EPAPER
Kirrak Couples Episode 1

AP Politics: ఆపరేషన్ ఏపీ!.. బీజేపీ ప్లానేంటి?

AP Politics: ఆపరేషన్ ఏపీ!.. బీజేపీ ప్లానేంటి?

AP Politics: మోదీ వచ్చే ముందు ఈడీ, ఐటీ, సీబీఐ వస్తుంది. ఇది కవిత చేసిన డైలాగే అయినా.. దేశవ్యాప్తంగా బీజేపీ ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతుందనే విమర్శ అయితే ఉంది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల మీదకు జాతీయ దర్యాప్తు సంస్థలను ఎగదోస్తున్నారని అనేక రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ఒక్కరి మీద కూడా ఇలాంటి దర్యాప్తులు జరగవనే ఆరోపణ కూడా ఉంది. తెలంగాణలో ఈడీ, ఐటీ, సీబీఐ దూకుడు మామూలుగా లేదు. ఎందుకంటే బీజేపీ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణే కాబట్టి. మరి, సడెన్ గా ఏపీలో ఎందుకు ఈడీ, ఐటీ హడావుడి? ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్.


వైసీపీకి బీజేపీ ఫ్రెండ్లీ పార్టీ. ఇది ఓపెన్ సీక్రెట్. జగన్, విజయసాయి లాంటి వైసీపీ పెద్దలకు కేంద్రం ఆశీస్సులు ఫుల్లుగా ఉన్నాయంటారు. గడిచిన మూడున్నరేళ్ల పరిణామాలు చూస్తే అలానే అనిపిస్తుంది. అంతా స్మూత్. కానీ, పవన్ కల్యాణ్ యాక్టివ్ కావడంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నట్టు ఉన్నాయి. తెర వెనుక, ఢిల్లీ స్థాయిలో ఏదో జరుగుతోందని అనిపిస్తోంది.

ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాంకు ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరును ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో చేర్చగా.. ఇప్పుడు భూముల కేసులో జయరాంపై ఐటీ ఫోకస్ చేయడం వెనుక రాజకీయ కోణం ఉందా? అనే అనుమానం. మరోవైపు, చంద్రబాబు హయాంలో 2014-2019 మధ్య ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో జరిగిని స్కాప్ పై ఈడీ దృష్టి పెట్టడం.. చంద్రబాబు సన్నిహితులకు సీబీఐ నోటీసులు ఇవ్వడం కూడా సంథింగ్ సంథింగ్ అంటున్నారు. ఎప్పుడో జరిగిన అంశం ఈడీకి ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది? రెండు రోజుల వ్యవధిలోనే ఏపీలో రెండు కీలక పార్టీలను టార్గెట్ చేయడం ఏంటి?


తెలంగాణలో జరిగిన ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కేసు వీడియో రికార్డింగ్స్ లోనూ ఏపీ ప్రస్తావన వచ్చింది. తెలంగాణ తర్వాత తమ నెక్ట్స్ టార్గెట్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఆ ముగ్గురు మధ్యవర్తులు చెప్పినట్టు ఉంది. వైసీపీ, టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వారు అన్నారు. అదే నిజమైతే.. ఆంధ్రప్రదేశ్ పై లోటస్ ఆపరేషన్ ఇప్పటికే మొదలైపోయిందా? తాజా పరిణామాలు అందుకు నిదర్శనమా?

బీజేపీ ఏపీలో బలపడాలంటే.. పవన్ కల్యాణ్ రూపంలో వారికో తురుపు ముక్క రెడీగా ఉన్నారు. అధికారికంగా బీజేపీ, జనసేనల పొత్తు కూడా ఉంది. వైసీపీ మిత్రపక్షం కాకపోయినా.. రహస్య బంధం అయితే ఉంది. కానీ, ఎన్నాళ్లు ఇలా? అన్నిరాష్ట్రాల్లోనూ సొంతంగా ఎదగాలనేది బీజేపీ వ్యూహం. మహారాష్ట్రలో శివసేనతో అవలంభించిన వైఖరి మాదిరి.. మొదట్లో పొత్తు.. ఆ తర్వాత ఎత్తు? ఇదే స్ట్రాటజీని ఏపీలోనూ అమలు చేయాలని చూస్తోందా? ఇన్నాళ్లూ వైసీపీతో ఓకే అన్నట్టుగా ఉన్నా.. ఎల్లకాలం ఇంకో పార్టీపై ఆధారపడలేమని భావిస్తోందా? ఎలాగూ పవన్ తమతో ఉన్నారు కాబట్టి.. వైసీపీ, టీడీపీలను కాదని జనసేనతో కలిసి బలోపేతం కావాలనేది కమల వ్యూహమా? అవినీతి విషయంలో వైసీపీ, టీడీపీలో రెండూ ఒకటేనంటూ రాష్ట్ర బీజేపీ నేతల కామెంట్లు ఎలా అర్థం చేసుకోవాలి? ఇటీవల విశాఖలో మోదీ, పవన్ ల భేటీలో ఆ మేరకు రోడ్ మ్యాప్ ఖరారు అయిందా? అందుకే, ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది కాబట్టి.. ఇప్పటి నుంచే ఏపీపై ఫోకస్ పెంచిందా? మోదీ రావడానికంటే ముందుగానే.. ఆంధ్రప్రదేశ్ లోకి ఈడీ, ఐటీ వస్తోందా? ఇలా అనేక ప్రశ్నలు.

Related News

CM Chandra Babu: సంతకం పెట్టాల్సి వస్తుందనే వెళ్లలేదు, జగన్‌‌కు ఏ నోటీసులు ఇవ్వలేదు: చంద్రబాబు

YS Jagan: ఇంట్లో నేను బైబిల్ చదువుతా.. బయట మాత్రం..: జగన్

Prakash Raj : జస్ట్ ఆస్కింగ్… పవన్‌ను ప్రశ్నించావు సరే, స్టాలిన్‌ను వదిలేశావు ఎందుకు ?

Tirumala Declaration Row: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్.. అప్పట్లో డిక్లరేషన్ ఇచ్చారా?

YS Jagan Press Meet: పక్కదారి పట్టించేందుకే డిక్లరేషన్.. కావాలనే అడ్డుకున్నారు.. జగన్ కామెంట్స్

TTD Ex EO Dharmareddy: ధర్మారెడ్డి ఎక్కడ? ఆచూకీ చెబితే నజరానా

Ysrcp: తిరుపతి.. జగన్‌పై దాడికి కుట్ర! వైసీపీలో అంతా రివర్స్..

Big Stories

×