EPAPER

Kuwait AP Person Shiva Story: ఇది మన తెలుగోడి కథ.. లోకేశ్‌ కృషితో ‘కువైట్ శివకి విముక్తి!

Kuwait AP Person Shiva Story: ఇది మన తెలుగోడి కథ.. లోకేశ్‌ కృషితో ‘కువైట్ శివకి విముక్తి!

ఇది రీల్.. ఇక రియల్ విషయానికి వస్తే.. బతుకు దెరువు కోసం కువైట్‌కు వెళ్లిన శివ పడిన కష్టం గురించి మాట్లాడుకోవాలి. ఎక్కడో ఏడారి మధ్యలో ఎవరికి కనిపించని పరిస్థితిలో ఒంటరిగా జీవితాన్ని వెళ్లదీస్తూ అష్టకష్టాలు పడుతున్నాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన వ్యక్తి శివ.. నాలుగు రూపాయలు సంపాదించాలన్న ఆశతో ఓ ఏజెంట్ సాయంతో కువైట్‌ వెళ్లాడు.. అక్కడి వెళ్లాక ఏడారిలో పశువులను మేపే పనిలో పెట్టారు శివను.
దీంతో తనను ఇక్కడి నుంచి కాపాడాలంటూ ఓ వీడియో చేసి టీడీపీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఏపీ మంత్రి లోకేశ్‌ స్పందించారు.. ఇండియన్ ఎంబసీకి ఇన్ఫామ్ చేశారు. దీంతో అతడిని కాపాడింది.. వెరీ సూన్ అతడిని ఇండియాకు తీసుకురానున్నారు.

అక్కడ రీల్‌లో కావొచ్చు.. ఇక్కడ రియల్‌గా కావొచ్చు.. కథ సుఖాంతమైంది.. కాబట్టి ఆల్ హ్యాపీస్.. కానీ ఇలా బయటికి రాని కథలెన్ని.. ఎడారుల్లో అష్టకష్టాలు పడుతున్నవారి సంఖ్య ఎంత? మరి వీరందరి సంగతేంటి? అనేది ఇప్పుడు అసలు క్వశ్చన్.. ఉన్న ఊర్లో సరైన ఉపాధి దొరకదు. ఒకవేళ దొరికినా వచ్చే సంపాదన సరిపోదు. వ్యవసాయం చేసుకునేందుకు సరైన పరిస్థితులు లేక.. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది గల్ఫ్‌లో పనులు చేసేందుకు వెళ్తారు. ఇక్కడ ఓ ఏజెంట్‌ను సంప్రదించడం.. డబ్బులు సమర్పించుకోవడం. ఫ్లైట్ ఎక్కేయడం.. అక్కడ ఓ అరబ్‌ షేక్‌ చేతిలో పడి జీవితాలను పాడు చేసుకోవడం. ఇదంతా ఇప్పుడు రోటిన్‌గా మారింది.


నిజానికి విదేశాల్లో సరైన ఉద్యోగం కావాలంటే సరైన స్కిల్స్ ఉండాలి. కానీ ఎలాంటి స్కిల్స్‌ లేని.. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే చదువు కూడా రానీ వారిని ఏజెంట్స్ టార్గెట్ చేసుకుంటున్నారు. కంపెనీ ఉద్యోగాలన్ని  వీసాలు ఇప్పిస్తామని నమ్మించి ఎడారి దేశాలకు పంపుతున్నారు. ఇలా వెళ్లే వారిలో మహిళలు కూడా ఉంటున్నారు. వీరందరి నుంచి డబ్బుల కూడా వసూలు చేస్తున్నారు. తీరా ఫ్లైట్ దిగి డెస్టినేషన్‌ చేరాక.. చెప్పిన ఉద్యోగం ఉండదు. మొక్కలు పెంచడం, అక్కడి పంటలకు కాపాలా ఉండంటు, గొర్రెలు, ఒంటెల పెంపకం దారులుగా పనిచేయడం.. ఇలాంటి ఉద్యోగాలు ఇస్తున్నారు. అక్కడ చిక్కుకున్నాక తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. ఎవరిని సంప్రదించాలో కూడా తెలియదు. ఇక కొందరైతే అక్కడి అరబ్బులు పెట్టే చిత్రహింసలకు కూడా బలైపోతున్నారు. మరి ఈ పరిస్థితులు మారాలంటే ఏం చేయాలి?

Also Read: మనసు మార్చుకున్న జగన్, అసెంబ్లీ సమావేశాలకు హాజరు!

తెలంగాణ వారంతా విదేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ అని ఓ సంస్థ ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తోంది. ఇతర దేశాల్లో ఏదైనా ఉపాధి అవకాశాలు ఉంటే ఇందులో పోస్ట్ చేస్తారు. అక్కడి నుంచి అధికారికంగా మనం అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందులో అభివృద్ధి చెందిన దేశాల్లో అవసరమైన ఉద్యోగాల సమాచారం మాత్రమే అందుబాటులో ఉంటుంది. గల్ఫ్‌ దేశాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉండదు. కారణం అరబ్ దేశాలకు వెళ్లి పనులు చేసే వారికి సరైన స్కిల్ ఉండదు. నిజానికి వారు కూడా పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయడం లేదు. ఎందుకంటే సెక్యూరిటీ గార్డుల నుంచి కూలీ పనుల వరకు అన్ని రకాల పనులు చేస్తున్నారు మనవాళ్లు.. కాబట్టి.. ఏదో ఒక ఉద్యోగం పేరు చెప్పి వారిని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు ఏజెంట్లు..
వీరు మాత్రం అరబ్‌ షేక్‌ల నుంచి భారీగా డబ్బు దండుకుంటున్నారు. అయితే ఇకపై ఇలాంటి విధానాలకు చెక్ పడాలి.. అప్పుడే ఇలాంటి గోసలు తప్పుతాయి.

రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉపాధి కోసం ఇలా అరబ్ దేశాలకు వెళ్లే వారిపై దృష్టి సారించాలి. అక్కడ ఉద్యోగాలు నిజంగానే ఉన్నాయా? ఉంటే ఉద్యోగులకు సరైన సదుపాయాలు కల్పిస్తున్నారా? లేదా? ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితేంటి? ఇలా అన్ని విషయాలపై ఆరా తీయాలి. అవసరమైతే అక్కడి ప్రభుత్వంతో నేరుగా సంప్రదించే విధంగా ఏర్పాట్లు చేయాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు రీపిట్ కాకుండా ఉంటాయి. లేదంటే ఆడుజీవితం.. శివలాంటి కథలు రీపిట్ అవుతూనే ఉంటాయి.

Related News

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Jammu Kashmir Elections: కశ్మీర్ ఎన్నికలు.. కమలానికి అగ్నిపరీక్షే..

Why Atishi as Delhi CM: సీఎంగా అతిశీనే ఎందుకు? కేజ్రీవాల్ ప్లాన్ ఏంటి?

Amaravati: అమరావతి సేఫ్.. ఇక దూసుకుపోవడమే

Arvind Kejriwal Resignation: కేజ్రీ కొత్త వ్యూహం ఫలిస్తుందా?

Big Stories

×