EPAPER

Store Veggies Fresh: కూరగాయలు త్వరగా పాడవుతున్నాయా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Store Veggies Fresh: కూరగాయలు త్వరగా పాడవుతున్నాయా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Store Veggies Fresh: బిజీ లైఫ్ స్టైల్ కారణంగా మార్కెట్ నుంచి ప్రతి రోజు తాజా పండ్లు, కూరగాయలను కొనడం అంత తేలికైన పనికాదు. అందుకే చాలా మంది పండ్లు, కూరగాయలను ఒకేసారి కొనుగోలు చేసి వాటిని రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు పని ఒత్తిడి కారణంగా బయటకు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఒకే సారి ఎక్కువగా కూరగాయలను కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ అవి కొన్ని రోజుల తర్వాత పాడవుతూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఆకు కూరలు త్వరగా పాడవుతుంటాయి.


తరచుగా కూరగాయలు, పండ్లు కుళ్లిపోవడంతో చెత్త బుట్టలో పడేస్తూ ఉంటారు. లేదంటే ఇరుగు పొరుగు వారికి ఇస్తుంటారు. ఇలా పంచడం వల్ల ఎటువంటి హాని లేనప్పటికీ ప్రతిసారీ అలా చేయడం వల్ల మీ సమయం,కృషి మాత్రమే కాకుండా డబ్బు కూడా వృథా అవుతుంది. కాబట్టి కొంత తెలివైన ఆలోచన అవసరం. మీకు అవసరమైన దానికంటే ఎక్కువ కూరగాయలు కొనడం మాత్రమే వాటిని తాజాగా ఉంటుకోవడం కూడా ముఖ్యం అందుకే కూరగాయాలు, పండ్లు వంటి వాటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునేందుకు బెస్ట్ టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

కూరగాయలు కొనగానే చేయాల్సినవి:


పండ్లు, కూరగాయలను కొన్నప్పుడు ముందుగా వాటిని ఇంటికి తీసుకువచ్చిన వెంటనే బాగా కడగాలి. ఆ తర్వాత కిచెన్ టవల్ లేదా శుభ్రమైన గుడ్డతో తూడిచి ఆరబెట్టడం మంచిది. ఇలా చేయడం వల్ల వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు.
ఆకు కూరలు :
ఆకు కూరలను ఎక్కువ కాలం తాజాగా ఉంచడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఆకు కూరలను న్యూస్ పేపర్‌లో చుట్టి ఉంచండి. వాస్తవానికి కూరగాయల యొక్క అదనపు తేమను న్యూస్ పేపర్ గ్రహిస్తుంది. అంతేకాకుండా తొందరగా చెడిపోకుండా నిరోధిస్తుంది. దీంతో ఎక్కువ కాలం ఆకు కూరలను మనం తాజాగా ఉంచుకోవచ్చు.
యాపిల్స్:
ఎక్కువ కాలం యాపిల్స్ నిల్వ చేయాలనుకుంటే దానిని మేష్ బ్యాగ్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టండి. మేష్ బ్యాగ్‌ లేకపోతే దానిని మీరు చిన్న రంధ్రాలు చేసి ప్లాస్టిక్ సంచుల్లో కూడా నిల్వ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు యాపిల్స్ నిల్వ ఉంటాయి.

Also Read: జుట్టు పెరగడానికి బెస్ట్ హోం మేడ్ ఆయిల్స్

అరటిపండ్లు:
ఫ్రిజ్‌లో ఉంచితే అరటిపండ్లు త్వరగా పాడవుతాయి. వీటిని గాలి చొరబడని ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో ఉంచితే అవి పాడైపోకుండా కాపాడుకోవచ్చు. ఉల్లిపాయలు, వెల్లుల్లిని బహిరంగంగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో నిల్వ చేయడం మంచిది. పొరపాటున కూడా ఎండగా ఉండే ప్రదేశంలో వీటిని ఉంచకూడదు లేకుంటే అవి త్వరగా పాడైపోతాయి

Tags

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×