EPAPER

Entertainent:వెయ్యి కోట్లు మాకెందుకు రావు అంటున్న కోలీవుడ్, మాలీవుడ్

Entertainent:వెయ్యి కోట్లు మాకెందుకు రావు అంటున్న కోలీవుడ్, మాలీవుడ్

Kollywood, malluwood not joined still 1000 crores club
నిన్న మొన్నటిదాకా వంద కోట్ల క్లబ్ అనేది ఎంతో ఘనం. అలాంటిది బాహుబలి తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో నిర్మించే సినిమాలు వెయ్యి కోట్ల వసూళ్ల లక్ష్యంతో బరిలో దిగుతున్నాయి. మొన్నటి దాకా బాహుబలి, నాన్ బాహుబలి లెక్కలు వేసుకున్న నిర్మాతలు కల్కి సినిమా కలెక్షన్ల తర్వాత ఇప్పుడు వెయ్యి కోట్లు తమ సినిమాకి రావాలంటే ఏం చెయ్యాలి అని భావిస్తున్నారు. అందుకు సమర్ధుడైన దర్శకుడు, అద్భుతమైన కంటెంట్ ఉంటేనే ఇది సాధ్యం అని నమ్ముతున్నారు. దీనికి తోడు భారీ బడ్జెట్ తోడైతే ఇక ఆ సినిమా కలెక్షన్ల రేంజ్ ఎక్కడికో వెళిపోతుందని నిర్మాతలు భావిస్తున్నారు.


బాహుబలి రేంజ్ అందుకోవడం కష్టమే

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు వేల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. దీనితో ఈ సినిమా రేంజ్ ను ఇప్పట్లో ఏ ఒక్కరికీ సాధ్యం కాదని డిసైడ్ అయిపోయింది సినిమా పరిశ్రమ. గత ఏడాది షారుక్ ఖాన్ రెండు సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాయి. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రభాస్ మూవీ కల్కి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరినా ఇంకా కలెక్షన్ల జోరు తగ్గలేదు. చాలా చోట్ల రిపీట్ ఆడియన్స్ కూడా వస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా 1200 కోట్లు వసూల్లు చేసినా ఆశ్చర్యపోనక్కర్తేదంటున్నారు సినీ అభిమానులు. షారుఖ్ ఖాన్ రికార్డులు కూడా బద్దలైపోయాయి.ఇక కల్కి మూవీకి ఎదురే లేదని సినీ వర్గాలు భావిస్తున్నాయి.


ఏదీ? నాటి వైభవం?

ఒకప్పుడు తమిళ, మలయాళ సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఉండేది. ఇప్పుడు వెయ్యి కోట్ల రేంజ్ కలెక్షన్లు అందుకోవడం ఈ హీరోలకు కష్టంగా మారింది. రజనీకాంత్, విజయ్ సినిమాలు కూడా నాలుగయిదొందల కోట్ల వసూళ్లకే పరిమితం అయ్యాయి. బాలీవుడ్, టాలీవుడ్, శాండల్ వుడ్ కూడా వెయ్యి కోట్ల రేంజ్ సినిమాల స్థాయికి చేరుకున్నాయి. కేజీఎఫ్ మూవీ వెయ్యి కోట్ల రేంజ్ కలెక్షన్లు వసూల్లు సాధించడంతో ఒక్కసారిగా శాండల్ వుడ్ కూడా భారీ కలెక్షన్లు సాధించే దిశగా సాగుతోంది. చిన్న బడ్జెట్ తో వచ్చిన కాంతారా కూడా రూ.400 కోట్లు కొల్లగొట్టింది.కోలీవుడ్, మలయాళ చిత్ర పరిశ్రమలో ఆ స్థాయి కంటెంట్ ఇవ్వలేకపోతున్నామా అని ఆలోచన చేస్తున్నారు నిర్మాతలు. కేవలం కంటెంట్ అంతర్జాతీయ స్థాయిలో లేకపోవడమే అని తెలుస్తోంది. ఎక్కువగా కోలీవుడ్, మలయాళ సినిమాలు స్థానిక నేపథ్యంలో కేవలం అక్కడి హీరో అభిమానులు మెచ్చే విధంగా తీస్తున్నారు. బాలీవుడ్ కు వచ్చేసరికి కలెక్షన్లు రాబట్టలేక చేతులెత్తేస్తున్నాయి.

కంటెంట్ ఉంటే చాలు కటౌట్ అవసరం లేదు

పాన్ వరల్డ్ స్థాయిలో నటించే సత్తా ఉన్న హీరోలు ఉన్నా కూడా ఎందుకో నిర్మాతలు ఆ దిశగా ప్రయత్నించడం లేదు. ఒకప్పుడు టాలీవుడ్, శాండల్ వుడ్ సినిమాలు కనీసం పొరుగు రాష్ట్రాలలో కూడా ప్రదర్శితం కానంతగా కంటెంట్ ఉండేది. దాంతో కేవలం అక్కడికే పరిమితం అవుతూ వచ్చారు. రజనీకాంత్, కమల్ హాసన్, ముమ్ముట్టి, మోహన్ లాల్ వంటి కథానాయకులకు అప్పట్లో దేశ వ్యాప్తంగా అభిమానులు ఉండేవారు. దాంతో డబ్ చేసి వదిలినా మంచి కలెక్షన్లు రాబట్టేవి. ఇప్పుడు కేవలం హీరోలను చూసి సినిమాలకు వచ్చే రోజులు పోయాయి. అప్పటిదాకా ఎవరికీ తెలియని కాంతారా హీరో, తెలుగులో హనుమాన్ మూవీతో తేజ సజ్జా, కార్తికేయ 2 మూవీతో నిఖిల్ కూడా పాన్ ఇండియా స్థాయిలో హీరోలయ్యారంటే దానికి కారణం వారు నటించిన సినిమాలలో ఉండే కంటెంట్. హీరోయిజం అనేది కొంతవరకూ కలెక్షన్ల వరకే పరిమితం. కంటెంట్ ఉంటే చాలు కటౌట్ అవసరం లేదని ఇప్పటి సినిమాలు చెబుతున్నాయి. సో ఆ దిశగా ప్రయత్నిస్తే వెయ్యి కోట్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Tags

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×