EPAPER

Mohammed Shami| ‘మూడు మ్యాచ్‌లలో 13 వికెట్లు తీశాను.. ఇంకా ఏం చేయమంటారు’.. కొహ్లీ, రవిశాస్త్రిపై మండిపడ్డ మొహమ్మద్ షమీ

Mohammed Shami| ‘మూడు మ్యాచ్‌లలో 13 వికెట్లు తీశాను.. ఇంకా ఏం చేయమంటారు’.. కొహ్లీ, రవిశాస్త్రిపై మండిపడ్డ మొహమ్మద్ షమీ

Mohammed Shami latest comments(Sports news headlines): ప్రపంచ కప్ చరిత్ర గురించి మాట్లాడితే.. మంచి ఆటతీరుతో కనబర్చిన బౌలర్లలో మొహమ్మద్ షమీ ముందువరుసలో ఉంటుంది. ప్రపంచ కప్ సిరీస్ మొత్తంలో అందరికంటే ఎక్కువ వికెట్లు తీసిన టీమిండియా బౌలర్ మొహమ్మద్ షమీ. 55 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ప్రపంచ కప్‌లో చరిత్ర సృష్టించాడు షమీ. ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఆసియా దేశాల బౌలర్ల లిస్టులో షమీ మూడవ స్థానంలో ఉండగా.. ప్రపంచ దేశాల జాబితాలో చూస్తే.. అయిదవ స్థానంలో ఉన్నాడు. ప్రపంచ కప్ లో నాలుగు సార్లు ఒక్కో మ్యాచ్ లో అయిదు వికెట్లు తీసిన ఒకే ఒక్క బౌలర్ షమీ మాత్రమే. ఇంత మంచి ఆటతీరు కనబర్చినా.. ఐసిసి టోర్నమెంట్ మ్యాచ్ లలో గత మూడు సీరిస్‌లు తీసుకుంటే టీమిండియా లో ఆడే 11 మందిలో ఆయనకు చాలా కష్టంగా చోటు లభించింది.


గత మూడు ప్రపంచ కప్‌లలో ఇండియా మొత్తం 28 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో షమీ ఆడింది 18 మ్యాచ్ లే, ఆ 18 లో 15 మ్యాచ్‌లు ఇండియా విజయం సాధించింది. ఇటీవల ఒక పాడ్ కాస్ట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మంచి ఆటతీరు కనబర్చినా.. తనకు టీమ్‌లో చోటు ఆడనివ్వకుండా పక్కన పెట్టారని చెప్పారు.

కోహ్లీ- శాస్త్రిపై పరోక్షంగా మండిపడ్డ షమీ

ఒక యూట్యూబ్ కార్యక్రమం ‘అన్ ప్లగడ్’లో ఆయన మాట్లాడుతూ.. 2019లో టీమిండియా మెనేజ్‌మెంట్ ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించిందని.. అప్పుడు అదంతా తనకు ఆశ్చర్యంగా అనిపించందని ”అన్నాడు. ప్రతి టీమ్‌కు మంచి ఆటతీరు కనబర్చే ఆటగాడి అవసరం ఉంటుంది. మరి అత్యత్తమ ఆటతీరు ఉన్నా నన్ను పక్కన పెట్టారు. మరి ఇలా ఎందుకు చేశారు?”, అని షమీ ప్రశ్నించాడు. 2023 ప్రపంచ్ కప్ లో, అలాగే 2019 ప్రపంచ కప్ లో షమీని గ్రూప్ దశ మొదటి మ్యాచ్ లోనే ఆయనను పక్కన పెట్టేశారు. ఆ సమయంలో టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గా రవిశాస్త్రి ఉన్నారు. గత ప్రపంచ్ కప్ లో చూస్తే.. సూపర్ 8 రౌండ్ లో ఆఫ్ఘనిస్తాన్ తో ఆడిన మ్యాచ్ లో మొదటిసారి షమీని టీమ్‌లో తీసుకున్నారు.


మంచి బౌలింగ్‌ ప్రదర్శన చేసినా.. నన్ను ఎందుకు పక్కన పెట్టారు?
2019 ప్రపంచ కప్ లో నాలుగు మ్యాచ్ లల మొహమ్మద్ షమీ 14 వికెట్లు తీశాడు. అయినా న్యూజిల్యాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ నుంచి ఆయనను తప్పంచారు. ఆ మ్యాచ్ ఇండియా కేవలం 18 రన్లతో ఓడిపోయింది. ఈ విషయాన్ని ఆయన పాడ్ కాస్ట్ లో ప్రస్తావిస్తూ.. “2019 ప్రపంచ కప్ లో నేను 5 మ్యచ్‌లు ఆడలేదు. ఆ తరువాత ఆడిన మ్యాచ్ లో నేను హ్యాట్రిక్ వికెట్లు తీశాను, వెంటనే తదుపరి మ్యాచ్ లో 5 వికెట్లు, ఆ తరువాత మ్యాచ్ లో 4 వికెట్లు తీశాను. 2023లోనూ ఇలాగే జరిగింది. నన్ను ముందుగా జరిగిన మ్యాచ్ లలో ఆడించలేదు. ఆ తరువాత జరిగిన మ్యాచ్ లలో అయిదు వికెట్లు ఒక మ్యాచ్ లో, నాలుగు ఒక మ్యాచ్ లో, మళ్లీ అయిదు వికెట్లు ఒక మ్యాచ్ లో పడగొట్టాను. ఒక విషయం నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

ప్రతి టీమ్ కు మంచి ఆటతీరు కనబరిచే ప్లేయర్ చాలా అవసరం. నేను మూడు మ్యాచ్ లలో 13 వికెట్లు తీశాను. ఇంతకంటే ఎక్కువ ఏం చేయమంటారు? నా నుంచి ఇంకా ఏం కోరుకుంటున్నారు. ఈ ప్రశ్నలకు నాకు ఇంతవరకూ సమాధానం దొరకలేదు. నన్ను నేను నిరూపించుకోవాలంటే నాకు అవకాశం ఇవ్వాలి కదా. నన్ను మ్యాచ్ ఆడనిస్తే.. నేను మూడు మ్యాచ్ లలో 13 వికెట్లు తీశాను. మళ్లీ సెమీ ఫైనల్ లో పక్కన పెట్టారు. జట్టు ఓడిపోయింది. మొత్తం సిరీస్ లో నాలుగు మ్యాచ్ లలో 14 వికెట్లు తీశాను. మళ్లీ 2023లో ఏడు మ్యాచ్ లు ఆడాను 24 వికెట్లు తీశాను.” అని భావోద్వేగంగా అన్నాడు.

Also Read: హార్దిక్ పాండ్యా ఏం తప్పు చేశాడని కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వలేదు?

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×