EPAPER

Elon Musk: మైక్రోసాఫ్ట్ కాదు.. మాక్రోహార్డ్ అంటూ ఎలాన్ మస్క్ సెటైర్

Elon Musk: మైక్రోసాఫ్ట్ కాదు.. మాక్రోహార్డ్ అంటూ ఎలాన్ మస్క్ సెటైర్

Elon Musk: మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో..ప్రపంచ వ్యాప్తంగా పలు వ్యాపార సంస్థలు, బ్యాంకు సేవలు నిలిచిపోయాయి. అంతే కాకుండా విమాన రాకపోకలు కూడా ఆలస్యం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే బిలియనీర్ ఎలన్ మస్క్ సెటైర్ వేసారు. తన ఎక్స్ అకౌంట్‌లో ఈ అంశంపై స్పందిస్తూ ఓ మీమ్‌కు లాఫింగ్ ఎమోజీని పెట్టి పోస్టు చేశారు. మైక్రోసాఫ్ట్ కాదు..మాక్రోహార్డ్ అని ట్వీట్ చేశారు.


2021లో చేసిన క్రిప్టిక్ ట్వీట్‌ను మస్క్ మరో సారి రీట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లోనే మైక్రోసాఫ్ట్ సంస్థను మాక్రోహార్డ్‌గా వర్ణించారు. ఇక ఇండియన్ చేసిన ఓ ట్వీట్‌కు నవ్వే ఎమోజీని కూడా మస్క్ పోస్టు చేశారు. ఆ ట్వీట్‌లో ఓ పోస్టు చేశారు. అన్ని క్రాష్ అవుతున్నా.. ఎక్స్ మాత్రం ఇంకా పంక్షన్‌లోనే ఉన్నట్లు ఆ ట్వీట్ లో ఉంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజూర్ క్రౌడ్ , మైక్రోసాఫ్ట్ 365 సర్వీసుల్లో సమస్యలు తలెత్తాయి. ఎయిర్ లైన్స్ , బ్యాంకులతో పాటు టీవీలు, రేడియో బ్రాడ్ కాస్ట్‌లపై తీవ్ర ప్రభావం పడింది. విండోస్ వర్క్ స్టేషన్ లో స్క్రీన్లు అన్నీ ఎర్రర్ చూపించాయి. సమస్యను తగ్గించేందుకు ఇంపాక్ట్‌కు గురైన ట్రాఫిక్‌ను మరో సిస్టమ్ కు మార్చనున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.

క్లౌడ్ సర్వీసుల్లో సమస్యల వల్ల స్పెస్‌జెట్, ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా, ఆకాశా ఎయిర్ సంస్థలకు చెందిన విమానాల బుకింగ్, చెక్ ఇన్ అప్డేట్స్ అన్ని గల్లంతయ్యాయి. అమెరికాకు చెందిన ఫ్రంటైడ్ ఎయిర్ లైన్స్ 147 విమానాలను రద్దు చేసింది. 200 విమానలను కూడా ఆలస్యం అయ్యాయి. అంతే కాకుండా సన్ కంట్రీ, ఎలిగంట్ సంస్థలు కూడా 50% వరకు విమానాలను రద్దు చేశాయి.


ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో పలు కంప్యూటర్లు, ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్ తో నడిచే కంప్యూటర్లు లాప్‌టాప్‌లలో బ్లూ స్క్రీన్ బ్యాక్ వచ్చింది. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో ఈ సమస్య ఉత్పన్నమైంది. ఈ కారణంగా అంతర్జాతీయ స్థాయిలో విమానాలు, బ్యాంకు స్టోరేజ్, మీడియా సేవలకు అంతరాయం కలిగింది.

Also Read: దుబాయ్‌లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతనో తెలిస్తే షాకవుతారు!

ఈ క్రమంలో భారత్‌లో విమాన సర్వీసుల్లో అంతరాయం కలిగింది. దీంతో కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అడ్వైజరీలో అప్‌డేట్ కారణంగా సమస్య ఏర్పడిందని వెల్లడించింది. దీనికి కారణం వల్ల చాలా వ్యవస్థలు స్థంభించిపోయినట్లు తెలిపింది.అలాగే యూఏఈకి చెందిన సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సైతం పౌరులకు అడ్వైజరీ జారీ చేసి మెరుగైన భద్రత కోసం గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయాలని సూచించింది. గూగుల్ విడుదల చేసిన కొత్త క్రోమ్ అప్‌డేట్ ఇన్‌స్ట్రాల్ చేయాలని తెలిపింది.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×