EPAPER

TG DSC 2024 Exam: మొదలైన డీఎస్సీ పరీక్షలు.. పిటిషనర్లకు షాకిచ్చిన హైకోర్టు

TG DSC 2024 Exam: మొదలైన డీఎస్సీ పరీక్షలు.. పిటిషనర్లకు షాకిచ్చిన హైకోర్టు

Telangana High Court on DSC Postpone(TS today news): డీఎస్సీ ఎగ్జామ్‌ను వాయిదా వేయాలి. గత కొన్ని రోజులుగా ఇదే అంశంపై నానాయాగీ జరిగింది. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేశారు. ఉద్రిక్తతలను పెంచారు.. తీరా ఏమైంది..? చాలా ప్రశాంతంగా ఎగ్జామ్‌ మొదలైంది..? అదే సమయంలో హైకోర్టు కూడా ఈ అంశంపై విచారణ ప్రారంభించింది. ఇంతకీ ఎగ్జామ్స్‌ వాయిదాపై హైకోర్టు చెప్పిందేంటి? డీఎస్సీని వాయిదా వేయాలి.


గత కొన్ని రోజులుగా తెలంగాణ పాలిటిక్స్‌లో కాస్త హైలేట్ అయిన అంశం. నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. కానీ తీరా ఏమైంది.. షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్‌ ప్రారంభమయింది. అభ్యర్థులంతా ప్రశాంతంగా ఎగ్జామ్స్‌ రాస్తున్నారు. అయితే ఎగ్జామ్స్‌ ప్రారంభమవడానికి ఒకరోజు ముందు హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. అది కూడా ఎగ్జామ్స్‌ను పోస్ట్‌ పోన్ చేయాలంటూ ఓ పది మంది నిరుద్యోగులు పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. విచారణ ఆగస్టు 28కి వాయిదా వేసింది. అప్పటి వరకు పరీక్షలు మొత్తం అయిపోతాయి.. అది వేరే విషయం. అయితే వాదనలు జరిగే సమయంలో కొన్ని కీలక ప్రశ్నలు వేసింది.. ఇదే ఇక్కడ హైలేట్.

పిటిషన్‌ వేసిన పది మంది నిరుద్యోగులు అసలు DSC ఎగ్జామ్ రాస్తున్నారా? ఇది హైకోర్టు పిటిషనర్ల తరపు న్యాయవాది అయిన రవిచందర్‌ను అడిగిన ప్రశ్న.. ఎందుకంటే ఈ పదిమందిలో ఏ ఒక్కరూ కూడా తమ DSC హాల్ టికెట్స్‌ను సబ్మిట్ చేయలేదు. అందుకే కోర్టు ఈ ప్రశ్న వేసింది. అంతేకాదు ఇలా చేయడం సరికాదంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. DSC ఎగ్జామ్ వాయిదా వేయాలంటూ ఆ ఎగ్జామ్‌కు సంబంధించిన హాల్ టికెట్‌ను ఎందుకు ఇవ్వలేదని సూటిగా ప్రశ్నించింది. అయితే గ్రూప్‌ వన్‌తో పాటు DSCకి కూడా అప్లై చేశారని కోర్టుకు తెలిపారు వారి తరపు లాయర్.. కానీ ఎగ్జామ్‌ ప్రారంభమయ్యే రోజు విచారణ పెట్టుకొని సరైన ఆధారాలు సమర్పించకపోతే ఎలా అన్నది ధర్మాసనం ఆలోచన.


నిజానికి ఈ పిటిషన్‌ ఓ దింపుడు కళ్లెం ఆశ లాంటిది. ఎందుకంటే షెడ్యూల్ ప్రకారమే DSC నిర్వహిస్తామని ఘంటాపథంగా చెప్పింది. దీనికి రీజన్‌ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. టెట్ ఎగ్జామ్ నిర్వహించి.. నాలుగు నెలలు అయిపోయింది. ప్రిపరేషన్‌కు ఈ నాలుగు నెలలు సరిపోదా అనేది ప్రభుత్వ పెద్దలు సూటిగా వేసే ప్రశ్న.. అంతేకాదు బీఆర్ఎస్‌ హయాంలో వేసిన DSC నోటిఫికేషన్‌కే.. మరిన్ని పోస్టులు పెంచి తిరిగి నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటికీ.. ఇప్పటికీ సిలబస్ ఏం మారలేదు. ఏళ్లుగా ప్రిపేర్ అవుతున్నారు.. ఇంకా ఏంటి ఇబ్బంది అంటూ ప్రశ్నిస్తున్నారు.

Also Read: రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు..అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశాలు

దీనికి ఆందోళనలు చేసే వారి నుంచి సమాధానం లేదు. నిజానికి చాలా మంది శ్రద్ధగానే ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నారు. కానీ కొందరు రాజకీయ నిరుద్యోగులు.. కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల డైరెక్షన్‌లో ఆందోళనలు నిర్వహించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఆరోపణలు, దీక్షలు చేసిన వారిలో చాలా మందికి అసలు డీఎస్సీఎగ్జామ్‌తో సంబంధమే లేదు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి నేరుగానే ప్రశ్నించారు. ఈ విషయాలు కూడా చాలా మంది అభ్యర్థులకు అర్థమైంది. కొన్ని పార్టీలు చేపిస్తున్న డ్రామా అనేది తెలిసిపోయింది. అందుకే చాలా మంది అభ్యర్థులు వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రిపరేషన్‌లో మునిగిపోయారు. ఆగస్టు 5 వరకు విడతల వారీగా ఎగ్జామ్స్ జరగనునున్నాయి. ఇప్పుడు అందరి కాన్సన్‌ట్రేషన్ వాటిపైనే ఉంది. ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు వారి భవితవ్యంతో ఆడుకోకుండా కాస్త సంయమనం పాటిస్తే మంచింది.

ఆగస్టు 28న మళ్లీ డీఎస్సీ వాయిదాపై హైకోర్టు విచారణ జరపనుంది. ఆ రోజు హైకోర్టు తీసుకునే నిర్ణయం ఏదైనా అటు ఇటైతే.. ఇప్పుడు ఎగ్జామ్స్‌ రాస్తున్న లక్షలాది మంది మాత్రం ఈ ఆందోళనలు నిర్వహించిన వారిపైనే తిరగబడతారు. ఎందుకంటే కష్టపడి రాసిన ఎగ్జామ్‌ను మళ్లీ రాయాల్సి రావడం అనేది అభ్యర్థులకు ఇష్టం ఉండే చాన్స్ అయితే లేదు. ఇదే కాకుండా అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదే కాకుండా త్వరలోనే మరో డీఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్‌ సర్కార్ హామీ ఇచ్చింది. సో.. నిరుద్యోగులంతా దీనిపై ఫోకస్ చేస్తారు. అలాంటి సమయంలో ఎగ్జామ్ పోస్ట్‌పోన్‌ అయ్యిందన్న వార్త వస్తే మాత్రం ఆనందపడే వారికంటే ఆగ్రహించే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది.

నిజానికి ఇది కూడా నిజమే కదా.. ఇప్పుడు ఎగ్జామ్‌ను వాయిదా వేస్తే మళ్లీ కథ మొదటికి వస్తుంది. పరీక్షల నిర్వహణ ఆలస్యమవుతుంది. దాంతో పాటు రిజల్ట్స్‌ రావడం.. పోస్టులను భర్తీ చేయడం.. ఇలా ప్రతి అంశం మరింత లేటవుతుంది. అప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. నష్టపోతారు..

Related News

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Big Stories

×