EPAPER

All Party Meet: ప్రత్యేక హోదాకు జేడీయూ డిమాండ్.. టీడీపీ సైలెంట్!

All Party Meet: ప్రత్యేక హోదాకు జేడీయూ డిమాండ్.. టీడీపీ సైలెంట్!

Special Status: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో ప్రతిపక్షాలు బలంగా తమ వాణిని వినిపించాయి. ప్రతిపక్షానికి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడంపై చర్చ చేసింది. నీట్-యూజీ వివాదం, కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐల దుర్వినియోగం వంటి అంశాలను లేవనెత్తారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇందులో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ యూపీ ప్రభుత్వ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కన్వార్ యాత్ర పొడవునా ఉన్న షాపులు యజమానుల పేర్లను బహిరంగంగా రాసి పెట్టాలని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ఇది ఒక వర్గాన్ని మరో వర్గానికి శత్రువుగా చేసే కార్యక్రమమేనని ఆరోపించారు.


ఇదిలా ఉండగా.. సమాజ్‌వాదీ పార్టీ నేత కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమావేశం ముగియకముందే జైరాం రమేశ్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘ఈ రోజు జరిగిన అఖిపక్ష సమావేశంలో జేడీయూ నేత తమ రాష్ట్రం బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్‌సీపీ నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విచిత్రంగా టీడీపీ నాయకులు మాత్రం ఈ విషయమై మౌనంగా ఉన్నారు’ అని వివరించారు. ఈ సమావేశం జరుగుతుండగానే జైరాం రమేశ్ ఈ ట్వీట్ వేశారు.

ఎన్డీయేలో జేడీయూ, టీడీపీలు కీలకంగా ఉన్నాయి. అత్యధిక ఎంపీలతో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయి. ఈ రెండు పార్టీల మద్దతు లేకుండా బీజేపీ అధికారంలో ఉండటం చాలా కష్టం. ఈ నేపథ్యంలోనే జేడీయూ తమ ప్రత్యేక హోదా డిమాండ్‌ను బలంగా చేస్తున్నది. అదే టీడీపీ మాత్రం ప్రత్యేక హోదా అడగలేదు. టీడీపీ కూడా ఏపీకి ప్రత్యేక హోదాను అడుగుతుందని, ఇది పాత డిమాండే కాబట్టి, ఎన్డీయే ప్రభుత్వం కూడా నెరవేరుస్తుందని ఆశించారు. తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ విషయాన్ని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయనే అర్థంలో మాట్లాడుతూ.. నేడు ఏపీలో టీడీపీ ఎక్కువ సీట్లు సాధించుకుని కేంద్ర ప్రభుత్వం ముందు తమ డిమాండ్లు పెట్టి నెరవేర్చుకుంటున్నదని చెప్పారు. నిజంగానే టీడీపీపై ఈ అంచనాలు ఉన్నాయి. కానీ, ప్రత్యేక హోదాపై టీడీపీ మౌనం దాల్చడం మాత్రం చర్చనీయాంశమవుతున్నది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు వ్యూహం ఏమిటి? నేరుగా పార్లమెంటులోనే ఈ అంశాన్ని లేవనెత్తుతారా? లేక సానుకూలంగా కేంద్రం పెద్దలతో చర్చించి డిమాండ్‌ను సాధించుకుంటారా? అనే చర్చలు జరుగుతున్నాయి.


Also Read: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. వైసీపీ డిమాండ్

వైసీపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేయడమే కాదు.. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ అల్లకల్లోలం సృష్టిస్తున్నదని, దీనిపైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు.

సభా మర్యాదను అందరూ కాపాడాలని, ఉభయ సభలు సజావుగా సాగడానికి ప్రతిక్షాలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అలాగైతే ప్రతిపక్షాలు పార్లమెంటులో తమ గళాన్ని వినిపించడానికి అనుమతించాలని, పార్లమెంటులో సమస్యలు లేవనెత్తడానికి అవకాశం ఇవ్వాలని గౌరవ్ గొగోయ్ స్పష్టం చేశారు.

Related News

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Big Stories

×