EPAPER

Donald Trump Shooter: ట్రంప్‌పై దాడి.. ముందే హింట్ ఇచ్చిన క్రూక్స్

Donald Trump Shooter: ట్రంప్‌పై దాడి.. ముందే హింట్ ఇచ్చిన క్రూక్స్

Donald Trump Shooter: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కల్పులు చోటుచేసుకున్నాయి. కాగా ఈ కాల్పుల్లో ఆయన తృటిలో తప్పించుకున్నారు. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ ట్రంప్‌పై కాల్పులు జరపగా.. ఆయన చెవిని తాకుతూ బుల్లెట్ ప్రక్కకు దూసుకుని వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన సిక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయనను ఆసుపత్రికి తరలించారు.


అనంతరం వారు కాల్పుల్లో క్రూక్ మృతి చెందాడు. అయితే ఈ ఘటనసై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే క్రూక్స్ కు సంబంధించిన ఓ విషయాన్ని ఎఫ్‌బీఐ అధికారులు వెల్లడించారు. ట్రంప్‌పై హత్యాయత్నానికి ముందు సోషల్ మీడియాలో ప్లాట్ ఫామ్‌లో  కాల్పులు జరపనున్నట్లు సంకేతం ఇచ్చినట్లు వెల్లడించారు. జులై 13 నాకు చాలా ముఖ్యమైంది. ఆ రోజు ఏం జరుగుతుందో చూడండి అంటూ క్రూక్స్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడని తెలిపారు. అధికారులు అతడు షూట్ చేయడానికి వాడిన గన్ టెక్నాలజీ, వాడిన మొబైల్, లాప్ టాప్‌‌లను పరిశీలిస్తున్నారు.

కాల్పులకు ముందు రోజు ప్రాక్టీస్..
బట్లర్ నగరంలో ట్రంప్ ఎన్నికల ప్రచారం సభ జరగడానికి ఒక రోజు ముందు తాము థామస్ క్రూక్స్ స్పోర్ట్స్‌మెన్ క్లబ్ రైఫీల్ రేంజ్‌లోనే ముమ్మరంగా ప్రాక్టీస్ చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. ట్రంప్‌పై కాల్పులు జరపడానికి కొన్ని గంటల ముందే నగరంలోని ఓ దుకాణం నుంచి తుపాకీ కోసం 50 రౌండ్ల 5. 56mm బుల్లెట్లను అతడు కొనుగోలు చేశాడు. అనంతరం ట్రంప్ సభ జరిగే ప్రదేశానికి కార్ లో ఒంటరిగా బయలుదేరి వెళ్లాడు. సభ స్థానానికి 1760 అడుగుల దూరంలోని ఓ గ్యాస్ స్టేషన్లో కారును పార్క్ చేశాడు. తుపాకీ చేతిలో పట్టుకుని గ్యాస్ స్టేషన్ నుంచి దాదాపు అరగంట పాటు నడుస్తూ వచ్చి సభా సమీపంలోని భవనం పైకి ఎక్కాడు.
యూట్యూబ్ ఛానల్ లోగోతో టీ షర్ట్..
ట్రంప్‌పై కాల్పులు జరపడానికి క్రూక్స్ కామో షార్ట్, బ్లాక్ బెల్ట్, ఆయుధాల గురించి వివరించే ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌ లోగోతో ఉన్న బూడిద రంగు టీ షర్ట్ ధరించి ఉన్నాడు. థామస్ క్రూక్స్‌ను పరిసర ప్రాంత ప్రజలు గుర్తించి పోలీసులు, అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు సమాచారం అందించారు. వారంతా అక్కడికి చేరుకునే థామస్ క్రూక్స్ రెండు రౌండ్ల ఫైరింగ్ చేశాడు. వాటిలోనే ఒక బుల్లెట్ ట్రంప్ కుడిచేవి ఎగువ భాగంలో తాకింది. లక్కీగా ప్రసంగం చేస్తూ ట్రంప్ తల తిప్పడం వల్ల ఒక బుల్లెట్ తాకకుండానే వెళ్లిపోయింది. సభకు వచ్చిన ఓ అగ్నిమాపక విభాగం ఉద్యోగికి బుల్లెట్ తగిలి మరణించాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.


Also Read: మిస్టరీగానే ట్రంప్‌పై హత్యాయత్నం.. మాథ్యూ క్రూక్స్‌ విచారణలో కనిపించని పురోగతి!

మరోవైపు కాల్పులు జరిపిన 15 సెకన్లలోపే అతడిని చుట్టూ అమెరికా సర్వీసెస్ ఏజెంట్స్ కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఎఫ్‌బీఐ దర్యాప్తులో మరో ఆసక్తికర విషయం కూడా వెల్లడైంది. అదేంటంటే జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు క్రూక్స్ పెన్సిల్వేనియా రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీలో సభ్యుడిగా చేరారు. ఆ సందర్భంగా పార్టీకి దాదాపు రూ. 1200 విరాళం కూడా ఇచ్చారు. ఎందుకు జరిపాడు క్రూక్స్ కాల్పులు జరిపాడన్నది మిస్టరీగా మారింది.

 

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×