EPAPER

Kerala:కేరళ సీఎం ఎంత పనిచేశారు..ప్రధానిగా భావిస్తున్నారా?

Kerala:కేరళ సీఎం ఎంత పనిచేశారు..ప్రధానిగా భావిస్తున్నారా?

Pinarayi Vijayan appointed IAS officer as ‘Foreign Secretary’ in Kerala


రెండవసారి కూడా కేరళ రాష్ట్రానికి సీఎంగా పినరయి విజయన్ ఎంపికై ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా బీజేపీపై విమర్శలు చేసేందుకు వెనకాడరు. ఇటీవల ఆయన కుమార్తె వీణపై లంచం తీసుకున్నారనే ఆరోపణలపై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే పినరయి విజయన్ ఓ వివాదంలో ఇరుక్కున్నారు . రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఆయన ఏకంగా ఫారిన్ సెక్రటరీని నియమించి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు. ఇటీవల కే.వాసుకి అనే ఐఎఎస్ అధికారిని ప్రత్యేకంగా ఫారిన్ సెక్రటరీ గా నియమించుకున్నారు. అప్పటిదాకా వాసుకి కార్మిక నైపుణ్య శాఖ కార్యదర్శిగా పదవీ బాధ్యతలలో ఉన్నారు. దానికి అదనంగా ఫారిన్ సెక్రటరీ బాధ్యతను అప్పగించారు. ఇందుకు సంబంధించి ఢిల్లీలోని కేరళ భవన్ కమిషనర్ కు విజయన్ కీలక ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, భారత రాయబారి విభాగానికి అనుసంధానంగా ఉండేలా అధికారికంగా కేరళ ప్రభుత్వం ఓ లేఖను సైతం పంపారు.

విదేశీ వ్యవహారాలు కేంద్రం ఆధీనంలోనే..


వాస్తవానికి విదేశాంగ వ్యవహారాలు కేవలం కేంద్రం ఆధీనంలోనే ఉంటాయి. పలు దేశాలతో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు , అంతర్జాతీయ అంశాలు, విదేశీ రాయబారుల నియామకాలు ఇవన్నీ కేంద్రం ఆధీనంలోనే ఉంటాయి. మరి పినరయి విజయన్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, కేంద్రం అనుమతి లేకుండానే ఇలాంటి వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. దీనితో బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కేరళ ఏమన్నా ప్రత్యేక దేశంగా ఉంటోందా? కేరళ సీఎం విజయన్ తనకి తాను దేశ ప్రధానిగా భావిస్తున్నారా? ఏ రాష్ట్ర సీఎంకూ రాని ఆలోచన ఈయనకెందుకు వచ్చింది. కేంద్ర క్యాబినెట్ మంత్రులకు ప్రత్యామ్నాయంగా ముందు ముందు మంత్రులను కూడా నియమిస్తారేమో అని ట్రోలింగులు చేస్తున్నారు.

న్యాయపరమైన చిక్కులు

ఈ విషయంపై కేరళ మాజీ సెక్రటరీ మాట్లాడుతూ కేంద్రం సైతం విదేశీ వ్యవహారాల శాఖకు స్వతంత్ర శాఖగా గుర్తింపు నిచ్చింది. కేంద్రం కూడా విదేశాంగ శాఖ సలహాలు లేకుండా విదేశాలతో ఒప్పందాలు జరపదు. ఆ దేశ ప్రధానితో కలిసి దేశాభివృద్ధి కోసం తీసుకునే కీలక ఒప్పందాల వ్యవహారంలోనూ విదేశాంగ శాఖ అనుమతితోనే తీసుకుంటుంది. అలాంటి శాఖకు తెలియకుండా కేరళ ప్రభుత్వం స్వతంత్రంగా ఫారిన్ సెక్రటరీ అంటూ ఓ పోస్ట్ ను క్రియేట్ చేసి పంపడమేమిటి? దానికి చట్టబద్దత ఉంటుందా? ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్లు ఆయా రాష్ట్రాలు కూడా కేంద్ర పరిధిలోని శాఖలలో జోక్యం చేసుకుంటే అది రాజ్యంగ విలువలకు తూట్లు పొడిచినట్లవుతుంది అని అన్నారు. కేరళ రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు సైతం విజయన్ ది తొందరపాటు చర్యే అన్నారు. విజయన్ చేపట్టిన ఇటువంటి నియామకాలకు ఎలాంటి విలువలు ఉండవని అన్నారు. రాష్ట్రానికి సంబంధించి ఆయన కావాలంటే మంత్రుల శాఖలకు అదనంగా నియామకాలు చేపట్టవచ్చు. అంతేకానీ కేంద్ర నియామకాలంటూ ఇలాంటి పోస్టులకు ఎలాంటి ప్రాధాన్యతా ఉండదని వాదిస్తున్నారు. ఇలాంటి చర్యలతో ఆయన న్యాయపరమైన చిక్కుల్లో పడతారని ..ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

Tags

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×