టెక్ మేకర్ సామ్‌సంగ్ త్వరలో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది.

ఇందులో సామ్‌సంగ్ గెలాక్సీ A06 కూడా ఉంది.

ఈ బడ్జెట్ ఫోన్ మేలేషియన్ స్టాండర్డ్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ ఇన్‌స్టిట్యూట్ నుంచి ధృవీకరణ పొందింది.

ఈ సామ్‌సంగ్ ఫోన్ ఎఫ్‌సిసి, బిఐఎస్ డేటా బేస్‌లో కనిపించింది.

దీని ఆధారంగా ఫోన్ త్వరలో గ్లోబల్ మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది.

అయితే ప్రస్తుతం ఈ సర్టిఫికేషన్లు ఫోన్ ఫీచర్ల గురించి పెద్దగా వెల్లడించలేదు.

ఇది SM-A065F/DS మోడల్ నంబర్ కలిగి ఉంటుంది.

డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.

ఇది 4G LTE నెట్‌వర్క్‌కు సపోర్ట్ ఇస్తుంది.

అంటే ఇది 5G స్మార్ట్‌ఫోన్ కాదు. ఇందులో 5జీ సిమ్ కార్డ్‌లు పనిచేయవు.