EPAPER

Farm Loans: రేపు సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ: సీఎం రేవంత్ రెడ్డి

Farm Loans: రేపు సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామని తాము చెప్పామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయితే.. చెప్పిన గడువు కంటే ముందే రుణమాఫీ ప్రక్రియను అమలు చేస్తున్నామని చెప్పారు. రుణమాఫీ చేస్తామని చెప్తే ఇది అసాధ్యం అని చాలా మంది అన్నారని, ఆర్థిక నిపుణులు కూడా ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని చెప్పారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. చిత్తశుద్ధి ఉంటే అన్ని సాధ్యమేనని తాము నిరూపించామని తెలిపారు. తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ సాహసోపేత హామీ ఇచ్చి నెరవేర్చారని, ఇప్పుడు కూడా అలాగే ఈ సాహసోపేత హామీని నెరవేర్చే బాధ్యత తమపై ఉన్నదని స్పష్టం చేశారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే నెరవేరుస్తుందని నిరూపించే బాధ్యత కాంగ్రెస్ కుటుంబమందరిపై ఉన్నదని రేవంత్ రెడ్డి తెలిపారు.


రేపు సాయంత్రం 4 గంటల వరకు రూ. 1 లక్ష లోపు పంట రుణాలు మాఫీ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రూ. 7 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతాయని చెప్పారు. ఈ నెలాఖరులోపు లక్షన్నర రుణాలను మాఫీ చేసి వచ్చే నెలలో రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేసి.. రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదని, రైతు ఆత్మగౌరవాన్ని నిలపడానికి రుణమాఫీ నిర్ణయం తీసుకున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏకకాలంలో తాము రుణమాఫీ చేస్తున్నామని గుర్తు చేస్తూ.. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రూ. 31 వేల కోట్ల రుణమాఫీ ఏకకాలంలో జరగలేదని చెప్పారు.

రుణమాఫీ మోదీ హామీ కాదు.. ఇది రాహుల్ గాంధీ హామీ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నికర ఆదాయంగా ఉన్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ రూ. 28 వేల కోట్లు కూడా రైతు రుణమఫీ చేయలేకపోయారని, లక్ష రుణమాఫీ కోసం ఐదేళ్లలో నాలుగు దఫాలుగా రూ. 25 వేల చొప్పున రుణమాఫీ చేశారని విమర్శించారు.


Also Read: ఏపీలో మూడు చోట్ల కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు.. ఎక్కడెక్కడ అంటే?

ఈ రుణమాఫీ ప్రక్రియపై ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించేలా బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం విజయవంతంగా ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ఏ రైతూ నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి ఈ నిర్ణయాన్ని తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

ప్రజా భవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు మంత్రులు మాట్లాడారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.

మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత కరెంట్ గురించి, ఆరోగ్య శ్రీ పథకం, ఇందిరమ్మ ఇళ్ల గురించి ప్రజలు ఇప్పటికీ చర్చించుకుంటారని సీఎం గుర్తు చేశారు. రైతు బంధు గురించి రైతులు 20 సంవత్సరాలు చెప్పుకునే విధంగా ప్రక్రియ సాగాలని సూచించారు. రుణమాఫీ పై జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు సభ్యులు రుణమాఫీపై నేషనల్ మీడియాలో చెప్పాలని సూచించారు.

Also Read: బీఆర్ఎస్‌లో మార్పులు, టీఆర్ఎస్ కండువాతో హరీష్‌రావు

‘మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించండి. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించండి. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా ప్రజలకు చెప్పండి. రేపు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలి. ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎక్కడికక్కడ పండుగ వాతావరణంలో సంబురాలు జరుపుకోవాలి. ఏడు నెలల్లో మన ప్రభుత్వం సంక్షేమానికి రూ. 30వేల కోట్లు ఖర్చు చేసింది’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద 62 కోట్ల మంది లబ్ది పొందుతున్నారని,  రూ. 500కే సిలిండర్ అందించడానికి రూ. 200 కోట్లు ఖర్చు చేశామని సీఎం వివరించారు. గృహ జ్యోతి 200 యూనిట్ల లబ్ది 46 లక్షల గృహాలకు అందుతున్నదని తెలిపారు. రైతు భీమా కింద రూ. 734 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×