EPAPER

Donald Trump Shooter: మిస్టరీగానే ట్రంప్‌పై హత్యాయత్నం.. మాథ్యూ క్రూక్స్‌ విచారణలో కనిపించని పురోగతి!

Donald Trump Shooter: మిస్టరీగానే ట్రంప్‌పై హత్యాయత్నం.. మాథ్యూ క్రూక్స్‌ విచారణలో కనిపించని పురోగతి!

Donald Trump Rally Shooter: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాహత్యం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్యాహత్నం మిస్టరీగానే కొనసాగుతోంది. సాధారణంగా అమెరికా మాజీ అధ్యక్షులకు జీవితాంతం అమెరికా సీక్రెట్ సర్వీస్ భద్రత కల్పిస్తుంది. సుమారు 75 మంది సిబ్బంది నిత్యం రక్షణగా ఉంటారు. కానీ ట్రంప్‌పై అసాధారణ రీతిలో హత్యాయత్నం జరగడంతో సీక్రెట్ సర్వీస్‌పై సైతం విమర్శలు వచ్చాయి. మరోవైపు, హత్యాయత్నం చేసిన థామస్ మాథ్యూ క్రూక్స్‌పై మూడు రోజులుగా విచారణ కొనసాగుతున్నప్పటికీ పురోగతి కనిపించడం లేదు.


ఇందులో భాగంగా ఎఫ్‌బీఐ బృందం 100మందికి పైగా విచారణలో ప్రశ్నించింది. ప్రధానంగా థామస్ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులను ప్రశ్నించినా సమాచారం దొరకడం లేదు. సోషల్ మీడియాతోపాటు థామస్‌కు సంబంధించిన ప్రతీ అకౌంట్లను పరిశీలించినా ఎందుకు ట్రంప్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించాడనే వివరాలు దొరకలేదు. ప్రస్తుతం థామస్ ఇళ్లు పోలీసుల అదుపులోనే ఉంది.

ఇదిలా ఉండగా, విచారణలో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజూ క్రూక్స్ రిపబ్లికన్ పార్టీలో సభ్యుడిగా చేరాడు. దీంతో పాటు పార్టీకి విరాళం కూడా ఇచ్చాడు. కానీ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిపైనే కాల్పులు ఎందుకు చేశాడనే వివరాలు తెలియరాలేదు. సరిగ్గా, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాహత్యం జరిగిన ఘటనకు ముందు రోజే థామస్ క్రూక్స్..స్పోర్ట్స్ మెన్ క్లబ్ రైఫిల్ రేంజ్ లో ప్రాక్టీస్ చేసినట్లు తెలిసింది.


అంతకుముందు క్రూక్స్ రైఫిల్ బృందంలో సభ్యత్వం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. చివరికి కుటుంబ సభ్యుల సహకారంతో ‘క్లైర్టన్ స్పోర్ట్స్ మెన్ క్లబ్‌’లో సభ్యుడిగా చేరాడు. ఈ క్లబ్..ట్రంప్ పై దాడి జరిగిన ప్రాంతానికి 17కి.మీ దూరంలో ఉండడం విశేషం. అదే విధంగా ఈ క్లబ్‌లోథామస్ క్రూక్స్ గరిష్టంగా 170 మీటర్ల దూరం వరకు గురిపెట్టి ఫైర్ చేసేందుకు కసరత్తు చేసువారని, ట్రంపఐ పై కాల్పులు కూడా కేవలం 130 మీటర్ల దూరం నుంచే జరిగాయని గుర్తించారు.

అయితే, ట్రంప్ పై కాల్పులు జరిపేందుకు 50 రౌండ్ల 5.56ఎంఎం బుల్లెట్లను కొనుగోలు చేశాడని, ట్రంప్ సభ ప్రాంగణానికి కారులోనే బయలుదేరాడు. కేవలం సభాస్థలికి 1760 అడుగుల దూరంలోనే కారును పార్కింగ్ చేసి తుపాకీతో అక్కడే భవనంపైకి ఎక్కాడు. థామస్ ఓ యూట్యూబ్ ఛానల్ లోగో ఉన్న టీషర్ట్ ధరించినట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలోనే క్రూక్స్ కాల్పులు జరిపాడు. వెంటనే అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో థామస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక, ట్రంప్ భద్రత విసయంలో సీక్రెట్ సర్వీస్ వ్యవహారంపై హోలాండ్ సెక్యూరిటీ ఐజీ దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×