EPAPER

2024 Nissan X-Trail: నిస్సాన్ కొత్త ఎక్స్ ట్రైల్ ఎస్యూవీ ఫుల్ డీటెయిల్స్.. గంటకు 200 కి.మీ వేగంతో.. !

2024 Nissan X-Trail: నిస్సాన్ కొత్త ఎక్స్ ట్రైల్ ఎస్యూవీ ఫుల్ డీటెయిల్స్.. గంటకు 200 కి.మీ వేగంతో.. !

2024 Nissan X-Trail Full Review: 2024 నిస్సాన్ ఎక్స్ ట్రైల్ 4th gen ఎస్యూవీ తాజాగా దేశీయ మార్కెట్‌లో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఎక్స్ ట్రైల్ కంటె ఈ కొత్త మోడల్‌ భారీ మార్పులతో మార్కెట్‌లోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 2024 Nissan X-Trail 1.5 లీటర్ వేరియబుల్ జామెట్రీ టర్బో, మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది.ఇది ఒకే డ్రైవ్‌ట్రెయిన్ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది. కాగా దీని ఇంజన్ 4800 ఆర్‌పిఎమ్ వద్ద 161 బిహెచ్‌పి.. అలాగే 2800, 3600 ఆర్‌పిఎమ్ వద్ద 300 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.


12వి మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ద్వారా దీని ఇంజన్ పవర్‌ను పొందుతుంది. దీంతో దీని మొత్తం పవర్‌ని ఎక్స్ ట్రైల్ ఫ్రంట్ వీల్‌లకు సివిటి ద్వారా సరఫరా చేస్తుంది. దీని కారణంగా ఇది ఫాస్ట్ రన్నింగ్ ఎస్యూవీగా నిలిచింది. కాగా ఈ 2024 Nissan X-Trail కారు కేవలం 9.6 సెకన్లలో 0 నుంచి 100 km/h వేగంతో పరుగులు పెడుతుంది. ఈ కొత్త ఎక్స్ ట్రైల్ గంటకు 200 కి.మీ వేగంతో దూసుకుపోతుంది.

Also Read: ప్రాణం ముఖ్యం బిగులు.. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో చౌకైన SUVలు..!


అయితే ఈ కొత్త 2024 Nissan X-Trail మైలేజీ గురించి అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇది ఎంత మేర మైలేజీ ఇస్తుందని చూస్తున్నారు. అయితే ఈ 2024 Nissan X-Trail ఒక లీటర్‌కి 13.7 కి.మీ మైలేజీని అందిస్తుందని చెప్పబడింది. ఇందులో 585 లీటర్ బూట్ స్పేస్ ఉంది. అలాగే లోపల ఉండే రెండు, మూడవ వరుస సీట్లను మడతపెట్టుకోవచ్చు.

దీని కారణంగా మరి స్పేస్‌ని పొందవచ్చు. ఇది 4680 మిమీ పొడవు, 1840 మిమీ వెడల్పు, 1725 మిమీ ఎత్తు, 2705 మిమీ వీల్‌బేస్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త 2024 Nissan X-Trailతో కంపెనీ ఎస్యూవీ విభాగంలో కింగ్ మేకర్‌గా తన సత్తా చాటాలని భావిస్తోంది. ఒక మంచి ఎస్యూవీ కోసం ఎదురుచూస్తున్న వాహన ప్రియులకు ఇది బెస్ట్‌గా చెప్పుకోవచ్చు.

Tags

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×