EPAPER

Gautam Gambhir: కోచ్ గౌతం గంభీర్ సహాయకులు వీరేనా?

Gautam Gambhir: కోచ్ గౌతం గంభీర్ సహాయకులు వీరేనా?

Gambhir will take the New Coaching Team: టీమ్ ఇండియాకి హెడ్ కోచ్ గా గౌతం గంభీర్ వచ్చేశాడు. అయితే తన సహాయకులుగా ఎవరుంటారానేది నెట్టింట పెద్ద డిస్కషన్ జరుగుతోంది. ఇంతవరకు రాహుల్ ద్రవిడ్ కి సహాయకులుగా ఉన్నందరూ కూడా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ముందే తను కండీషన్ పెట్టినట్టుగా గంభీర్ తన సహాయకులను అంటే తన కోచ్ టీమ్ ని వెతికే పనిలో పడ్డాడు.


ప్రస్తుతం తన దృష్టి ఇద్దరిపై ఉందని అంటున్నారు. వారు ఎవరంటే నాయర్, డస్కాటే అని చెబుతున్నారు. ఎవరు వీరంటే, టీమ్ ఇండియా మాజీ ఆటగాడు అభిషేక్ నాయర్, నెదర్లాండ్స్ మాజీ ఆల్ రౌండర్ టెన్ డస్కాటే ఇద్దరూ అని చెబుతున్నారు. నిజానికి అభిషేక్ నాయర్ ఆటగాడిగా కెరీర్ ముగిశాక.. రాబిన్ ఉత్తప్ప, దినేశ్ కార్తీక్ లాంటి ఆటగాళ్లకు కోచ్ గా పనిచేసి, వారిలో ఎటాకింగ్ ప్లేని మరింత డెవలప్ చేశాడు. అది నేడు జాతీయ జట్టుకి పనికి వస్తుందని గంభీర్ భావిస్తున్నాడు.

ఒకప్పుడు కోల్ కతా నైట్ రైడర్స్ కు కెప్టెన్ గా ఉన్నప్పుడు.. డస్కాటే ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ పరిచయం, తనలోని ప్రతిభ ఇవన్నీ గంభీర్ కు నచ్చాయని అంటున్నారు. ఆ క్రమంలో శ్రీలంక పర్యటనకు ముందు వారిద్దరూ జట్టులో చేరుతారని అంటున్నారు. ఇక వీరిద్దరితోపాటు ఒక బౌలింగ్ కోచ్ ని నియమించాలి.


Also Read: చెన్నై కింగ్ ధోనీ ప్లేస్ లో.. పంత్ ?

ఇందుకోసం జహీర్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కాకపోతే తను హెడ్ కోచ్ అయ్యే స్థాయి ఉండటంతో వెనుకడుగు వేశాడని అంటున్నారు. ఈ క్రమంలో గంభీర్ కొన్ని పేర్లు బీసీసీఐకి సూచించాడని చెబుతున్నారు. వారిలో లక్ష్మీపతి బాలాజి, వినయ్ కుమార్, మోర్ని మోర్కెల్ ఉన్నారు. త్వరలోనే వీరిలోనే ఒకరిని బీసీసీఐ ఎంపిక చేసే అవకాశాలున్నాయి. అయితే రాహుల్ ద్రవిడ్ బృందంలో ఉన్నవాళ్లు కూడా తక్కువేమీ కాదు.

ఎందుకంటే టీ 20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో డేవిడ్ మిల్లర్ క్యాచ్ ని సూర్యకుమార్ అద్భుతంగా పట్టుకున్నాడు. ఆ సందర్భంగా సూర్య మాట్లాడుతూ బౌండరీ లైన్ల వద్ద ప్రాక్టీస్ ఉంటుంది. అది ఫీల్డింగ్ కోచ్ పర్యవేక్షణలో సాగుతుంది. వారిచ్చిన తర్ఫీదు వల్లే ఆ క్యాచ్ పట్టగలిగానని అన్నాడు. అదీ సంగతి. చూశారా.. మరి వారిని గంభీర్ తక్కువ చేసి చూస్తున్నాడని నెటిజన్లు ఒకవైపు నుంచి ఫైర్ అవుతున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×