EPAPER

NEET Retest: టాప్ స్కోర్లు వచ్చిన హర్యానా సెంటర్‌లో రీటెస్ట్ తర్వాత ఫలితాలు ఎలా ఉన్నాయి?

NEET Retest: టాప్ స్కోర్లు వచ్చిన హర్యానా సెంటర్‌లో రీటెస్ట్ తర్వాత ఫలితాలు ఎలా ఉన్నాయి?

Top Scores: హర్యానాలోని ఓ నీట్ పరీక్షా కేంద్రంలో రాసిన పలువురు విద్యార్థుల స్కోర్లు అనుమానాలను రేకెత్తించాయి. ఒకే సెంటర్‌లో రాసిన ఆరుగురు విద్యార్థులకు 720 మార్కులకు గాను 720 మార్కులు వచ్చాయి. సుమారు 500 మంది ఆ సెంటర్‌లో పరీక్ష రాయగా.. ఇద్దరు స్టూడెంట్లకు గ్రేస్ మార్కులు మినహా 718 మరియు 719 మార్కులు వచ్చాయి. ఇది అసాధ్యం. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారించింది. మళ్లీ పరీక్ష నిర్వహించడానికి ఆదేశించింది. అప్పుడు అనూహ్యంగా మార్కులు వచ్చిన హర్యానాకు చెందిన ఆ సెంటర్‌లో ఇప్పుడు రీటెస్టు నిర్వహించిన తర్వాత ఫలితాలు ఎలా వచ్చాయి?


హర్యానాకు చెందిన బహదూర్‌గడ్‌లోని హర్దయాల్ పబ్లిక్ స్కూల్‌లో 494 మంది స్టూడెంట్లు మళ్లీ నీట్ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో అత్యధికంగా ఓ విద్యార్థి 682 మార్కులు సాధించాడు. మరో 13 మంది విద్యార్థులు 600 మార్కులను దాటగలిగారు. మే 5వ తేదీన నిర్వహించిన పరీక్ష ఫలితాలతో పోల్చితే చాలా భిన్నంగా ఉన్నాయి. అప్పుడు ఆ సెంటర్‌లో ఆరుగురు విద్యార్థులు 720కి 720 మార్కులు సంపాదించగా.. రీ ఎగ్జామినేషన్‌లో గరిష్టంగా ఒక విద్యార్థి 682 మార్కులు సాధించారు.

ఈ పరీక్షా కేంద్రంలో ఊహించని రీతిలో ఫలితాలు రావడంతోనే నీట్ పరీక్ష నిర్వహణపైనే అనుమానాలు వచ్చాయి. సాధ్యం కాని రీతిలో ఫలితాలు రావడంతో పలువురు కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. గ్రేస్ మార్కులను రద్దు చేస్తూ.. 1,563 మంది అభ్యర్థులను మళ్లీ పరీక్ష రాయాలని ఆదేశించింది. ఇందులో 800 మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష రాశారు.


Also Read: పాఠశాలల వేళల్లో మార్పు.. ఉత్తర్వులు జారీ

మే 5వ తేదీన దేశవ్యాప్తంగా 4750 సెంటర్‌లలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించారు. నిర్వహణా లోపాలు, పేపర్ లీక్‌లతో పరీక్షపై తీవ్ర అనుమానాలు, అభ్యంతరాలు వచ్చాయి. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై ఇంకా వాదనలు వింటున్నది. తదుపరి విచారణ జులై 22వ తేదీన ఉన్నది. చాలా పిటిషన్లు ఈ పరీక్షను రద్దు చేయాలని, మరికొన్ని రీటెస్టు చేయాలని, ఇంకొన్ని పిటిషన్లు ఈ అవకతవకలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలని విజ్ఞప్తులతో దాఖలయ్యాయి.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×