EPAPER

AP Assembly Session : ఓటర్లకు పాదాభివందనం.. 2047 వికసిత్ ఏపీనే లక్ష్యం : సీఎం చంద్రబాబు

AP Assembly Session : ఓటర్లకు పాదాభివందనం.. 2047 వికసిత్ ఏపీనే లక్ష్యం : సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Speech in AP Assembly: ఏపీ అసెంబ్లీలో నిన్న గవర్నర్ ప్రసంగానికి నేడు ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దీనిపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అర్థరాత్రి 12 గంటల వరకూ ఓపికగా క్యూ లైన్లలో నిలబడి ఓటేసిన ఓటర్లందరికీ పాదాభివందనం చేస్తున్నామన్నారు. 2047 వికసిత ఆంధ్రప్రదేశే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.


తాను జైల్లో ఉన్నప్పుడు తనను కలిసేందుకు వచ్చిన పవన్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దనే మద్దతు ఇస్తున్నట్లు చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఎలాంటి కండీషన్ లేకుండా పవన్ తమకు మద్దతిచ్చారని మరోసారి చెప్పారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఏపీ ప్రజల్లో చైతన్యం వచ్చిందనేందుకు నిదర్శనమన్నారు. జూన్ 4న వెల్లడైన ఫలితాలు కొత్త చరిత్ర సృష్టించాయన్నారు. గతంలో తానెప్పుడూ ఇంతపెద్ద విజయాన్ని చూసింది లేదని, ఇది మార్పుకు సంకేతమన్నారు.

గత ప్రభుత్వం ఎన్నో అరాచకాలు చేసిందని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. అమాయక ప్రజల మెడపై కత్తులు పెట్టి.. భూములను, ఆస్తుల్ని రాయించుకున్నారని విమర్శలు గుప్పించారు. ఆడబిడ్డలకు రక్షణలేకుండా చేశారని దుయ్యబట్టారు. అంతకుముందు టీడీపీ హయాంలో పల్లెల్లో చదువుకుని ఐటీ దిగ్గజాలుగా ఎదిగినవారున్నారని గుర్తు చేశారు.


Also Read : ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..ఇక అమరావతికి మహర్ధశ

నాడు మద్రాసుతో విడిపోయి.. హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్న చంద్రబాబు.. ఇప్పుడు పదేళ్లుగా రాష్ట్రానికి రాజధాని లేని దుస్థితి ఏర్పడిందన్నారు. రాజధాని లేని రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ హయాంలో ఐటీ రంగానికి చాలా ప్రాధాన్యమిచ్చామని, వైసీపీ హయాంలో అది కరువైందన్నారు. పోలవరాన్ని పూర్తి చేసేందుకు కావలసిన నిధులను ఇస్తామని కేంద్రం చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. సమిష్టిగా కృషిచేస్తే ఏపీని అభివృద్ధి చేయడం కష్టం కాదన్నారు.

వైసీపీ తీరుతో ఏపీ అభివృద్ధి ఆగిపోయిందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసి.. తీరని నష్టం చేశారన్నారు. ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, అభివృద్ధి కుంటుపడేలా చేశారన్నారు. ఇసుక, మద్యం, మైనింగ్ పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారని దుయ్యబట్టారు. ఒక్క మైనింగ్ లోనే రూ.20 వేల కోట్లను దోచుకున్నారని, అక్రమంగా సంపాదించిన సొమ్మునంతా ఎన్నికల్లో ఖర్చు చేశారని తెలిపారు.

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×