EPAPER

Big Boss:బిగ్ బాస్ 3 ఓటీటీలో అశ్లీలం..శివసేన అగ్గిమీద గుగ్గిలం

Big Boss:బిగ్ బాస్ 3 ఓటీటీలో అశ్లీలం..శివసేన అగ్గిమీద గుగ్గిలం

Public Fire on Big boss ott 3 dirty vedio


ఓటీటీ సినిమాలలో విచ్చలవిడిగా శృంగార కార్యకలాపాలు ఎక్కువైపోయాయని ఫ్యామిలీ ఆడియన్స్ నెత్తీనోరూ బాదుకుంటున్నారు. ఓటీటీలకు సెన్సార్ నిబంధనలు వర్తించకపోవడంతో మితిమీరిన హింస, శృంగార సన్నివేశాలు, ద్వంద్వార్థాల డైలాగులు ఎక్కువైపోతున్నాయి. ఇది చాలదన్నట్లు ఓటీటీలో వచ్చే రియాలిటీ షోలు సైతం మేమేం తక్కువ తిన్నాం అంటూ వీక్షకులకు వినోదం మాటున అశ్లీల కంటెంట్ ఇస్తున్నాయి. ఈ తరహా కంటెంట్ కు యూత్ బాగా కనెక్ట్ అవడంతో ఓటీటీలలో పుష్కలంగా అశ్లీలం, హింస ఉండేలా చూసుకుంటున్నారు నిర్మాతలు.

బుల్లి తెరపై బిగ్ బాస్


బిగ్ బాస్ ఈ మధ్యకాలంలో ఎంతగా పాపులారిటీ సంపాదించిందో తెలిసిందే. ఎక్కడో విదేశాలనుంచి స్ఫూర్తిని పొంది ముందుగా బాలీవుడ్ లో ప్రదర్శితమైన బిగ్ బాస్ రియాలిటీ షో క్రమంగా అన్ని భాషలలోనూ పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులో ఈ షో ప్రతి సంవత్సరం నాగార్జున ఘోస్ట్ గా ఉంటూ అలరిస్తున్నారు. ముందుగా కొందరు హీరోలు ఈ రియాలిటీ షోకి ఘోస్ట్ లుకా వచ్చినా నాగార్జున ఫిక్స్ అయిపోయారు. అయితే అప్పుడప్పుడు బాలీవుడ్ లోనూ ఈ రియాలిటీ షోలో కొందరు శృతి మించి ముద్దుల స్థాయికి చేరుకోవడంతో ప్రేక్షకులు ఫైర్ అయ్యారు. కుటుంబ సమేతంగా చూసే బిగ్ బాస్ రియాలిటీ షోలో ఇలాంటివి ఏమిటని ప్రశ్నించారు. దీనితో నిర్వాహకులు కొద్దిగా తగ్గారు. అలాంటి వాటిని ప్రోత్సహించడం మానేశారు.

సెన్సార్ నిబంధనలుండవా?

ఇప్పుడు ఓటీటీలోనూ బిగ్ బాస్ రియాలిటీ షో అలరిస్తోంది. ఇప్పటికే రెండు సిరీస్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఓటీటీ షో మూడో సెషన్ కు అడుగుపెట్టింది. అయితే మామూలు కంటెంట్ ఉంటే జనం చూడటం లేదనో లేక మరో కారణం చేతనో బిగ్ బాస్3 ఓటీటీ నిర్వాహకులు శృంగార సన్నివేశాలను చూపించడం మొదలుపెట్టారు. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లలో కొందరు రియల్ జంటలను కూడా పంపిస్తుంటారు. అయితే బిగ్ బాస్ 3లో రియల్ జంటగా వచ్చిన అర్మాన్ మాలిక్, కృతిక ఇద్దరూ అర్థరాత్రి శృంగారంలో రియల్ గా పాల్గొన్నట్లు వీడియో చూపించారు. దీనితో నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సన్నివేశాలు సినిమాలలో ఉంటే సెన్సార్ సభ్యులు అభ్యంతరం తెలియజేస్తారు. పైగా అలాంటి సన్నివేశాలపై వేటు వేస్తారు .అలాంటిది ఓటీటీలో సెన్సార్ పట్టింపులు లేవని చెప్పి ఇలాంటి సన్నివేశాలను చిత్రీకరిస్తారా? ఇటువంటి వాటితో సభ్యసమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారో వాళ్లకే తెలియాలి అంటున్నారు.

శివసేన ఎమ్మెల్యే ఆగ్రహం

మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే మనీషా ఈ షో లో ప్రదర్శితమైన వీడియోపై మండి పడ్డారు. బిగ్ బాస్ షో ను వెంటనే నిసేధించాలని సీరియస్ అయ్యారు. ఇలాంటి షోల తో ప్రయోజనం శూన్యం అని..అసలు బిగ్ బాస్ షోని ఎట్టి పరిస్థితిలోనూ ప్రోత్సహించబోమని..మహిళా సంఘాలు కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే ముంబాయి పోలీసులకు చర్యలు తీసుకోవాల్సిందిగా కంప్లయింట్స్ వెళ్లాయి.

Related News

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

Big Stories

×