EPAPER

Best Bikes Under Rs 1 Lakh: మార్కెట్‌ను ఊపేస్తున్న బడ్జెట్ బైక్స్.. వీటి మైలేజ్ అదుర్స్..!

Best Bikes Under Rs 1 Lakh: మార్కెట్‌ను ఊపేస్తున్న బడ్జెట్ బైక్స్.. వీటి మైలేజ్ అదుర్స్..!

Best Bikes Under Rs 1 Lakh: బడ్జెట్ సెగ్మెంట్‌లో లభించే బైకులకు దేశంలో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరకు అధిక మైలేజీని ఇచ్చే బైక్‌లను కొనడానికి ఎక్కువగా ఇష్టపడతారు. డైలీ అవసరాలకు ఇప్పుడు బైకులు మీద ఆధారపడటం సాధారణం అయిపోయింది. ఈ క్రమంలో జీవిత బండిని లాగడానికి ఈ బండులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో హీరో, హోండా, బజాజ్  బైక్‌లు అత్యంత ప్రజాదరణ పొందాయి. కాబట్టి మీరు కూడా బడ్జెట్ ప్రైస్‌లో అంటే రూ.1లక్ష లోపు మంచి బైక్ కోసం చూస్తున్నట్లయితే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


Honda Shine 100
హోండా షైన్ 100 బైక్ ధర రూ. 66,600 (ఎక్స్-షోరూమ్). దీని 98.98 cc సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్ 7.38 PS పవర్, 8.05 Nm టార్క్ రిలీజ్ చేస్తుంది. ఇందులో 4-స్పీడ్ గేర్ బాక్స్ ఆప్షన్ ఉంది. కొత్త షైన్ 68 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. బ్లాక్ విత్ రెడ్, బ్లాక్ విత్ గోల్డ్, బ్లాక్ విత్ బ్లూ వంటి 5 కలర్ ఆప్షన్లలో ఈ బైక్ అందుబాటులో ఉంది. అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ స్టార్టర్ వంటి ఫీచర్లు ఈ బైక్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో డ్రమ్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది.

Also Read: Hatchback Sales: ఈ కార్లకు భారీగా తగ్గిన డిమాండ్.. కుప్పకూలిన సేల్స్!


Bajaj Freedom 125 CNG
ఇటీవల విడుదల చేసిన బజాజ్ ఫ్రీడమ్ 125 మధ్యతరగతి ప్రజలకు బెస్ట్ ఆప్షన్. ఇది CNG, పెట్రోల్‌తో నడుస్తుంది. ఈ బైక్ ధర రూ. 95,000 నుండి రూ. 1.10 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. బజాజ్ ఫ్రీడమ్ 125 డ్రమ్, డ్రమ్ ఎల్ఈడీ, డిస్క్ ఎల్ఈడీ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఇందులో 125 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది. ఇది CNG మోడ్‌లో కిలోకు 130 కిమీ మైలేజీని ఇస్తుంది. పెట్రోల్తో దీని మైలేజ్ 67Kmpl. CNG+ పెట్రోల్‌తో కలిపి దీని మైలేజ్ 330 కి.మీ. ఈ బైక్ 7 కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.

Also Read: Best Selling Car: ఏంది మామ ఈ క్రేజ్.. ఈ కారును ఏంటి ఇలా కొంటున్నారు.. అసలు కథ ఇదేనేమో!

Hero Splendor
ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో ఇది ఒకటి. మధ్యతరగతి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ బైక్‌ను రూపొందించారు. దీని ధర రూ. 76,356 నుండి రూ. 77,826 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇందులో అమర్చిన 97.2సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 8.02 PS పవర్, 8.05 Nm టార్క్ రిలీజ్ చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్ బాక్స్‌తో లింకై ఉంటుంది. ఈ బడ్జెట్ బైక్ లీటర్‌కు 80 kmpl వరకు మైలేజీని ఇస్తుంది. ఈ బైక్‌‌లో 9.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది.

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×