EPAPER

Dragon Fruit Benefits: డ్రాగన్ ఫ్రూట్‌ ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు !

Dragon Fruit Benefits: డ్రాగన్ ఫ్రూట్‌ ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు !

Dragon Fruit Benefits: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పండ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ప్రకృతి ప్రసాదించే ఫలాలను  ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ప్రతి రోజు కనీసం 400 గ్రాముల పండ్లను తినాలి. వీటిలో ఉంటే ఎన్నో పోషకాలు ఆరోగ్య సమస్యల నుంచి కాపాడతాయి., ఫ్రీరాడికల్స్‌తో పోరాడి ముప్పు నుంచి తప్పిస్తాయి. అయితే ఎలాంటి పండ్లు తినాలి అనే విషయంలో కొంత మందికి మాత్రమే అవగాహన ఉంటుంది. కానీ చాలా మందికి మాత్రం తెలియదు. మరి ఏ పండ్లు నిజంగానే మంచివి డ్రాగన్ ఫ్రూట్‌ తింటే శరీరంలో ఏం జరుగుతుంది. అనే వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


కొంత కాలంగా డ్రాగన్ ఫ్రూట్ గురించి చర్చ బాగానే జరుగుతుంది. గతంలో దిగుమత అయ్యే ఈ విదేశీ పండు ఇప్పుడు మన దేశంలో కూడా పండిస్తున్నారు. దీంతో అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో డ్రాగన్ ఫ్రూట్ ఉంటోంది. పట్టణాలు, నగరాల్లో తోపుడు బండ్లమీద పెట్టి కూడా ఇప్పుడు ఈ పండ్లను అమ్ముతున్నారు. మరి ఈ డ్రాగన్ ఫ్రూట్ మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుంది . శరీరంలో ఎలాంటి మార్పులు కలగజేస్తుంది. వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డ్రాగన్ ఫ్రూట్‌లో ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల మనిషి జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉంటే ఫైబర్ శరీరానికి ఎంతో అవసరం. ఇది తగినంత శరీరానికి అందకపోతే మలబద్ధకం తీవ్రంగా వేధిస్తుంది. దీని వల్ల ఎన్నో రోగాలు కూడా చుట్టుముడతాయి. ఈ పదార్థం డ్రాగన్ ఫ్రూట్‌లో పుష్కలంగా ఉంటుంది. ఇదే కాకుండా ఐరన్, జింక్, మాంసకృత్తులు, పాస్ఫరస్, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఈ పండులో ఎక్కువగా ఉంటాయి.


నీరసంగా ఉన్నవారు ఈ పరిస్థితి నుంచి వెంటనే తేరుకోవాలంటే డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు కొంచెం తింటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలో కూడా వెల్లడైంది. ఫంక్షనల్ అండ్ ఫుడ్ జర్నల్‌లో ఇందుకు సంబంధించిన ఓ అధ్యయనం ప్రచురితమైంది. ఈ రీసెర్చ్‌లో పాల్గొన్న వైద్యులు గుండెకు డ్రాగన్ ఫ్రూట్ మంచిదని తేల్చారు.

డ్రాగన్ ఫ్రూట్‌లో పిటయా అనే పోషక పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు దేహానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్‌తో దీటుగా పోరాడతాయి. డ్రాగన్ ఫ్రూట్‌ లో ఉండే పోషకాలు క్యాన్సర్ ముప్పును అడ్డుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ పండులో ఉండే ప్లేవనాయిడ్స్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫినోలిక్ యాసిడ్స్ వంటివి షుగర్‌ను అదుపు చేస్తాయి.

Also Read: ఉదయం లేవగానే ఇలా అనిపిస్తుందా? అయితే మీకు డయాబెటిస్ ఉన్నట్టే !

డ్రాగన్ ఫ్రూట్ గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇందులోని మెగ్నీషియం హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో వాటర్ కంటెంట్ , పీజు పదార్థం చాలా ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణవ్యవస్థన సాఫీగా చేస్తూ బరువు తగ్గడానికి ఇది కారణమవుతుంది. అంతేకాకుండా పలు అనారోగ్య సమస్య బారి నుంచి బయటపడాలంటే డ్రాగన్ ఫ్రూట్ తినాలని వైద్యులు చెబుతున్నారు.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×