EPAPER

Movies: సినిమా లవర్స్‌కు షాక్.. మూవీ టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లపై సెస్ బాదుడు

Movies: సినిమా లవర్స్‌కు షాక్.. మూవీ టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లపై సెస్ బాదుడు

Cess Impose: సినిమా లవర్స్‌కు కర్ణాటక ప్రభుత్వం షాకింగ్ న్యూస్ ఇచ్చింది. ఇకపై సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లపై సెస్ బాదాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న టికెట్ల ధరలు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లపై సెస్ విధించాలని సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఇకపై వీటిపై 2 శాతం సెస్ వసూలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.


స్వచ్ఛ భారత్ టాక్స్‌లాగా ఇకపై ఈ సెస్ రూపంలో కూడా సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లపై భారం పడనుంది. అయితే, ఈ మార్గంలో వచ్చే డబ్బులను సినీ, సాంస్కృతిక కార్యకర్తల కోసమే ఖర్చు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తున్నది. టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లపై మాత్రమే కాదు.. వినోద రంగానికి సంబంధించిన ఆదాయ వనరులు అన్నింటిపైనా, రాష్ట్ర పరిధిలో ప్రదర్శించే నాటకాలపై కూడా ఈ సెస్ విధించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కళాకారులకు మేలు చేసే ఉద్దేశ్యంతోనే ఈ బిల్లు తెచ్చారని చెబుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోని వివిధ వేదికలపై పని చేస్తున్న కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు అలాగే ఇతరులు ఈ ఫండ్‌లో భాగం అవుతారని తెలుస్తున్నది. అంతేకాదు, రాబోయే కాలంలో థియేటర్‌లో ఉన్నవారికి కూడా ఈ బిల్లు వల్ల ప్రయోజనాలు సమకూరుతాయని చెబుతున్నారు.

కర్ణాటక సినీ, సాంస్కృతిక కార్యకర్తల సామాజిక భద్రత, సంక్షేమ నిధి పేరుతో ఒక నిధిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఈ బిల్లును ప్రతిపాదించినట్టు తెలిసింది. ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలో సినిమా టికెట్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్‌లపై సెస్ విధించే అవకాశం ఉన్నది.


Also Read: బస్సు దిగుతుండగా గన్ మిస్ ఫైర్.. సీఐఎస్ఎఫ్ జవాన్ మృతి

ఇప్పటికే సినిమా లవర్స్‌కు టికెట్ల రేట్ల పెంపు భారంగా మారింది. ముఖ్యంగా పెద్ద సినిమాలు చాలా థియేటర్‌లలో రిలీజ్ చేసి తొలినాళ్లలలో విపరీతంగా టికెట్ రేట్లు పెంచడంతో చాలా మంది సినీ ప్రేమికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ రేట్లతో టికెట్లు కొనలేక.. మరో సినిమా చూడలేక కొంత అసంతృప్తికి లోనవుతున్నారు. ఈ సందర్భంలో కర్ణాటక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

Related News

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

Big Stories

×