EPAPER

New Budget Recharge Plans: వీళ్లు కాస్త తగ్గారు.. తక్కువ ధరకే కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. వాటిపై ఓ లుక్కేయండి

New Budget Recharge Plans: వీళ్లు కాస్త తగ్గారు.. తక్కువ ధరకే కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. వాటిపై ఓ లుక్కేయండి

New Budget Recharge Plans: టెలికాం కంపెనీల రీఛార్లు ప్లాన్లను ఒక్కసారిగా పెంచేశాయి. నెట్వర్క్ యూజర్లు తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే ప్లాన్ కోసం వెతికేస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీలు వినియోగదారులను ఆకర్షించడానికి అనేక అద్భుతమైన ప్లాన్‌లను అందిస్తున్నారు. అయితే వోడాఫోన్-ఐడియా (Vi) జియో, ఎయిర్‌టెల్‌ల కంపెనీలను టెన్షన్‌ను పెంచే రూ.1198 ప్లాన్‌  తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ వస్తుంది. జియో గురించి మాట్లాడితే కంపెనీ తన రూ. 1299 ప్లాన్‌లో ఉచిత నెట్‌ఫ్లిక్స్‌ను అందిస్తోంది. జియో ప్లాన్ వోడాఫోన్-ఐడియా కంటే రూ. 101 ధర ఎక్కువగా ఉంటుంది. ఎయిర్‌టెల్ విషయానికి వస్తే  రూ. 1199 ప్లాన్‌ను అందిస్తోంది. అయితే నెట్‌ఫ్లిక్స్ ఇందులో అందుబాటులో లేదు. కాబట్టి ఈ ప్లాన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.


Vodafone-Idea Rs.1198 Plan
వొడాఫోన్ ఐడియా ఈ ప్లాన్ 70 రోజుల సర్వీస్ వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్‌ని ఉపయోగించడానికి కంపెనీ ప్రతిరోజూ 2 GB డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో మీరు డైలీ 100 ఫ్రీ ఎస్ఎమ్ఎస్‌లతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా పొందుతారు. ఈ ప్లాన్‌లో ప్రత్యేకమైన ఏమిటంటే ఇందులో మీరు 70 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందుతారు.

Jio Rs.1299 Plan
జియో ఈ ప్లాన్ వోడాఫోన్-ఐడియా కంటే రూ. 101 ఖర్చుతో కూడుకున్నది. ప్లాన్‌లో లభించే ప్రయోజనాల గురించి మాట్లాడితే మీరు ఇందులో 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో మీరు ఇంటర్నెట్‌ని ఉపయోగించడానికి ప్రతిరోజూ 2 GB డేటాను పొందుతారు. అర్హత ఉన్న వినియోగదారులు ఈ ప్లాన్‌లో అపరిమిత 5G డేటాను కూడా పొందుతారు. అలానే ప్రతిరోజూ 100 ఉచిత SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో మీరు దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా పొందుతారు. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ మొబైల్‌తో పాటు జియో టీవీ, జియో సినిమాలకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది.


Also Read: వామ్మో వామ్మో.. చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లు.. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్..!

Airtel Rs.1199 Plan
ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్‌కు బదులుగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పూర్తిగా 84 రోజుల పాటు అందిస్తోంది. ప్లాన్‌లో మీరు ఇంటర్నెట్‌ని ఉపయోగించడానికి ప్రతిరోజూ 2.5 GB డేటాను పొందుతారు. కంపెనీ 5G కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందుతారు. ఈ ప్లాన్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నెట్‌వర్క్‌లకు రోజుకు 100 ఉచిత SMSలతో పాటు అపరిమిత కాల్‌లను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో మీరు 20 కంటే ఎక్కువ OTTలను అందించే Xstream Playకి ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చు.

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×