EPAPER

What is Nelson Mandela International Day: జైలు గోడల్లో యువరాజుగా మారిన పేదవాడు.. నల్ల సూరీడి అద్భుత కథనం

What is Nelson Mandela International Day: జైలు గోడల్లో యువరాజుగా మారిన పేదవాడు.. నల్ల సూరీడి అద్భుత కథనం

Nelson Mandela International day: రాళ్లు చాలా ఉంటాయి.. కానీ, కొన్ని మాత్రమే రత్నాలుగా మారుతాయి. అలాంటి రత్నమే నెల్సన్ మండేలా. కటిక చీకటిలోంచి వచ్చి సమాజం నలుదిక్కులా కాంతిని పంచాడు. అణిచివేతను ఎదురించేందుకు తాను విప్లవంగా మారాడు. ఉద్యమాన్ని నడిపించి వివక్ష లేకుండా చేశాడు. అందుకే ఐక్యరాజ్య సమితి అతడి పుట్టిన రోజును అంతర్జాతీయ దినోత్సవమని అధికారికంగా ప్రకటించింది. సో.. ఇంతటి ఆదర్శవంతుడి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..


Nelson Mandela

నెల్సన్ మండేలా.. ఈ పేరు వింటేనే మానవ సమాజమే కాదు.. మట్టి కూడా తెగ మురిసిపోతుంది. ఆకాశం కూడా ఆనందంతో విహరిస్తుంది. ఎందుకంటే వర్ణవివక్షకు ముగింపు పలికేందుకు, సమాజ హితం కోసం ఎనలేని కృషి చేసిన యోధుడు.. రాజకీయ నాయకుడు.. పరోపకారి.


Also Read: ఫ్రాన్స్ ప్రధాని గేబ్రియల్ అటల్ రాజీనామా ఆమోదించిన అధ్యక్షుడు మాక్రాన్.. ఆపధర్మ ప్రధానిగా కొనసాగింపు..

దక్షిణాఫ్రికాలోని ట్రాన్స్‌కీలో ఉన్న ఓ గ్రామం పేరు మెజ్వో. ఈ గ్రామంలోనే మండేలా పుట్టాడు. విషాదకరమేమంటే.. నెల్సన్ మండేలా తండ్రి అతనికి పన్నెండేళ్ల వయసులో మృతిచెందాడు. నిజానికి నెల్సన్‌ను రోలిహ్లాహ్లా అని పిలిచేవారు. అయితే, ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు పాఠశాలలో ఓ
ఉపాధ్యాయుడు అతనికి నెల్సన్ అని పేరు పెట్టాడు. అప్పటి నుంచి నెల్సన్ గా కొనసాగాడు. యూనివర్సిటీ ఆఫ్ ఫోర్ట్ హేర్ మరియు సౌత్ ఆఫ్రికా నేటివ్ కాలేజీలో చదువుకున్న నెల్సన్.. విట్వాటర్ రాండ్ విశ్వవిద్యాలయంలో కూడా లా పూర్తి చేశాడు.

Nelson Mandela
Nelson Mandela

అయితే, నెల్సన్ ఎదుగుతున్న సమయంలో దక్షిణాఫ్రికాలో భారీ జాతి వివక్ష ఉండేది. శ్వేతజాతీయులు ఆ దేశాన్ని పాలించేవారు. వారికి మంచి ఉద్యోగాలు, ఇండ్లు, మంచి పాఠశాలు, ఆరోగ్య సంరక్షణతో కూడిన విశేష జీవితం ఉండేది. కానీ, నల్లజాతీయులు తీవ్ర వివక్షతను ఎదుర్కొనేవారు. పేదరికంతో బాధపడేవారు. ఒకవేళ ఎవరికైనా ఉద్యోగాలు ఉన్నా కూడా వారికి తక్కువ జీతమే ఇచ్చేవారు. నల్లా జాతీయులకు ఎలాంటి సౌకర్యం.. ఎలాంటి హక్కులు ఉండేవికావు. అక్కడ జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు కూడా వారికి అనుమతి ఉండేదికాదు.. కేవలం చర్మ రంగు కారణంగా వారిపై వివక్ష చూపుతూ వచ్చేవారు. దీంతో ఈ నల్ల జాతీయులు తీవ్ర నిరాశ చెందేవారు. ఎవరైనా ఎదురించినా వారిని కఠినంగా శిక్షించేవారు. ఈ వివక్షను నెల్సన్ లోతుగా పరిశీలించాడు. ఈ వివక్ష లేకుండా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. శ్వేతజాతీయులు – నల్లజాతీయులకు సమాన హక్కుల కోసం పోరాడుతున్న రాజకీయ సమూహమైన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ లో 1944లో నెల్సన్ చేరాడు.

1948 సంవత్సరంలో దక్షిణఫ్రికా ప్రభుత్వం వర్ణవివక్ష అనే వ్యవస్థను ఆ దేశంలో ప్రవేశపెట్టింది. కొత్త చట్టాలు తీసుకువచ్చింది. ఆ చట్టాల ప్రకారం.. శ్వేతజాతీయులు, నల్లజాతీయులు ఒకే ప్రాంతంలో నివసించడానికి, ఒకే పాఠశాలలో చదువుకోవడానికి, రైలు లేదా బస్సులో కలిసి ప్రయాణించడానికి కూడా అనుమతించలేదు. దీంతో వివక్ష తీవ్రతరమయ్యింది. వీటిపై పోరాడేందుకు నెల్సన్ యువకులతో కూడిన లీగ్ ను ఏర్పాటు చేశాడు. పలు దేశాలలో పర్యటించాడు. వివక్షను చూపొద్దంటూ పోరాడాడు. దీంతో నెల్సన్ పై అక్కడి అధికారులకు కోపం వచ్చింది. అతడు చేస్తున్న పోరాటాన్ని దేశ వ్యతిరేక అంశంగా పరిగణించింది. వర్ణవివక్ష వ్యతిరేక సమూహాలను నిషేధించింది. కానీ, నెల్సన్ మరియు అతడి వెంట ఉండేవారిని ఆపలేకపోయారు. తన పోరాటాన్ని ముమ్మరం చేశాడు. దీంతో ఎలాగైనా నెల్సన్ ను కట్టడి చేయాలని భావించి..1962లో ఉత్తర ఆఫ్రికాలోని అల్జీరియా నుండి తిరుగు ప్రయాణం చేస్తున్న నెల్సన్ ను అరెస్ట్ చేశారు. 5 సంవత్సరాల పాటు జైలులోనే ఉంచారు.

ఆ తరువాత విడుదల చేశారంటే.. అదీ లేదు. నెల్సన్ తోపాటు మరో ఏడుగురిపై పలు అభియోగాలు మోపుతూ జీవిత ఖైదు విధించారు. అనంతరం అతడిని కేప్ టౌన్ జైలుకు తరలించారు. ఆ తరువాత పలు జైళ్లకు తరలిస్తూ వచ్చారు. జైలులో ఆయన.. దక్షిణాఫ్రికాలో ఈ వివక్షను ఎలా ఎదురించాలే అనే అంశంపైనే ఆలోచించేవాడు. ఏ రోజు కూడా తన కోసం ఆలోచించలేదు.. జనం కోసమే ఆలోచించాడు. ఎన్నిఇబ్బందులు ఎదురైనా తట్టుకున్నాడు. కాలక్రమేణా.. వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న నెల్సన్ మండేలా గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోయింది. వర్ణవివక్షను రూపుమాపాలంటూ దక్షిణాఫ్రికాపై చాలా దేశాలు ఒత్తిడి తెచ్చాయి. దీంతో ఆ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. సముద్రపు అలలా ఉప్పొంగుతూ వచ్చింది. కెరటాల్లా ఎగిసిపడింది. మండేలాను వెంటనే విడుదల చేయాలంటూ భారీగా డిమాండ్లు వచ్చాయి.

Nelson Mandela
Nelson Mandela

దీంతో 1990లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలాతో సమావేశమై అతడిని విడిపించాడు. 27 సంవత్సరాల ఆరు నెలలు నిర్బంధంలోనే ఉన్న నెల్సన్ జైలు నుంచి బయటకు వచ్చి.. 1991లో ఏఎన్‌సీకి అధ్యక్షుడయ్యాడు. వర్ణవివక్షను అంతం చేసేందుకు ఆ దేశాధ్యక్షుడితో కలిసి పనిచేశాడు. అందరికీ సమాన హక్కులను ప్రవేశపెట్టాడు. దీంతో మండేలా చేసిన కృషికి 1993లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆ తరువాత 1994లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అన్ని జాతుల వారు ఎలాంటి వివక్ష లేకుండా ఓటు వేశారు. బరిలో నిలిచిన ఏఎన్‌సీ పార్టీ భారీ విజయాన్ని సాధించింది. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా మొదటి నల్లజాతి అధ్యక్షుడయ్యాడు.

అధ్యక్షుడిగా మండేలా.. దక్షిణాఫ్రికాను సమానత్వం ఉన్న దేశంగా తీర్చి దిద్దేందుకు ఎనలేని కృషి చేశాడు. ఎలాంటి వివక్ష లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నాడు. నల్లజాతీయుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాడు. 1996లో కొత్త ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించి ఆమోదించాడు. అప్పటి నుంచి ఆ దేశంలో వివక్ష కనుమరుగయ్యింది. ఎలాంటి భేషజాలు లేకుండా ప్రజలు శాంతి మరియు సామరస్యంతో కలిసి జీవించడం ప్రారంభించారు.

Also Read: అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్? ప్రెసిడెంట్ బైడెన్ హింట్!

ఆ తరువాత మండేలా 1997లో ఏఎన్‌సీకి రాజీనామా చేశాడు. అధికారాన్ని థాబో ఎంబెకీ మండేలాకు అప్పగించాడు. నెల్సన్ క్రియాశీల రాజకీయాల నుంచి పదవీ విరమణ చేశాడు. ఆ తరువాత అంతర్జాతీయ న్యాయవాదిగా కొనసాగాడు. ఓ ఫౌండేషన్‌ను కూడా స్థాపించాడు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, సయోధ్య, సామాజిక న్యాయం కోసం న్యాయవాదిగా బలంగా వాదించాడు.

Nelson Mandela
Nelson Mandela

అయితే, దీర్ఘకాల శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న నెల్సన్ మండేలా 2013 డిసెంబర్ 5న 95 ఏళ్ల వయసులో కన్నుమూశారు. నెల్సన్ తన జీవిత కాలమంతా దేశం కోసం, సామాన్య జనం కోసం పనిచేశాడు. సామాజిక అంశాలు, మానవ హక్కులకోసం పారాడాడు. లింగ సమానత్వం, బలహీన వర్గాల హక్కులు, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఆయన సేవలను గుర్తించిన ఐక్యరాజ్య సమితి 2009 నవంబర్ లో.. జులై 18ని నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మానవులందరి హక్కుల కోసం పారాడాడు కాబట్టి మండేలాను ముద్దుగా మడిబా అని పిలుచుకుంటారు. ఎన్నో దేశాలు కూడా మండేలాకు పురస్కారాలు అందజేశాయి. భారతదేశం కూడా నెల్సన్‌ను భారతరత్నతో సత్కరించింది.

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×