EPAPER

Morne Morkel as Bowling Coach: గంభీర్ మాటే నెగ్గింది.. బౌలింగ్ కోచ్ గా మోర్నే మోర్కెల్

Morne Morkel as Bowling Coach: గంభీర్ మాటే నెగ్గింది.. బౌలింగ్ కోచ్ గా మోర్నే మోర్కెల్

Morne Morkel as Team India Bowling Coach(Sports news headlines): టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా వచ్చిన గౌతం గంభీర్ ముందే చెప్పినట్టుగా తన టీమ్ ని తనే ఎంపిక చేసుకున్నాడు. ఆల్రడీ బ్యాటింగ్ కోచ్ గా టీమిండియా మాజీ ప్లేయర్ అభిషేక్ నాయర్‌, ఇంకా నెదర్లాండ్స్ మాజీ ఆల్‌రౌండర్ టెన్ డస్కాటేల నియామకం దాదాపు ఖరారైపోయింది. తాజాగా బౌలింగు కోచ్ గా సౌతాఫ్రికా మాజీ సీనియర్ క్రికెటర్ మోర్నే మోర్కెల్ ను నియమించినట్టు తెలిసింది.


అయితే ఈ విషయంలో బీసీసీఐ అంత తేలికగా ఒప్పుకోలేదని అంటున్నారు. ఎందుకంటే మోర్నే మోర్కెల్ గతంలో పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ గా ఉన్నాడు. ఈయన పర్యవేక్షణలో పాకిస్తాన్ బౌలర్లు ఎంత గొప్పగా ఆడుతున్నారో అందరికీ తెలిసిందే. అలాంటివాడ్ని తీసుకొచ్చి బ్రహ్మాండమైన రిథమ్ తో బౌలింగు చేసే మన బుమ్రా, అర్షదీప్, సిరాజ్ లాంటివారి ఒరిజినల్ స్టయిల్ మార్చితే కొంప కొల్లేరే అంటున్నారు.

ఈ నేపథ్యంలో బీసీసీఐ చాలా ఆలోచించింది. కానీ గౌతం గంభీర్ పట్టుపట్టి వాదించినట్టు తెలిసింది. గంభీర్ కు ముందుగా మాట ఇవ్వడంతో బౌలింగ్ కోచ్ గా మోర్నీ మోర్కెల్ ను బీసీసీఐ నియమించినట్టు సమాచారం. శ్రీలంక పర్యటనకు సమయం దగ్గర పడటంతో తను వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే కొన్ని ఫార్మాల్టీస్ పూర్తి చేయాల్సి ఉన్నందున మోర్నే మోర్కెల్ తర్వాత పర్యటన నుంచి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.


దీంతో ఎన్‌సీఏలో బౌలింగ్ కోచ్‌గా పని చేస్తున్న సాయిరాజ్ తాత్కలిక బౌలింగ్ కోచ్‌గా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీలంక పర్యటనకు తను వెళ్లనున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో గౌతం గంభీర్ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read: టీమ్ ఇండియాలోకి.. కోల్ కతా బ్యాచ్ దిగిపోయింది..

రుతురాజ్ గైక్వాడ్ ని తప్పించడం, ఓపెనర్ అభిషేక్ శర్మను కనీసం స్టాండ్ బైగా కూడా ఎంపిక చేయకపోవడం, హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ తప్పించడం, తరచూ ఫెయిల్ అవుతున్న శుభ్ మన్ గిల్ కు రెండు ఫార్మాట్లలో డిప్యూటీ కెప్టెన్ గా బాధ్యతలు ఇవ్వడం, బీసీసీఐ క్రమశిక్షణ ఉల్లంఘించిన శ్రేయాస్ ను తీసుకురావడం, రియాన్ పరాగ్ కి చోటు కల్పించడం ఇలా ఒకటి కాదు ఎన్నో అంశాల్లో గౌతంగంభీర్ వ్యవహార శైలి తిక్కతిక్కగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. టీమ్ ఇండియాను ఇక దేవుడే కాపాడాలి అని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×