దేశంలో ఒప్పో కొత్త A-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ఇందులో భాగంగా Oppo A3xను తీసుకురానుంది.

దీన్ని మిడ్ రేంజ్ ప్రైస్‌లో తీసుకురావచ్చు.

అయితే కంపెనీ దీన్ని పరిచయం చేయకముందే ఇంటర్నెట్‌లో దీని స్పెసిఫికేషన్లు, డిజైన్ లీక్ అయ్యాయి.

Oppo A3x లిక్విడ్ రెసిస్టెంట్ రేటింగ్‌‌తో వస్తుంది.

ఫోన్ వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్,  ఫ్లాట్ డిజైన్‌ను మనం చూడవచ్చు.

పోస్టర్ ఆధారంగా మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ డిజైన్, మల్టీ లిక్విడ్ రెసిస్టెంట్ (IP54 రేటింగ్)ని కూడా హైలైట్ చేస్తుంది.

ముందు భాగంలో 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే (1000 నిట్స్ పీక్) ఉంటుంది.

సెల్ఫీ కెమెరా కోసం డిస్‌ప్లే పంచ్ హోల్ కటౌట్ అందుబాటులో ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్ మూడు అందమైన కలర్ వేరియంట్‌లలో వస్తుంది.