EPAPER

Bangladesh Supreme Court: బంగ్లాదేశ్‌లో విద్యార్థులకు అనుకూలంగా కోర్టు తీర్పు.. రిజర్వేషన్లు 7 శాతానికి తగ్గింపు

Bangladesh Supreme Court: బంగ్లాదేశ్‌లో విద్యార్థులకు అనుకూలంగా కోర్టు తీర్పు.. రిజర్వేషన్లు 7 శాతానికి తగ్గింపు

Bangladesh Supreme Court: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలను చేస్తున్న విద్యార్థులకు అనుకూలంగా ఈ దేశ సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. 1971లో జరిగిన బంగ్లా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారి కుటుంబాలకు ఉద్యోగాల్లో ఇస్తున్న30 శాతం రిజర్వేషన్ కోటాను 7 శాతానికి తగ్గించింది. ఈ మేరకు కోర్టు తీర్పు ఇచ్చింది.


93 శాతం ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగా ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతే కాకుండా విద్యార్థులు ఆందోళనలు విరమించి తరగతులకు హాజరు కావాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. సుప్రీం కోర్టు తీర్పుతో వారం రోజులుగా ఆందోళనలతో అడ్డుకుంటున్న బంగ్లాదేశ్ శాంతియుత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు ఉద్యోగాలు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

బంగ్లా ప్రభుత్వం 2018 లో వాటిని నిలుపుదల చేసింది.జూన్‌లో బంగ్లాదేశ్ హైకోర్ట్ ఆ కోటాను తిరిగి అమలు చేయాలని తీర్పు వెలువరించింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు 93% ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా విద్యార్థులు ఆందోళనలు విరమించి తరగతులకు హాజరు కావాలని బంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. సుప్రీం కోర్టు తీర్పుతో వారం రోజులుగా ఆందోళనతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌‌‌లో శాంతియుత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.


దేశమంతా కర్ఫ్యూ..
అంతకుముందు విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చడం వల్ల బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశమంతా కర్ఫ్యూ విధించింది. వారం రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలో ఇప్పటివరకు 150 మందిగా చనిపోగా వందల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్యతో పాటు గాయపడ్డ వారి వివరాలను కూడా బంగ్లా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. వారం క్రితం ఢాకా విశ్వవిద్యాలయం కేంద్రంగా మొదలైన విద్యార్థుల ఆందోళన దేశమంతటా విస్తరించింది.

Also  Read: విశ్వాస పరీక్షలో నెగ్గిన కేపీ శర్మ ఓలి

ఈ నిరసనలో భాగంగా రోడ్ల పైకి వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడం వల్ల రెచ్చిపోయిన ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వడం వల్ల పరిస్థితులు అదుపు తప్పాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను, బుల్లెట్లను ప్రయోగించారు. శనివారం కూడా విద్యార్థుల ఆందోళనలు హింసారూపం దాల్చినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఆది, సోమవారాల్లో సెలవు దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×