EPAPER

Flipkart GOAT Sale: ఆఫర్ల జాతర.. ఐఫోన్ 15పై రూ.35 వేల డిస్కౌంట్!

Flipkart GOAT Sale: ఆఫర్ల జాతర.. ఐఫోన్ 15పై రూ.35 వేల డిస్కౌంట్!

Flipkart GOAT Sale: ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ ప్రారంభమైంది.ఈ రోజు నుంచి సేల్ అందరికి లైవ్ అవుతుంది. ఇందులో భాగంగా ఐఫోన్ 15పై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఆపిల్ ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 2023లో సేల్‌కు తీసుకొచ్చింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. మీరు ఐఫోన్ లైవర్స్ అయితే కచ్చితంగా ఈ ఆఫర్ ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు ఫోన్‌ను కేవలం రూ.35,597 మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై ఉన్న ఆఫర్లు, దాని ఫీచర్లు తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఐఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 64,999 (128GB) ప్రారంభ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అయితే ఫోన్ 256GB, 512GB వేరియంట్‌లు వరుసగా రూ.74,999, రూ.94,999కి అందుబాటులో ఉన్నాయి. నెట్ బ్యాంకింగ్ లావాదేవీ ద్వారా రూ. 1,000 తగ్గింపు లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.

Also Read: Amazon Prime Day Sale 2024: ఆఫర్లో ఇవే కొనండి.. గేమింగ్‌కు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. 41 శాతం డిస్కౌంట్!


ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మీరు స్మార్ట్‌ఫోన్ రూ.57,450 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు iPhone 13ని ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే మీరు రూ. 29,700 అదనపు తగ్గింపును పొందవచ్చు. ఇది మాత్రమే కాదు మీకు కావాలంటే మీరు మీ ఫోన్‌ని 7 రోజుల తర్వాత కూడా మార్చుకోవచ్చు. ఏ ప్లాట్‌ఫారమ్‌ అయినా ఇలాంటి సౌకర్యాన్ని కల్పించడం ఇదే తొలిసారి. మీరు ఫోన్ ఎక్స్ఛేంజ్, ఫ్లాట్ తగ్గింపుతో రూ. 35,597కి కొనుగోలు చేయవచ్చు.

అలానే ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్ కాంబో ఆఫర్ ద్వారా రూ.2,000 అదనపు తగ్గింపును అందిస్తోంది. మీరు మరింత తక్కువ ధరకు ఫోన్ పొందగలిగేలా ఈ ఆఫర్ డీల్‌ను మరింత తక్కువగా చేస్తుంది. కలర్ వేరియంట్ల గురించి మాట్లాడితే మీరు హ్యాండ్‌సెట్‌ను బ్లాక్, బ్లూ, గ్రీన్, రోస్, ఎల్లో కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

iPhone 15 Specifications
iPhone 15 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED స్క్రీన్‌ను 2,000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌తో కలిగి ఉంది. ఫోన్ A16 బయోనిక్ చిప్‌ని కలిగి ఉంది. iOS 17లో రన్ అవుతుంది. సెప్టెంబర్‌లో ఐఓఎస్ 18 అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌కి ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను అప్‌డేట్ చేయదు.

Also Read: Prime Day Sale Cheapest Mobiles: అమోజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ 5 ఫోన్లు తక్కువ ధరకే.. మరికొన్ని గంటలే ఛాన్స్!

కెమెరా గురించి మాట్లాడితే హ్యాండ్‌సెట్‌లో 48MP మెయిన్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్ వెనుక, 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. కనెక్టివిటీ గురించి మాట్లాడితే ఇది Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC, USB టైప్-C పోర్ట్‌లను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ డైనమిక్ ఐలాండ్, IP68 రేటింగ్, 15W వరకు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది.

Related News

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

Big Stories

×