ఆవు, గేదె ప్రసవించినపుడు తొలిగా తీసే పాలను జున్ను పాలు అంటారు

ఆ పాలలో బెల్లం, ఇలాచీలు వేసి కాస్తే.. అది గట్టిగా తయారవుతుంది.

అలా వండుకున్న జున్నులో పోషకాలెన్నో ఉంటాయి.

కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు అధికం.

జున్ను తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

ఇందులోని కాల్షియం ఎముకలు, దంతాల బలాని దోహదపడుతుంది.

జున్నులో విటమిన్లు A, B12 , K ఉంటాయి.

ఖనిజాలలో పొటాషియం, మెగ్నీషియం , జింక్ కలిగి ఉంటాయి.

రోగనిరోధక శక్తి పెరిగి, రక్తపోటు తగ్గుతుంది.

మానసిక ఆరోగ్యం మెరుగుపరుస్తుంది.

గర్భిణీ స్త్రీలు జున్నులో చక్కెర, తేనె కలిపి తీసుకోవచ్చు

జున్ను మరీ ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది.