EPAPER

Puja Khedkar: ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఇంటిపైకి బుల్డోజర్

Puja Khedkar: ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఇంటిపైకి బుల్డోజర్

Puja Khedkar: మహారాష్ట్రకు చెందిన ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ గురించి రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తాజాగా ఆమె కుటుంబం నివాసానికి ఆసుకుని ఉన్న అక్రమ నిర్మాణాలను పీఎంసీ కూల్చి వేసింది. అక్రమ నిర్మాణానికి సంబంధించి ముందస్తు నోటీసులు ఇచ్చినా ఆమె కుటుంబం పట్టించుకోకపోవడంతోనే కూల్చివేసినట్లు తెలుస్తోంది.


అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ఆరోపణలతో మహారాష్ట్రకు చెందిన ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. పూణెలో ఆమె నివాసం ఉంటున్న అక్రమ నిర్మాణాలపై పుణె మున్సిపల్ కార్పొరేషన్ చర్చలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే వారి ఇంటికి ఆనుకుని ఉన్న నిర్మాణాలను బుల్డోజర్‌తో కూల్చివేసింది. అయితే దీనికి సంబంధించి పీఎంసీ ముందుగానే నోటీసలు ఇచ్చినా ఆ కుటుంబం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అధికారులు వెల్లడించారు.

పుణెలో బ్యూరోకాట్‌గా పదవిని దుర్వినియోగం చేయడం, ఇతర ఆరోపణలతో పూజా ఖేడ్కర్ వర్తల్లో నిలిచారు. అంతేకాకుండా ఆమె తన ప్రయివేట్ ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను కూడా అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపనలు ఉన్నాయి. దీంతో ఆమెను మహారాష్ట్ర ప్రభుత్వం నాసిన్‌కు బదిలీ చేసింది. వాస్తవానికి ప్రొబేషన్‌లో ఉండే జూనియర్ అధికారులకు ఈ సౌకర్యాలు ఉండవు.


ఇక ఈ వివాదం తర్వాత నుంచి ఆమెకు సంబంధించి రోజుకో విషయం బయటకు వస్తోంది. తన దివ్యాంగ ధృవీకరణకు చూపిన పత్రాల్లో కూడా అవకతవకలు ఉన్నట్లు తెలుస్తోంది. సదరు ఇంజనీరింగ్ కంపెనీ స్థానిక పురపాలక సంఘానికి రూ. 2.7 లక్షల పన్ను బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పుణె కలెక్ట్ సుహాస్ దివాసే తనను వేధిస్తున్నారని ఖేడ్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాసిమ్‌లోని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే కంటి లోపాలు మానసిక శారీరక వైకల్యం తప్పుడు పత్రాలు సమర్పించడం, పత్రాల దుర్వినియోగం, ఎంబీబీఎస్‌లో చేరేందుకు తప్పుడు పత్రాలు సృష్టించడం ఇలా పలు వివాదాలకు కేంద్ర బిందువైన ట్రైయినీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ వ్యవహారంపై ఎట్టకేలకు కేంద్రం కూడా చర్యలకు ఉపక్రమించింది. తక్షణం ఆమె శిక్షణ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు పూజాకు మహారాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నితిన్ గాడ్ఫ్రే లేఖ కూడా రాశారు.

Also Read: పారిశ్రామికవేత్త కోసం నిరసనకారులపై పోలీసుల కాల్పులు: మద్రాస్ హైకోర్టు

మహారాష్ట్రలో సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఉన్న మిమ్మల్ని తక్షణం జిల్లా శిక్షణ నుంచి పక్కన పెడుతున్నాం. మీరు మల్లీ ముస్సోరి ఐఏఎస్ అకాడమీలో రిపోర్టు చేయండి. అకాడమీ తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండండి. ఆమెకు పంపిన లేఖలో ఇలా నితిన్ పేర్కొన్నారు. ట్రైయినీ అయినా సరే జిల్లా కలెక్టర్ స్థాయిలో తనకు అధికారిక సదుపాయాలు, వసతులు కల్పించాలని పూజా డిమాండ్ చేయడం వార్తల్లోకి ఎక్కింది. హోదా డిమాండ్ చేయడంతో పూణేలో అసిస్టెంట్ కలెక్టర్ హోదా నుంచి ఆమె నివాస జిల్లాలో సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఆమె ఆలిండియా 821 వ ర్యాంకు సాధించింది. మీడియాలో కూడా ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది. రెండు వారాల్లోగా నివేదిక అందించాలని ఆదేశించింది.

Tags

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×