EPAPER

Vinay Mohan Kwatra: అమెరికాకు భారత కొత్త రాయబారిగా వినయ్ క్వాత్రా

Vinay Mohan Kwatra: అమెరికాకు భారత కొత్త రాయబారిగా వినయ్ క్వాత్రా

Vinay Mohan Kwatra appointed Indian ambassador to US: అమెరికాకు భారత కొత్త రాయబారిగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి వినయ్ క్వాత్రా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో పనిచేసిన తరణ్ జిత్ సింగ్ జనవరిలో పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆయన స్థానంలో వినయ్ క్వాత్రాను విదేశీ వ్యవహారాల శాఖ నియమించింది.


కాగా, 2020 నుంచి 2024 వరకు అమెరికా రాయబారిగా ఉన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, డోనాల్డ్ ట్రంప్ తిరిగి పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయనే అంచనాల నేపథ్యంలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా నియమితులు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

భారతదేశ 34వ విదేశాంగ కార్యదర్శిగా పనిచేసని వినయ్ మోహన్ క్వాత్రా..1988 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి. ఆయన 2022 మే 1 నుంచి 2024 జూలై 14 వరకు విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టక ముందు ఆయన నేపాల్ దేశానికి భారత రాయబారిగా పనిచేశారు. ఈయన అంతకుముందు వివిధ హోదాల్లో పనిచేశారు.


వినయ్ మోహన్ క్వాత్రాకు దౌత్యవేత్తగా 34 ఏళ్ల అనుభవం ఉంది. క్వాత్రా 2017 ఆగస్టు నుంచి 2020 ఫిబ్రవరి వరకు ఫ్రాన్స్ రాయబారిగా పనిచేశారు. ఆ తర్వాత 2020 మార్చి నుంచి 2022 ఏఫ్రిల్ వరకు నేపాల్ లో భారత రాయబారిగా పనిచేశారు. అయితే క్వాత్రా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన విధాన ప్రణాళిక-పరిశోధన విభాగానికి నాయకత్వం వహించారు.

Also Read: విండోస్ ఎఫెక్ట్‌పై ఛైర్మన్ సత్య నాదెళ్ల ఫస్ట్ రియాక్షన్

అంతకుముందు అమెరికా విభాగానికి 2013 జూలై నుంచి 2015 అక్టోబర్ మధ్య ఫారిన్ లో అధిపతిగా పనిచేశారు. 2010 మే నుంచి 2013 జూలై వరకు వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయంలో వాణిజ్యం మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే ప్రధానమంత్రి కార్యాలయంలో 2015 నుంచి 2017 మధ్య సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×