EPAPER

Jagan maha dharna in Delhi: ఢిల్లీలో నిజాలు చెప్పిన జగన్, అదీ.. మా ప్రభుత్వం..

Jagan maha dharna in Delhi: ఢిల్లీలో నిజాలు చెప్పిన జగన్, అదీ.. మా ప్రభుత్వం..

Jagan maha dharna in Delhi: నిజాలు చెప్పడంలో వైసీపీ అధినేత జగన్ నిత్యం ముందుంటారు. విశ్వసనీయతకు ఆయన మారుపేరు. ఆ పార్టీ నేతలే ఈ విషయాన్ని తరచూ చెబుతారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి 40 రోజులకే ఆయన తన యాక్షన్ ప్లాన్ అమలు చేశారు. ఆ విషయంలో జగన్ సక్సెస్ అయ్యారని అంటున్నారు ఆ పార్టీ మేధావులు.


వైసీపీ అధినేత జగన్ వేసుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఏపీలో అరాచకాలు జరుగుతున్నాయని భావించి ఢిల్లీలో ధర్నా చేపట్టింది. ధర్నా ముందు నేషనల్ మీడియాతో జగన్ చెప్పాలనుకున్న నాలుగు ముక్కలు చెప్పేశారు. మీడియా మిత్రులు పలు ప్రశ్నలు సంధించారు. అసెంబ్లీ సమావేశాల గురించి ప్రశ్న వేస్తున్న సమయంలో ప్లీజ్.. టాపిక్‌ను డైవర్ట్ చేయవద్దంటూ వారిని రిక్వెస్ట్ చేశారు. ధర్నాలో పోటో ఎగ్జిబిషన్ చూస్తే మీకే తెలుసుందని చెప్పే ప్రయత్నం చేశారు. జాతీయ మీడియా ఈ విషయాలను అందరి దృష్టికి తీసు కెళ్లాలని వివరించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు జగన్.

ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు జగన్. టీడీపీ అధికారంలోకి వచ్చి కేవలం 45 రోజుల్లో 30 హత్యలు జరిగాయని పేర్కొన్నారు. మా ప్రభుత్వ హయాంలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదన్నారు. ఇలాంటి దాడులను మా ప్రభుత్వం ఏనాడూ ప్రొత్సహించలేదంటూ నిజాలు చెప్పారు. అంతేకాదు వందల ఇళ్లను ధ్వంసం చేశారని ఆరోపించారు. వెయ్యికి పైగానే సానుభూతిపరులపై అక్రమకేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారాయన.


ALSO READ: హస్తినలో జగన్ మహాధర్నా, ముందే షాకిచ్చిన కేంద్రం..

నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఈ పనంతా జరుగుతోందని దుయ్యబట్టారు జగన్. ఇవాళ వాళ్లు అధికారంలో ఉండొచ్చు.. రేపు మేము అధికారంలోకి రావచ్చన్నారు. దయ చేసి ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వేడుకున్నారు. జగన్ మాటలు గమనించినవారు మాత్రం, నేషనల్ మీడియాకు చెప్పాల్సిన విషయాలను చెప్పేశారని ఈ విషయంలో ఆయన సక్సెస్ అయ్యారని అంటున్నారు.

వైసీపీ ధర్నాకు చాలామంది నేతలు ఎస్కేప్ అయ్యారు. ఇద్దరు ఎమ్మెల్సీలు మంగళవారం మండలి సమావేశాలకు హాజరయ్యారు. వారిలో మాధవరావు, రవీంద్రలు ఉన్నారు. విచిత్రం ఏంటంటే జగన్ ఆలోచనకు కాలం కలిసిరాలేదు. ఢిల్లీలో ఉదయం నుంచి వర్షం జోరుగా పడుతోంది. ధర్నాలో నేతలు, కార్యకర్తలు పెద్దగా కనిపించలేదు. కూటమిపై ఆరోపణలు ఏమోగానీ, జగన్ ధర్నా అట్టర్ ప్లాప్ అయ్యిందని చెప్పుకుంటున్నారు.

Related News

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Ysrp leaders fear: ఐపీఎస్‌ల తర్వాత ఆ నేతలే? వైసీపీలో కలవరం..

Big Stories

×