EPAPER

BSNL New Recharge Plan: దుమ్ము దులిపేస్తున్న BSNL.. జియో, ఎయిర్‌టెల్ అసూయపడేలా చౌకైన రీఛార్జ్ ప్లాన్స్..

BSNL New Recharge Plan: దుమ్ము దులిపేస్తున్న BSNL.. జియో, ఎయిర్‌టెల్ అసూయపడేలా చౌకైన రీఛార్జ్ ప్లాన్స్..

BSNL New Recharge Plan: భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు అయిన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను భారీ స్థాయిలో పెంచాయి. ఈ పెరుగుదల తర్వాత వీటీ రీఛార్జ్ ధరలతో వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుందామని అనుకున్నా దాదాపు రూ.300 చెల్లించాల్సి వస్తుంది. దీంతో సామాన్యులకు చాలా భారంగా మారింది. దీని కారణంగా Jio, Airtel, Vi (Vodafone Idea) వినియోగదారులు తక్కువ ధర, సరసమైన రీఛార్జ్ ప్లాన్‌ల కోసం ఎదురు చూస్తున్నారు.


ఈ నేపథ్యంలో వినియోగదారుల ఇబ్బందులను ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ అయిన బిఎస్ఎన్‌ఎల్ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. పెరుగుతున్న ధరల మధ్య BSNL సరసమైన ప్లాన్‌లను అందిస్తూ ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఇందులో భాగంగానే తమ వినియోగదారులకు చాలా తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్‌లను అందించి ప్రశంసలు అందుకుంటుంది.

BSNL అనేక రకాల రీఛార్జ్ ప్లాన్‌లను 28 రోజుల నుండి 395 రోజుల వరకు చెల్లుబాటుతో అందిస్తుంది. ఇటీవల BSNL తన కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందించడం ద్వారా తన అనేక ప్లాన్‌లను మరింత మెరుగుపరిచింది. తాజాగా BSNL రెండు అదిరిపోయే ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 28 రోజులు, 30 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. ఇవి అత్యంత సరసమైన ధరలలో లభిస్తాయి.


Also Read: జియో, ఎయిర్‌టెల్‌లను దెబ్బతీసేలా BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్.. వారెవ్వా అదిరిపోయింది!

BSNL 28 రోజుల ప్లాన్

BSNL 28 రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన ప్లాన్‌ను అందిస్తుంది. ఇందుకోసం వినియోగదారులు కేవలం రూ. 108 లతో రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. సరసమైన రీఛార్జ్ కోసం చూస్తున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్ పొందుతారు. అలాగే ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 1GB డేటా కూడా లభిస్తుంది. 1GB డేటా అయిపోయిన తర్వాత కూడా మీరు 40kbps వేగంతో ఇంటర్నెట్‌ని ఉపయోగించగలరు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కొత్త సిమ్‌ల కోసం మాత్రమే.

BSNL 30 రోజుల ప్లాన్

BSNL 30 రోజుల వ్యాలిడిటీతో మరొక గొప్ప ప్లాన్ అందిస్తుంది. ఇందుకోసం వినియోగదారులు కేవలం రూ.199లతో రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇందులో కూడా అపరిమిత కాలింగ్, అలాగే మొత్తం నెలకు 60GB డేటాను పొందుతారు. అనగా ప్రతిరోజూ 2GB డేటా లభిస్తుంది అన్నమాట. 2GB డేటా అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంటర్నెట్‌ని ఉపయోగించగలరు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 SMSలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిబట్టి చూస్తే జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియాకు పెద్ద దెబ్బే అని చెప్పాలి.

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×