EPAPER

Joe Biden: అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్? ప్రెసిడెంట్ బైడెన్ హింట్!

Joe Biden: అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్? ప్రెసిడెంట్ బైడెన్ హింట్!

Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ డెమోక్రాట్లలో ఆందోళనలు పెరుగుతున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై మొన్న జరిగిన తుపాకీ దాడితో ఆదరణ విపరీతంగా పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. మరో వైపు అధికార పార్టీ అభ్యర్థి జో బైడెన్ పై సొంత పార్టీలోనే ఆదరణ కరువవుతున్నది. ఇటీవలే అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన డిబేట్‌లో జో బైడెన్ తడబడటం డెమోక్రాట్లను కలవరపరుస్తున్నది.


వయసురీత్యా ఆయన అభ్యర్థిగా తప్పుకోవడం మేలని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య పోటీ విషయమై నిర్వహించిన సర్వేల్లో చాలా వరకు ట్రంప్ ముందంజలో ఉన్నారు. అదే బైడెన్‌కు బదులుగా కమలా హ్యారిస్‌ను డెమోక్రాట్ల అభ్యర్థిగా భావిస్తే.. ట్రంప్‌నకు గట్టి పోటీ ఆమె ఇస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఈ తరుణంలో జో బైడెన్ ఇచ్చిన ఒక హింట్ ఆసక్తికరంగా మారింది.

అమెరికా అధ్యక్షరాలయ్యే సామర్థ్యం కమలా హ్యారిస్‌కు ఉన్నదని జో బైడెన్ నేషనల్ అసోసియేష్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ వార్షిక సదస్సులో అన్నారు. బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా తప్పుకోవాలనే డిమాండ్లు సొంత పార్టీ నుంచి పెరుగుతున్న తరుణంలో బైడెన్ ఈ మాట అన్నారు. కమలా హ్యారిస్ గొప్ప ఉపాధ్యక్షురాలే కాదు, ఆమె అమెరికా అధ్యక్ష పదవికీ సమర్థురాలని బైడెన్ పేర్కొన్నారు. అయితే, అదే సందర్భంలో తాను అధ్యక్ష అభ్యర్థిగా వెనుదిరగబోననే నిర్ణయాన్ని కూడా రూఢీగా చెప్పారు. తాను రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలి వంద రోజుల్లో చేపట్టే ప్రణాళికలను ఇప్పటికే రూపొందించుకున్నట్టు బైడెన్ తెలిపారు.


బైడెన్‌ అభ్యర్థిగా వద్దన్న డిమాండ్ల నేపథ్యంలో ఆయన స్థానంలో సరైన అభ్యర్థిగా కమలా హ్యారిస్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నది. ఒక వేళ ఆమె డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి గెలిస్తే.. అమెరికా అధ్యక్ష పదవిని అలంకరించిన కలర్ వుమన్‌గా నిలుస్తారు. డొనాల్డ్ ట్రంప్‌ను ఎదుర్కొనే నాయకురాలిగా ఆమెనే కనిపిస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ రన్నింగ్ మేట్ జేడీ వేన్స్‌తో సంవాదానికి సంసిద్ధతను కమలా హ్యారిస్ ప్రకటించారు.

Also Read: తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలు.. ఐఎండీ సూచనలివే

డెమోక్రటిక్ పార్టీ భవిష్యత్తు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిసేనని ఇది వరకే వైట్ హౌజ్ ప్రకటించింది. సీఎన్ఎన్ నిర్వహించిన పోల్‌లో ట్రంప్‌నకు 47 శాతం మద్దతు రాగా.. కమలా హ్యారిస్‌కు 45 శాతం మద్దతు లభించింది. కానీ, జోసెఫ్ బైడెన్ మాత్రం అధ్యక్ష అభ్యర్థిగా తప్పుకునే సంకేతాలు ఏమీ ఇవ్వలేదు. నవంబర్ 5వ తేదీన జరగనున్న అధ్యక్ష ఎన్నికలు అమెరికాకు కొత్త ప్రెసిడెంట్‌ను నిర్దేశించనున్నాయి.

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×