్యాటర్లు, బౌలర్లు మ్యాచ్ ప్రాక్టీసు మొదలెట్టారు. తొలి సెషన్ లో ఆటగాళ్లు ఎక్కువగా క్యాచ్ లు ప్రాక్టీస్ చేశారు. అలాగే బ్యాటింగ్ ప్యాడ్లతో రన్నింగ్ అటూ ఇటూ వికెట్ల ముందు పరుగులు పెట్టారు.


శ్రీలంకతో ఆడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వారు ఆట ఎలా ఆడినా, ఫీల్డింగు నైపుణ్యం చాలా బాగుంటుంది. చిరుతకన్నా వేగంగా గ్రౌండులో పరుగులు పెడతారు. మూడు పరుగులు వచ్చే చోట రెండు పరుగులే వస్తాయి. అందుకే గంభీర్ రన్స్ ప్రాక్టీసు చేయించాడని అంటున్నారు. అలాగే అప్పుడప్పుడు మ్యాచ్ లో మనవాళ్లు క్యాచ్ లు వదిలేస్తున్నారు. అందుకే డైవింగ్ క్యాచ్ లు, స్లిప్ క్యాచ్ లు, బౌండరీ లైన్ల వద్ద క్యాచ్ లు ప్రాక్టీస్ చేయించాడు. ఇకపోతే గంభీర్ ఇద్దరిపై ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు. ఒకరు శివమ్ దుబె, మరొకరు సంజూశాంసన్ ఇద్దరికి బ్యాటింగ్ టెక్నిక్కులు నేర్పించాడని అన్నారు.

Also Read : పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్.. ఆమెనా?


ఇకపోతే భారత మాజీ ఆల్ రౌండర్ అభిషేక్ నాయర్, నెదర్లాండ్స్ బ్యాటర్ టెన్ డస్కాటె హెడ్ కోచ్ గంభీర్ సహాయ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ద్రవిడ్ టీమ్ లో ఉన్న ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కొనసాగుతున్నాడు. ఇందుకు కారణం కూడా చెబుతున్నారు. టీ 20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో సూర్యకుమార్ పట్టిన క్యాచ్ కారణంగానే కప్ వచ్చిందనే సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇవన్నీ ప్రాక్టీస్ చేయించింది దిలీప్ కావడంతో తన సేవలను గుర్తించి మళ్లీ తీసుకున్నారు.

ప్రస్తుతానికి సాయిరాజ్ బహుతులే తాత్కాలిక బౌలింగ్ కోచ్ గా ఉన్నాడు. సూర్యకుమార్ నేత్రత్వంలోని 15మంది సభ్యుల బృందం సోమవారమే శ్రీలంక చేరుకుంది. లంకతో ఈ నెల 27న తొలి టీ 20 ఆడనుంది. మరోవైపు చరిత్ అసలంకను టీ 20కి శ్రీలంక కెప్టెన్ గా నియమించారు.

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ ( వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, సిరాజ్

శీలంక జట్టు: అసలంక, కుశాల్ పెరీరా, నిశాంక, అవిష్క, కుశాల్ మెండిస్, శానక, హసరంగ, వెల్లలాగే, తీక్షణ, పతిరన, తుషార, చీమర, చండీమాల్, కమిందు, చమిందు విక్రమసింఘే, బిసుర ఫెర్నాండో

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×