EPAPER

Maratha Reservation: ఆగస్టు 13లోగా మరాఠా రిజర్వేషన్ ప్రకటించాలి.. నిరాహార దీక్ష వాయిదా వేస్తూ షిండే ప్రభుత్వానికి పాటిల్ హెచ్చరిక

Maratha Reservation: ఆగస్టు 13లోగా మరాఠా రిజర్వేషన్ ప్రకటించాలి.. నిరాహార దీక్ష వాయిదా వేస్తూ షిండే ప్రభుత్వానికి పాటిల్ హెచ్చరిక

Maratha Reservation latest news(Today’s news in telugu): మహారాష్ట్రలో స్థానికులకు ఉద్యోగాల్లో 47 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. మరాఠా నాయకుడు మనోజ్ జరంగె పాటిల్ జూలై 20 నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే బుధవారం జూలై 24 ఉదయం ఆయన తన నిరాహార దీక్షను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండ్ ఆగస్టు 13లో మరాఠా ప్రజలకు ఉద్యోగ, ఉన్నత విద్య కోర్సుల్లో రిజర్వేషన్ ప్రకటించాలని డెడ్ లైన్ విధిస్తున్నట్లు చెప్పారు.


మహారాష్ట్రలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం, కున్బీ సామాజిక వర్గనికి ఓబిసీ కోటాలో 27 శాతం రిజర్వేసన్ కల్పించాలని సామాజిక కార్యకర్త మరాఠా నాయకుడు మనోజ్ పాటిల్ గత నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు.

Also Read: అరుదైన కేసుల్లోనే బెయిల్‌ ఆర్డర్‌పై స్టే ఇవ్వాలి: సుప్రీంకోర్టు


మహారాష్ట్రలో 30 శాతానికి పైగా ఉన్న స్థానికులకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. గత ఫిబ్రవరిలో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు.

అయితే ఈ తీర్మానం తరువాత మరాఠా సమాజంలో కున్బీ సామాజిక వర్గానికి ఓబిసీ కోటాలో రిజర్వేషన్ ఇవ్వలంటూ డిమాండ్లు పెరిగాయి. ముఖ్యంగా మనోజ్ పాటిల్ నాయకత్వంలో నిరసనలు మొదలయ్యాయి. 2023 ఆగస్టు లోనే మనోజ్ పాటిల్ పలుమార్లు నిరహార దీక్ష చేపట్టి మళ్లీ విరమించారు. జూన్ 13, 2024న కూడా ఆయన నిరాహార దీక్ష చేసి.. ఆయన డిమాండ్ల నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నెల గడువు ప్రకటించారు.

Also Read: సెక్యూరిటీని పిలవండి.. ఈ లాయర్‌ను తీసుకెళ్లండి: సీజే చంద్రచూడ్ సీరియస్

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×