EPAPER

Hyderabad:కేటీఆర్ ఆగ్రహానికి గురైన ట్రాఫిక్ డీజీపీ..ఇంతకీ ఏం చేశారు?

Hyderabad:కేటీఆర్ ఆగ్రహానికి గురైన ట్రాఫిక్ డీజీపీ..ఇంతకీ ఏం చేశారు?

Ex Minister KTR fires on Traffic police about their behaviour
తెలంగాణ ట్రాఫిక్ డీజీపీపై మాజీ మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఆయన తీరుపై ఎక్స్ వేదికగా దుమ్మెత్తిపోశారు. ఇదేనా పోలీసుల తీరు? భాగ్యనగరానికే బ్యాడ్ రిమార్క్ గా తయారయ్యేలా ఉంది మీ తీరు..పౌరుల పట్ల పోలీసుల ప్రవర్తనపై కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఇదంతా దేనికని అనుకుంటున్నారా? ఇంతకీ కేటీఆర్ ఆగ్రహానికి కారణం ఏమిటి? వివరాలలోకి వెళితే హైదరాబాద్ గండి మైసమ్మ ప్రాంతం వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు వద్ద తన లారీని పార్క్ చేశాడు ఓ డ్రైవర్. ఇంతలో ఆ దిశగా డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు సదరు ఆ డ్రైవర్ ను ఇష్టం వచ్చినట్లుగా లాఠీలతో బాదారు. దారుణమైన పదాలతో దుర్భాషలాడారు.


వైరల్ గా మారిన వీడియో

ఇదంతా క్షణాలలో వైరల్ గా మారింది. ఎవరో అజ్ణాత వ్యక్తి దీనిని వీడియో గా చిత్రీకరించి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడంతో వీడియో పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. సమాజానికి మెసేజ్ ఇవ్వాల్సిన పోలీసు శాఖ మాట్లాడే భాష ఇదేనా? డీజీపీ గారూ మీ పోలీసులకు మీరు ఇచ్చే శిక్షణ ఇదేనా? అంటూ కామెంట్స్ చేశారు. తాను కేవలం ఈ ఒక్క వీడియో చూసి మాట్లాడటం లేదని గతంలోనూ చాలా సందర్భాలలో తెలంగాణ పోలీసులు మాట్లాడే భాష అభ్యంతరకరంగా ఉందని అన్నారు. మా ప్రభుత్వ హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను తీసుకొచ్చి..పోలీసులు ఎంత సన్నిహితంగా మెలగాలో నేర్పించామన్నారు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు మాట్లాడే భాష చూసి సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకుంటోందని అన్నారు.


సత్ప్రవర్తనపై శిక్షణ

ఇప్పటికైనా తెలంగాణ డీజీపీ ఇలాంటి పోలీసుల ప్రవర్తనపై శిక్షణ ఇస్తే బాగుంటుందని సూచించారు. వాళ్లకు సెన్సెటైజేషన్ క్లాసెస్ తీసుకుని పౌరులతో ఎలా ప్రవర్తించాలో శిక్షణ ఇవ్వాలని కోరారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా స్పందించాయి. నిజమే తెలంగాణ పోలీసుల తీరు చాలా అభ్యంతరకరంగా ఉందన్నారు. తెలంగాణను రూల్ చేసే రేవంత్ రెడ్డి మాట్లాడే భాషనే పోలీసులు కూడా మాట్లాడుతున్నారని అన్నారు. యథా రాజా తథా ప్రజ అని విమర్శలు చేశారు. అయినా చెట్టు ఒకటి అయితే విత్తు మరొకటి అవుతుందా? సాక్షాత్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే భాషనే వీళ్లు కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోందని అన్నారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడ?

గండిమైసమ్మ ప్రాంతంలో ఒక సామాన్య డ్రైవర్ పై పోలీసుల చర్యను బీఆర్ఎస్ శ్రేణులు ఖండించాయి. తప్పు చేసిన వ్యక్తికి జరిమానా విధించడమూ లేక వేరే రకమైన పనిష్‌మెంట్ ఇవ్వాలన్నారు. ఇలా పబ్లిక్ చూస్తుండగానే అతనిపై లాఠీ దెబ్బలు కొట్టి, ఇష్టారీతిలో దుర్భాషలాడటం ఏమీ బాగోలేదని విమర్శించారు. ఒక వేళ అతను ఎదురుతిరిగితే అతనిపై కేసు వేయాలని అంతేకానీ పోలీసులంటే భయపడేలా ప్రవర్తించకూడదని అన్నారు. ఇప్పటిదాకా ఫ్రెండ్లీ పోలీసులు అనుకునే వాళ్లంతా ఇకపై బూతుల పోలీసింగ్ వ్యవస్థగా చెప్పుకుంటారని..సీఎంకే చెడ్డపేరు వస్తుందని గ్రహించాలన్నారు.

Tags

Related News

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

Big Stories

×