EPAPER

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఏ రాశి వారికి ఇబ్బందులు ఉంటాయి వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. బుద్ధిబలంతో సమస్యలు పరిష్కారమవుతాయి. శ్రీ లక్ష్మి అష్టోత్తరం పఠిస్తే శుభకరం.

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మొదలు పెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగులు కలలు నెరవేరుతాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. గణపతి ఆలయ సందర్శన శుభకరం.


మిథునం:
మిథునం రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. వ్యాపారాల్లో సమస్యలు వస్తాయి. దీంతో నష్టాలు చూడాల్సి వస్తుంది. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అనారోగ్య సమస్యలకు గురవుతారు. విష్ణువుని ఆరాధించాలి.

కర్కాటకం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. పెద్దల సలహాలు ఫలిస్తాయి. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడంతో మంచి ఫలితాలు పొందుతారు.

సింహం:
సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. వృత్తి, వ్యాపారాల్లో తోటి వారి సహకారంతో సమస్యలు పరిష్కారమవుతాయి. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. వాదనలకు వెళ్లకూడదు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. కీలక నిర్ణయాలు బంధువులను సంప్రదించి తీసుకోవాలి. కొత్త పనులు ప్రారంభించపోవడం ఉత్తమం. తొందరపాటుతో సమస్యలు ఎదురుకావొచ్చు. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవాలి.

తుల:
తుల రాశి వారికి అనుకూలంగా లేదు. ప్రారంభించిన పనుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. ఇతరుల సహకారం ఉంటుంది. అవసరానికి డబ్బు అందుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం క్షీణిస్తుంది. చంద్ర ధ్యానం శుభప్రదం.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి అనుకూలంగా లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఒత్తిడి, శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కీలక నిర్ణయాలతో సమస్యలు రాకుండా చూసుకోవాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది గురిచేస్తాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. అనవసరమైన గొడవల్లో తలదూర్చవద్దు. సూర్య ఆరాధన శుభకరం.

మకరం:
మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో లాభాలు ఉంటాయి. అనుకున్న లక్ష్యాలను నెరవేర్చేందుకు కష్టపడతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉన్నతంగా ఉన్న వారితో పరిచయాలు కలుగుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. శివాభిషేకం జరిపించుకుంటే మేలు జరుగుతుంది.

కుంభం:
కుంభ రాశి వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి. సహనంతో పనులు పూర్తి చేసుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆర్థక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను అతిగా నమ్మకపోవడం మంచిది. ప్రతికూల ఆలోచనలు వీడాలి. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. దుర్గాదేవి ధ్యానం మేలు చేస్తుంది.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి. ఒత్తిడి నుంచి బయలపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. బంధుమిత్రులకు సమయాన్ని కేటాయిస్తారు. సన్నిహితులతో విహార యాత్రలకు వెళ్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.

Related News

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Big Stories

×