EPAPER

CM Revanth Reddy vs KTR: అసెంబ్లీలో సీఎం రేవంత్ Vs కేటీఆర్, చీకటి ఒప్పందం మాటేంటి?

CM Revanth Reddy vs KTR: అసెంబ్లీలో సీఎం రేవంత్ Vs కేటీఆర్, చీకటి ఒప్పందం మాటేంటి?

CM Revanth Reddy vs KTR(Political news in telangana): తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌‌రెడ్డి-బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. చర్చ సమయంలో ఢిల్లీలో జరిగిన చీకటి ఒప్పందాలను బయటపెట్టాల్సిందేనని సీఎం డిమాండ్ చేశారు. చర్చ ముగిసేవరకు బీఆర్ఎస్ సభ్యులను బయటకు పంపించవద్దని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.


కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడానికి కారణం ఎవరు? మీరంటే మీరని నేతలు ఒకరిపై మరొ కరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దానికి కారణం ముమ్మాటికీ బీఆర్ఎస్ అని వాదన బలంగా వినిపిస్తోం ది. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ అనుసరించిన వ్యవహారశైలే ఇందుకు కారణమని నేతలే అంటున్నారు. ధనిక రాష్ట్రమంతా పదేపదే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలూ దీనికి కారణంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకు లు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భం గా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. గడిచిన పదేళ్లలో మోదీ సర్కార్‌కు రాజ్యసభలో మద్దతు ఇచ్చింది ఎవరని ప్రశ్నించారు. జీఎస్టీ బిల్లుకు సంపూర్ణంగా బీఆర్ఎస్ మద్దతు పలకలేదా? మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మా నం ప్రవేశపెడితే సభ నుంచి బీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ కాలేదా?


నోట్ల రద్దు విషయాన్ని సమర్థించింది కేసీఆర్ కాదా? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ఓటు వేసింది మీరు కాదా? ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదా అని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. మిషన్ భగీరథ ప్రారంభించడానికి ప్రధాని నరేంద్రమోదీ వస్తే.. ఆ సభలో కేసీఆర్ మాటలను ఒక్కసారిగా గుర్తు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

మాకు నిధులు అవసరంలేదని, మీ ప్రేమ ఉంటే చాలన్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు సీఎం. మోదీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం బహిర్గతం కావాల్సిందేనన్నారు. చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. తాను స్వయం కృషితో ముఖ్యమంత్రి అయ్యానని గుర్తు చేశారాయన. కేసీఆర్ అనవసర పంచాయతీ పెట్టుకున్నారని దుయ్యబట్టారు.

ALSO READ: అన్ని తండాలకు బీటీ రోడ్డు వేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

దీనిపై కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం సభలో పెట్టింది తీర్మానమా? స్వల్పకాలిక చర్చా అనేది తెలియడం లేదన్నారు కేటీఆర్. తీర్మానం గురించి మాకు కాపీ ఇవ్వలేదన్నారు. 8+8=16 అవుతుందని, తెలంగాణకు వచ్చింది గుండు సున్నానని చెప్పుకొచ్చారు. ఈలోగా బీజేపీ సభ్యులు జోక్యం చేసుకున్నారు. కేంద్ర బడ్జెట్‌పై సభలో తీర్మానం పెట్టడం దారుణమన్నారు ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి.

 

Related News

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Ram Charan : హాలీవుడ్‌లో అరుదైన గౌరవం… గ్లోబల్ స్టార్ అంటే ఇదే మరీ..!

CID Shakuntala: ఇండస్ట్రీలో విషాదం.. సిఐడి శకుంతల కన్నుమూత..!

Bigg Boss 8: చంద్రముఖిలా మారిన యష్మీ.. ఏడిపించేసిన విష్ణు

Big Stories

×