EPAPER

NCA Head Coach : అతడేనా.. ఎన్సీఏ హెడ్ కోచ్ ?

NCA Head Coach : అతడేనా.. ఎన్సీఏ హెడ్ కోచ్ ?

NCA New Head Coach : భారత క్రికెట్ లో ఒకొక్కరి పదవీకాలం అయిపోతోంది. అయితే సీనియర్ల సేవలు ఇలా వాడుకోవడం గొప్ప విషయమని చెప్పాలి. వారికి ఉపాధి చూపినట్టు ఉంటుంది. ఒక పని కల్పించినట్టు అవుతుంది. వారు జీవితంలో ఎదిగిన విధానం, నాటి క్రమశిక్షణ ఇవన్నీ కూడా నేటి తరానికి ట్రాన్స్ ఫర్ చేసినట్టు ఉంటుంది. మొన్నటి వరకు టీమ్ ఇండియా కి హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసిపోయింది. తన ప్లేస్ లో గౌతం గంభీర్ వచ్చాడు.


ఇప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ పదవీ కాలం కూడా అయిపోయింది. అతని కాంట్రాక్ట్ ని రెన్యువల్ చేసే అవకాశం కనిపించడం లేదు. అయితే తన ప్లేస్ లో మొన్నటి వరకు టీమ్ ఇండియాకి బ్యాటింగ్ కోచ్ గా ఉన్న విక్రమ్ రాథోడ్ ని నియమించే అవకాశాలున్నాయి. ఎందుకంటే తను సీనియర్లు, జూనియర్లకు వారి స్థాయిని బట్టి, వారితో ప్రాక్టీస్ చేయించే విధానంపై మంచి రిపోర్ట్ ఉందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్లు కూడా విక్రమ్ రాథోడ్ ని మెచ్చుకున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాదు వారు అవుట్ అయిన తీరు, వారి టెక్నిక్, వారి బలహీనతలు తదితర అంశాలన్నింటిపై క్షుణ్ణంగా పరిశీలించే తీరు, అందుకు తగినట్టుగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయిస్తుంటారని చెబుతున్నారు. అందుకే ఎన్సీఏలో జూనియర్లను తీర్చిదిద్దే పనిని విక్రమ్ రాథోడ్ కి అప్పగించనున్నారని అంటున్నారు.


Also Read : బెస్ట్ ఫీల్డర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. కెరీర్ ముగిసినట్టేనా?

అయితే రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసిన తర్వాత గౌతం గంభీర్ తన కోచింగ్ టీమ్ ని తెచ్చుకుంటానని అన్నాడు. ఈ క్రమంలో ద్రవిడ్ వద్ద పనిచేసిన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లు ఖాళీ అయిపోయారు. ఈ నేపథ్యంలో వీరి సేవలను ఒకరి తర్వాత ఒకరిని ఏదోరూపంలో బీసీసీఐ ఉపయోగించుకుంటుందని అంటున్నారు.

ఎందుకంటే టీ 20 ప్రపంచకప్ గెలవడమే కాదు, వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మెట్టు వరకు వెళ్లిన విధానంలో తెరవెనుక వీరిది ప్రధాన పాత్ర అని చెప్పాలి. కొలంబో వెళ్లిన జైషా తిరిగి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ముందుగా లక్ష్మణ్ ని అడుగుతారని, ఆయన కాదంటే విక్రమ్ రాథోడ్ కి అవకాశం వస్తుందని చెబుతున్నారు.

 

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×