EPAPER

Telangana:రాహుల్ గాంధీని రప్పించేందుకు స్కెచ్ వేస్తున్న రేవంత్

Telangana:రాహుల్ గాంధీని రప్పించేందుకు స్కెచ్ వేస్తున్న రేవంత్

CM Reventh Reddy plan to bring Rahul Gandhi.. Telangana


రాష్ట్రవ్యాప్తంగా రైతు రుణ మాఫీ ప్రక్రియ విజయవంతంగా ప్రారంభమయింది. రెండు విడతల్లో రెండు లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేసే దిశగా అధికార యంత్రాంగం కదిలింది. దీనితో తెలంగాణ రైతాంగం సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోంది. గత పదేళ్లుగా పాలకుల నిర్ణక్షానికి గురవుతూ పంట రుణాల కోసం బ్యాంకు అప్పులు చేయాల్సి వచ్చిందని అన్నారు. అటు బ్యాంకు రుణాల ఒత్తిడి, ఇటు పంటలు పండగ, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పూర్తిగా డీలా పడి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తమకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీతో తమ నెత్తిన పాలు పోసిందని..అధికార ప్రభుత్వంపై తమకు మరింత నమ్మకం పెరిగిందని అంటున్నారు.

నమ్మకం మరింత పెరిగేలా


సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పాలనపై ప్రజలలో నమ్మకం పెరిగేలా కృషిచేస్తున్నారు. నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకున్నారు. వాళ్లు అడిగిన రీతిలో గ్రూప్స్ పరీక్షలను వాయిదా వేశారు. అంతేకాదు వచ్చే అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. మరో పక్క ఆరు గ్యారెంటీల అమలుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ఆదాయం పెరిగేలా అధికారుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను సైతం ఘనంగా జరిపించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అని, ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రుణ మాఫీ గురించే చర్చలు జరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ పాలనలో పేరుకుపోయిన రాస్ట్ర సర్కార్ అప్పులతో సతమతమవుతూ నిధుల కొరత ఎదుర్కుంటున్న తరుణంలో ఒక్కో రైతుకు రూ.2 లక్షల రుణం మాఫీఎలా చేస్తుందని ప్రతిపక్ష నేతలు సవాళ్లు, ఛాలెంజ్ ల మధ్య రేవంత్ రెడ్డి చెప్పి మరీ చేశారు. కొన్ని సందర్భాలలో రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలను చూసి అంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తుచేసుకుంటున్నారు.

వైఎస్ మాదిరిగానే..

ప్రజా సంక్షేమం కోసం వైఎస్ ఆర్ తన మార్కు పాలనతో ఎందరో ప్రేమాభిమానాలు సంపాదించుకున్నారు. ఇప్పుడు రేవంత్ కూడా అదే తరహాలో ప్రజా సంక్షేమానికి కట్టుబడి చక్కని పాలన అందిస్తున్నారు. గత ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ సైతం రైతు రుణ మాఫీపై హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వస్తే తప్పకుండా రుణమాఫీ చేసి రైతులకు ఆపన్న హస్తం, అభయ హస్తం అందిస్తామని చెప్పారు. ఇప్పడు రేవంత్ దానిని విజయవంతంగా అమలు చేస్తున్నారు. అందుకే రాహుల్ గాంధీని రాష్ట్రానికి రప్పించి బహిరంగ సభ ద్వారా తాము రైతుల శ్రేయస్సు కోసం ఏ కరంగా పాటుపడుతున్నామో తెలిసేలా చెయ్యాలని..ఈ సందర్భంగా రాహుల్ గాంధీని హైలెట్ చేయాలని చూస్తున్నారు. దాదాపు 5 లక్షల మందితో వరంగల్ నగరంలో బహిరంగ వేదిక ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇందు కోసం సీఎం ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి ఆయనను ఒప్పించే పనిలో ఉన్నారు.

వరంగల్ లో ఏర్పాట్లు..

ఈ నెలాఖరులో రాహుల్ గాంధీ సదస్సును ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. అయితే పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ రాహుల్ ను  తెలంగాణకు ఎలా రప్పించాలి..నెలాఖరులో కాకుంటే వచ్చే నెల మొదటి వారంలో మోదీ కూడా తెలంగాణకు రానున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి వస్తున్నట్లు సమాచారం. అందుకే మోదీ కన్నా ముందుగానే రాహుల్ సభను ఏర్పాటు చేస్తే బాగుంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలలో సాధించిన విజయాలు, ప్రగతి వంటి అంశాలను కూడా ప్రస్తావించనున్నారు. ఎలాగైనా సరే రాహుల్ ను తెలంగాణకు రప్పించి ఆయన మైలేజీని పెంచాలని రేవంత్ దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. సభలో ప్రతిపక్షాల వైఫల్యాలను ఎండగట్టి కేసీఆర్ సర్కార్ ను దోషిగా నిలబెట్టి ప్రజాభిమానాన్ని మరింత పెంచుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×