EPAPER

Harbhajan Singh counter: పాక్ జర్నలిస్టుపై హర్బజన్‌సింగ్ ఆగ్రహం, ధోనితో రిజ్వాన్‌‌ పొలిక‌పై

Harbhajan Singh counter: పాక్ జర్నలిస్టుపై హర్బజన్‌సింగ్ ఆగ్రహం, ధోనితో రిజ్వాన్‌‌ పొలిక‌పై

Harbhajan Singh counter: వచ్చే ఏడాది భారత్-పాకిస్థాన్ మధ్య ఛాంపియన్‌షిప్ ఏమోగానీ, అప్పుడే మాటలయుద్ధం మొదలైనట్టు కనిపిస్తోంది. తాజాజగా టీమిండియా మాజీ ఆటగాడు హర్బజన్‌సింగ్ పాకిస్థాన్‌ కి చెందిన ఓ జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఎవరితోనైనా పోల్చేటప్పుడు ఆ వ్యక్తి దానికి సరైన వాడా కాదా అనేది చూడాలన్నాడు. ఏదో హైలైట్ కావాలనే ఉద్దేశంతో ఎలాగపడితే అలా పోస్టు పెట్టడం మంచిది కాదన్నాడు.


పాకిస్థాన్‌కు చెందిన ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. దాని సారాంశం ఏంటంటే.. టీమిండియా దిగ్గజ ఆటగాడు మాజీ కెప్టెన్ ధోనితో ఆ దేశ క్రికెట్ రిజ్వాన్‌ను పోల్చాడు. వీరిద్దరిలో ఎవరు అత్యుత్తమం అని ఫోటోకు చిన్న క్యాప్షన్ జోడించాడు. ఈ విషయం టీమిండియా మాజీ ఆటగాడు బజ్జీ దృష్టికి వచ్చింది. భారత జట్టుకు రెండు ప్రపంచకప్‌లు అందించిన ఎంఎస్ ధోని ఎక్కడ? ఇప్పుడిప్పుడే ఆ దేశ క్రికెట్‌లో ఆడుతున్న రిజ్వాన్ ఎక్కడంటూ రుసరుసలాడాడు.

ప్రపంచ క్రికెట్‌లో సెంబర్ వన్ ఆటగాడు ధోనితో అనుభవం లేని ఆటగాడ్ని పోల్చడం సరికాదన్నారు హర్బజన్‌సింగ్. ఓ ఛానెల్ ఇంటర్య్వూలో మాట్లాడిన టీమిండియా మాజీ ఆటగాడు హర్బజన్, ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగడం దారుణమన్నారు. అసలు అనుభవం లేని ఆటగాడ్ని ధోనితో పోల్చడం విడ్డూరంగా ఉందన్నాడు. ఏ మాత్రం ధోనీతో సరితూగే ప్లేయర్ మాత్రం కాదన్నాడు.


తాను రిజ్వాన్ బ్యాటింగ్ ను తక్కువ చేయలేదన్నాడు హర్బజన్‌సింగ్. కానీ కంపేర్ చేసే విధానం కరెక్ట్‌గా లేదన్నాడు. రిజ్వాన్ ఆటను ఇష్టపడతానని, నిబద్దతతో ఆడేందుకు ప్రయత్నం చేస్తాడన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటికే ధోనీ నెంబర్ వన్ అని చెప్పుకొచ్చాడు. వికెట్ల వెనుక చురుగ్గా వ్యవహరించే ఆటగాళ్లలో ధోనీ లాంటి ప్లేయర్లు తక్కువమంది ఉంటారన్నాడు.

Also read:  హార్దిక్ పాండ్యా ఏం తప్పు చేశాడని కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వలేదు?

ధోనీ సారధ్యంలోని టీమిండియా వన్డే, టీ20, ఛాంపియన్ ట్రోపీ విజేతగా నిలిచింది. అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసిన మహేంద్రసింగ్ ధోనీ, ఐపీఎల్‌లో చెన్నై జట్టు తరపున ఆడుతున్నాడు. ఈ ఏడాది చెన్నై జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విషయం తెల్సిందే.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×