EPAPER

Horoscope:నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారు కీలక పనులు వాయిదా వేస్తే మంచిది!

Horoscope:నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారు కీలక పనులు వాయిదా వేస్తే మంచిది!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశులు. ఈ రాశుల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏ రాశి వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అనే వివరాలను జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి, ఆటంకాలు ఎదురైనా మనోబలంతో పనులను పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం, నిర్ణయాలు ఫలిస్తాయి. నూతన ఆదాయ వనరులు ఏర్పడుతాయి. శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

వృషభం:
ఈ రాశి వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కోపాని అదుపులో ఉంచుకుంటే మంచిది. కీలక పనులను వాయిదా వేస్తేనే మంచిది. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సందర్శనంతో మంచి జరుగుతుంది.


మిథునం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలకు ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలి. మీ మీ రంగాల్లో పనిభారం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీలక్ష్మి గణపతి ధ్యానం శుభప్రదం.

కర్కాటకం:
కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు. వృత్తి, వ్యాపారంలో ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు. ఈ రోజు శుభవార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. విశ్రాంతి తీసుకుంటే మంచిది. శివారాధనతో ప్రశాంతత కలుగుతుంది.

సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు పెట్టిన పెట్టుబడికి ఆదాయం మూడింతలు పెరుగుతుంది. నూతన పెట్టుబడితో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. తోటివారి సహాయంతో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీసూర్యనారాయణమూర్తి ఆరాధనతో మంచి జరుగుతుంది.

కన్య:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విపరీతమైన శారీరక శ్రమతో విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు స్థానచలనం ఉండొచ్చు. అనవసర ఖర్చులపై జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో ఆపదలు తొలగిపోతాయి.

తుల:
తుల రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ధర్మసిద్ధి ఉంది. శారీరక శ్రమ, ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్థికపరమైన ప్రయోజనాలు అందుకుంటారు. గిట్టనివారితో సంతోషాన్ని పంచుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. దుర్గాస్తోత్రం చదవాలి.

వృశ్చికం:
ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. మనోధైర్యంతో పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న లాభాలు పొందుతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ కలహాలు ఏర్పడవచ్చు. పని ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు ఉత్సాహంతో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు స్థాన చలనం ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఇతరులతో ఆచితూచి వ్యహరించాలి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసులుఅందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివారాధన శ్రేయస్కరం.

మకరం:
మకర రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ కలహాలతో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. శుభవార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కీలకమైన పనులు వాయిదా వేస్తే మంచిది. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

కుంభం:
కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా పుంజుకుంటారు. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు, న్యాయపరమైన విషయాల్లో చర్చలతో సమస్యలు పరిష్కారమవుతాయి. శని ధ్యానం చేయాలి.

మీనం:
మీన రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికపరమైన లాభాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో సమయానికి పనులు పూర్తవుతాయి. మనోధైర్యం కోల్పోవద్దు. బంధు మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగుతాయి.

Related News

Tirumal Laddu: పవిత్ర తిరుమల లడ్డూ తయారీలో 8 మంది కీలక పాత్ర, ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసా?

Tulasi Plant: తులసి పూజ ఎప్పుడు చేయాలి, వాయు పురాణం ఏం చెబుతోందంటే..

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Big Stories

×