EPAPER

Immunity Boosting Drinks: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే డ్రింక్స్ ఇవే !

Immunity Boosting Drinks: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే డ్రింక్స్ ఇవే !

Immunity Boosting Drinks: వర్షాకాలం ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు మనస్సుకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ ఈ సీజన్‌లోనే అనేక వ్యాధులు కూడా వస్తాయి. వర్షాకాలంలో వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అనేక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో చలి, వర్షం అనేక సమస్యలను కలిగిస్తుంది. పిల్లలు, వృద్దులు  అనారోగ్యానికి గురవుతుంటారు.


వర్షాకాలంలో జలుబు, దగ్గు, టైఫాయిడ్ వంటివి ఎక్కువగా వస్తుంటాయి.అటువంటి పరిస్థితిలో మనల్ని మనం ఆరోగ్యంగా మరియు ఫిట్‌గా ఉంచుకోవడానికి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం ఆహారంలో సరైన మార్పులు చేసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవచ్చు. ఇందు కోసం కొన్నిఆయుర్వేదిక పదార్థాలును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వంటింట్లో దొరికే కొన్ని పదార్థాల సహాయంతో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. జ్వరం, జలుబు, దగ్గు, డెంగ్యూ, టైపాయిడ్ వంటి వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేదిక్ డ్రింక్స్ తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
తులసి :
తులసి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. తులసిని ఆయుర్వేదంలో ది క్వీన్ ఆఫ్ హెర్బ్స్ ,మదర్ మెడిసిన్ అఫ్ నేచర్ అని కూడా పిలుస్తుంటారు. తులసి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు ఔషధ గుణాలు కూడా ప్రసిద్ధి చెందింది. తులసిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల వ్యాధులను నివారించడంలో ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే దగ్గు, ఉబ్బసం, అతిసారం, జ్వరం, విరేచనాలు, కీళ్ల నొప్పులు , కంటి వ్యాధులను నివారించడంలో తులసి అద్భుతంగా పనిచేస్తుంది.
అల్లం:
వర్షాకాలంలో వ్యాధులను ఎదుర్కోవడానికి నాచురల్ రెమెడీ అల్లం. దీనిలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లంలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. అల్లం గొంతు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలిగేలా చేస్తుంది. సాధారణ ఫ్లూ, జలుబుకు కారణమయ్యే రైనోవైరస్‌లను కూడా ఇది నివారిస్తుంది.
అల్లం, తులసి కషాయం తయారీ..
అల్లం, తులసి కషాయం చేయడానికి ముందుగా తులసిఆకులు, తురిమిన అల్లంను నీటిలో ఐదు నుంచి ఏడు నిమిషాలపాటు ఉడక పెట్టండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వడగట్టి అందులో తేనె, నిమ్మరసం కలపాలి ఆ నీటిని గోరువెచ్చగా తాగాలి. ఇలా కషాయం తాగడం వల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. రోగనిరోధక శక్తి పెంచడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.
దాల్చినచెక్క:
దాల్చిన చెక్క, లవంగాలను ముఖ్యంగా ఆహార తయారీలో గరం మసాలాగా ఉపయోగిస్తుంటారు. కానీ దాల్చిన చెక్క, లవంగాలు ఆహారానికి రుచిని జోడించడం మాత్రమే కాకుండా చాలా ఔషధ గుణాలు కూడా ఉంటాయి. దాల్చిన చెక్కలో పాలీఫెనాల్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యమైన నూనెలు కూడా ఇందులో ఉంటాయి. ఇవి యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియలతో పోరాడటంతో పాటు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Also Read: మీ ప్లేట్ లెట్స్ కౌంట్ పెంచే పండ్లు ఇవే !


దాల్చిన చెక్క, లవంగం కషాయం తయారీ..
లవంగం, దాల్చిన చెక్క కషాయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కషాయం చేయడానికి ముందుగా ఒక పాన్‌లో కాస్త దాల్చిన చెక్క, 4- 5 లవంగాలను తీసుకోండి. ఈ రెండు పదార్థాలను కొంచెం నీటిలో వేసి 15 నిమిషాల పాటు ఉడికించండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టండి. అందులో ఒక టీ స్పూన్ తేనె, నిమ్మరసం కలపండి. ఇలా తయారు చేసిన కషాయం తాగడం వల్ల జలుబు, జ్వరం వంటివి తగ్గుతాయి, అంతేకాకుండా దగ్గు నుంచి ఉపశమనం పొందుతారు, రోగనిరోధక శక్తి పెంచడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×